For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏపీ ప్రభుత్వంతో 'పవర్' యుద్ధం, 21 పీపీఏల రద్దుకు అడుగు

|

అమరావతి: వైసీపీ ప్రభుత్వం వచ్చాక PPAలపై వివాదం కొనసాగుతోంది. పునరుత్పాదక ఇంధన సంస్థలు, ఆంధ్రప్రదేశ్ మధ్య యుద్ధం నడుస్తోంది. సుజ్లాన్ ఎనర్జీ, యాక్సిస్ ఎనర్జీతో ఒప్పందం కుదుర్చుకున్న 21 కంపెనీలు తమ విండ్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్‌ను రద్దు చేసుకోవాలని APSPDCL కోరింది. దీంతో ఇది మరింత వేడి రాజేస్తోంది. 776.9 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విండ్ పవర్ రద్దు ఉపసంహరణ అంశం కంపెనీలకు, క్లయింట్స్‌కు ఇబ్బందికర పరిణామం.

15 రోజుల్లో చెల్లించండి: ఆంధ్రప్రదేశ్‌కు ఎన్టీపీసీ లీగల్ హెచ్చరికలు 15 రోజుల్లో చెల్లించండి: ఆంధ్రప్రదేశ్‌కు ఎన్టీపీసీ లీగల్ హెచ్చరికలు

చుక్కెదురైనా ప్రభుత్వం ఇలా...

చుక్కెదురైనా ప్రభుత్వం ఇలా...

PPAల విషయంలో ఇటీవల జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. 40 ప్రైవేటు విద్యుత్ సంస్థలు పీపీఏల పునఃసమీక్షపై హైకోర్టుకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో పీపీఏలను పునఃసమీక్షించకు సంబంధించి APSPDCL రాసిన లేఖలను నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసింది. అలాగే, పీపీఏల పునఃసమీక్షకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీపై కూడా నాలుగు వారాలు స్టే విధించింది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీ ప్రభుత్వం తీరును తప్పుబట్టింది. అయినప్పటికీ ప్రభుత్వం ముందుకే వెళ్తోంది.

విండ్ ఎనర్జీ పీపీఏల ఉపసంహరణకు పర్మిషన్..

విండ్ ఎనర్జీ పీపీఏల ఉపసంహరణకు పర్మిషన్..

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్... స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వద్ద మెమోను ఫైల్ చేసింది. 21 విండ్ పీపీఏలు ఉపసంహరించుకోవాలని అందులో పేర్కొంది. పవర్ పర్చేస్ అగ్రిమెంట్ (PPA)లు ఉపసంహరించుకునేందుకు అనుమతివ్వాలని రెగ్యులేటర్స్ కమిషన్‌ను కోరింది.

ఆ స్వేచ్ఛ ఉంది

ఆ స్వేచ్ఛ ఉంది

ఆంధ్రప్రదేశ్ డిస్కంల ఆర్థిక ఇబ్బందులు, 21 పవర్ డెవలపర్స్ నుంచి కొనుగోలు చేయడం ద్వారా అదనపు ఆర్థిక భారం భరించలేని కారణంగా సుజ్లాన్, యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా, వారి క్లయింట్స్ నుంచి PPAలు రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఏపీఎస్‌పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఆ మెమోలో పేర్కొన్నారు. పీపీఏలు ఇంకా అప్రూవ్ చేయలేదని, కాబట్టి వాటిని వెనక్కి తీసుకునే స్వేచ్ఛ ఉందని పేర్కొంది.

పీపీఏల ఉపసంహరణ

పీపీఏల ఉపసంహరణ

సుజ్లాన్, యాక్సిస్ ఎనర్జీ యొక్క వివిధ పవన విద్యుత్ ప్రాజెక్టుల క్లయింట్స్ 21 పీపీఏలను ఉపసంహరించుకునేందుకు అనుమతి కోరింది. జూన్ 19వ పీపీఏల రద్దుకు తీర్మానం చేశారు. ఈ మేరకు APERC ఎదుట పిటిషన్ ఫైల్ చేయాలని APCC నిర్ణయించింది. APCC రెగ్యులేటర్స్ సమ్మతిని కోరింది.

English summary

ఏపీ ప్రభుత్వంతో 'పవర్' యుద్ధం, 21 పీపీఏల రద్దుకు అడుగు | Andhra Pradesh seeks to cancel 21 wind projects

Twenty one projects of wind energy company Suzlon and Axis Energy and their clients in Andhra Pradesh, of total capacity of 776.9 MW are likely to face turbulence and possible withdrawal.
Story first published: Monday, July 29, 2019, 10:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X