For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫార్చూన్ 500: IOCని దాటి మొదటిస్థానంలో రిలయన్స్, ఆ చైనా కంపెనీకి చోటు

|

ముంబై: ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) మరో ఘనత సాధించింది. పార్చూన్ గ్లోబల్ 500 జాబితాలో దూసుకెళ్లింది. ఈ జాబితాలో ఐవోసీని వెనక్కి నెట్టి, దేశీయంగా అగ్రస్థానం సంపాదించింది. గత ఏడాదితో పోలిస్తే RIL 42స్థానాలు ఎగబాకి, 106వ స్థానంలో నిలిచింది. అదే సమయంలో ప్రభుత్వరంగ IOC 117వ స్థానం దక్కించుకుంది. 2010వ సంవత్సరం నుంచి IOC అగ్రస్థానంలో ఉంటూ వస్తోంది. ఇప్పుడు దీనిని RIL వెనక్కి నెట్టిందని పార్చూన్ తెలిపింది. IOC రెండో స్థానంతో సరిపెట్టుకుంది.

వార్నింగ్ బెల్: ఈ-కామర్స్, ఐటీ సెక్టార్‌లో తగ్గనున్న ఉద్యోగాలువార్నింగ్ బెల్: ఈ-కామర్స్, ఐటీ సెక్టార్‌లో తగ్గనున్న ఉద్యోగాలు

టాప్ 500లో ఇండియన్ కంపెనీలు

టాప్ 500లో ఇండియన్ కంపెనీలు

ఫార్చూన్ 500 జాబితాలో మన దేశానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, IOC, ONGC, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా మోటార్స్, భారత్ పెట్రోలియం కార్పోరేషన్, రాజేశ్ ఎక్స్‌పోర్ట్ తదితర కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. ఇంటర్నేషనల్ స్థాయిలో ONGC 37 స్థానాలు ఎగబాకి 160వ స్థానానికి చేరుకుంది. SBI 20వ స్థానాలు దిగజారి 236వ స్థానానికి పడిపోయింది. టాటా మోటర్స్ 33వ స్థానాలు తగ్గి, 265వ స్థానానికి పడిపోయింది. BPCL 39 స్థానాలు ఎగబాకి 275వ స్థానానికి చేరుకుంది. రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ 90వ స్థానాలు దిగజారి 495వ స్థానానికి పడిపోయింది.

రిలయన్స్ ఇలా ఎగబాకింది...

రిలయన్స్ ఇలా ఎగబాకింది...

2018లో 62.3 బిలియన్ డాలర్లుగా ఉన్న RIL ఆదాయం ఈ ఏడాదిగాను 32.1 శాతం పెరిగి, 82.3 బిలియన్ డాలర్లకు, IOC ఆదాయం 17.7 శాతం పెరిగి, 65.9 బిలియన్ డాలర్ల నుంచి 77.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

గత పదేళ్లుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ సరాసరి వృద్ధి 7.2 శాతం కాగా, IOC వృద్ధి 3.64. 2010లో రిలయన్స్ ఆదాయం 41.1 బిలియన్ డాలర్లు కాగా,

ఇప్పుడు రెండింతలు (83 బిలియన్ డాలర్లు)గా ఉంది. IOC ఆదాయం 2010లో 54.3 బిలియన్ డాలర్లు ఉండగా, ఇది 50% వృద్ధి సాధించింది. గ్లోబల్ ఫార్చూన్‌లో పదహారేళ్లుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థానం దక్కించుకుంటోంది. ఇప్పుడు ఏకంగా దేశీయంగా తొలి స్థానంలో నిలిచింది.

వాల్‌మార్ట్‌కు తొలి స్థానం.. టాప్ 10 ఇవే..

వాల్‌మార్ట్‌కు తొలి స్థానం.. టాప్ 10 ఇవే..

ఫార్చ్యూన్ 500 లిస్టులో అమెరికాకు చెందిన వాల్‌మార్ట్ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత చైనా ప్రభుత్వరంగ చమురు - సహజవాయువు కంపెనీ సినోపెక్ గ్రూప్ రెండో స్థానంలో ఉండగా, డచ్ కంపెనీ రాయల్ డచ్ షెల్ మూడో స్థానంలో, చైనా నేషనల్ పెట్రోలియం 4వ స్థానంలో, స్టేట్ గ్రిడ్ ఐదో స్థానంలో, సౌదీ చమురు సంస్థ సౌదీ ఆరామ్‌కో ఆరో స్థానంలో, బీపీ ఏడో స్థానంలో, ఎగ్జాన్ మొబిల్ ఎనిమిదో స్థానంలో, ఫోక్స్‌వ్యాగన్‌ తొమ్మిదవ స్థానంలో, టయోటా మోటార్స్ పదవ స్థానంలో నిలిచాయి.

తక్కువ కాలంలో ఫార్చూన్ 500లో షియోమీ

తక్కువ కాలంలో ఫార్చూన్ 500లో షియోమీ

ఫార్చూన్ 500 జాబితాలో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీకి చోటు దక్కింది. కార్యకలాపాలు ప్రారంభించిన తక్కువ కాలంలో ఈ ఘనత సాధించింది. తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ కంపెనీ ఫార్చూన్ 500 జాబితాలో 468వ ర్యాంకు సాధించింది. గత ఏడాదిలో 26.44 బిలియన్ డాలర్ల ఆదాయం, 2 బిలియన్ డాలర్ల లాభాలు నమోదు చేసింది. ఇటీవలే షియోమీ.. చైనా ఫార్చూన్ 500 జాబితాలో 53వ స్థానంలో నిలిచింది.

English summary

ఫార్చూన్ 500: IOCని దాటి మొదటిస్థానంలో రిలయన్స్, ఆ చైనా కంపెనీకి చోటు | Reliance Industries topples IOC to become highest ranked on Fortune Global 500 list

Mukesh Ambani led Reliance Industries has jumped 42 places to become the highest ranking Indian firm on the Fortune Global 500 list.
Story first published: Wednesday, July 24, 2019, 8:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X