For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI గుడ్‌న్యూస్: ఆ ఛార్జీల్లో సెప్టెంబర్ 1 నుంచి మార్పులు

|

ప్రభుత్వ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. ఎగుమతులకు సంబంధించిన సర్వీస్ ఛార్జీలను సవరిస్తున్నట్లు తెలిపింది. ట్రేడర్లకు సంబంధించిన ఎగుమతి లావాదేవీలకు మాత్రమే ఇది వర్తిస్తుందని పేర్కొంది. వ్యాపారం సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఛార్జీలను సవరించిన సమయంలో ఎస్బీఐ వివిధ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్స్ కౌన్సెల్స్ నుంచి వచ్చిన సలహాలు, సూచనలు స్వీకరించింది.

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, HRA ఎలా లెక్కిస్తారంటే?ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, HRA ఎలా లెక్కిస్తారంటే?

ఒకేసారి చెల్లించేలా...

ఒకేసారి చెల్లించేలా...

ప్రస్తుతం ప్రతి ట్రాన్సాక్షన్‌కు వివిధ రకాల ఛార్జీలు ఉన్నాయి. దానికి భిన్నంగా ఏడాదికి ఒకసారి చెల్లించే విధంగా ప్రస్తుత విధానాన్ని సవరించారు. ఇది ఎగుమతిదారులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. సవరించిన ఎగుమతిదారులకు ఎంతో సహాయకారిగా ఉంటాయని, అలాగే ఎగుమతులను మెరుగుపరిచేలా ఉంటాయని ఎస్బీఐ ఆశిస్తోంది. సవరించిన చార్జీలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి.

రెండు కేటగిరీలు..

రెండు కేటగిరీలు..

ఎక్స్‌పోర్ట్ ట్రాన్సాక్షన్స్‌కు చెందిన సర్వీస్ ఛార్జీలు రెండు కేటగిరీలుగా ఉంటాయి. ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ కస్టమర్స్, నాన్ ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ కస్టమర్లుగా ఉంటాయి. అలాగే ఎంఎస్ఎంఈ, నాన్ ఎంఎస్ఎంఈ కస్టమర్ల ప్రాతిపదికన ఛార్జీలు ఉంటాయని బ్యాంకు తెలిపింది. ఎగుమతిదారులకు వ్యాపార నిర్వహణ సులభతరం చేయడం, ఖర్చు వివరాలు స్పష్టంగా వారికి తెలియజేయడం వంటి అంశాలు లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ తెలిపింది.

ఎస్బీఐ..

ఎస్బీఐ..

మార్చి 31, 2019 నాటికి ఎస్బీఐ వద్ద 29 లక్షల కోట్ల డిపాజిట్స్ ఉన్నాయి. CASA (కరెంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్స్ రేషియో) 22 లక్షల కోట్లతో 45.74 శాతం కలిగి ఉంది. హోమ్, ఆటో లోన్స్‌లో ఎస్బీఐ వాటా 33 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా బ్యాంకుకు 22,010 బ్రాంచీలు ఉన్నాయి. 58,000కు పైగా ఏటీఎం, సీడీఎం నెట్ వర్క్స్ ఉన్నాయి.

English summary

SBI గుడ్‌న్యూస్: ఆ ఛార్జీల్లో సెప్టెంబర్ 1 నుంచి మార్పులు | SBI service charges revised from September 1

State Bank of India has revised their export related service charges. This has been done to improve the ease of doing business and provide clear visibility of cost structure to exporters. While revising the charges, SBI has taken into consideration the views from various export promotion councils.
Story first published: Friday, July 26, 2019, 16:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X