For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఏడాది సినిమా రంగాన్ని దాటనున్న డిజిటల్ మీడియా, 2021 నాటికి 35వేల కోట్లకు...

|

న్యూఢిల్లీ: డిజిటల్ మీడియా మార్కెట్ చాలా వేగంగా పెరుగుతోందని, 2019లో ఇది ఫిలిమ్ రంగాన్ని అధిగమించవచ్చునని, అలాగే, 2021 నాటికి ప్రింటి మీడియాను అధిగమించే అవకాశాలు ఉన్నాయని FICCI-EY రిపోర్ట్ వెల్లడించింది. 2021 నాటికి డిజిటల్ మీడియా మార్కెట్ 5.1 బిలియన్ డాలర్లకు (35వేల కోట్ల డాలర్లు) చేరుకుంటుందని అంచనా వేశారు. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇది డిజిటల్ మీడియా మార్కెట్‌కు ఊతమిస్తోంది. ఈ రిపోర్ట్ ప్రకారం....

పెట్రోల్ బంకులో మీరు ఈ సేవలు ఉచితంగా పొందవచ్చుపెట్రోల్ బంకులో మీరు ఈ సేవలు ఉచితంగా పొందవచ్చు

2018లో డిజిటల్ మీడియా 42 శాతం వృద్ధి

2018లో డిజిటల్ మీడియా 42 శాతం వృద్ధి

2018లో డిజిటల్ మీడియా రంగం 42 శాతం వృద్ధిని సాధించింది. ఇండియన్స్ తమ మొబైల్ ఫోన్లలో 30 శాతాన్ని సినిమాలు వంటి ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఖర్చు చేస్తున్నారు. 2019లో డిజిటల్ మీడియా మార్కెట్ 3.2 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. గత ఏడాది 2.5 బిలియన్ డాలర్లుగా ఉన్న సినిమా రంగం... ఏడాదిలో 2.8 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఆ లెక్కన సినిమా రంగాన్ని డిజిటల్ రంగం దాటనుంది.

రెండేళ్లలో ప్రింటి మీడియా కంటే అధికం

రెండేళ్లలో ప్రింటి మీడియా కంటే అధికం

ప్రింట్ మీడియా 4.4 బిలియన్ డాలర్లు ఉంది. ఇది 2021 నాటికి 4.8 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నివేదిక అంచనా. గత ఏడాది 42 శాతం వృద్ధి సాధించిన డిజిటల్ మీడియా 2.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది ఎంటర్‌టైన్మెంట్ రంగాన్ని దాటి (3.2 బిలియన్ డాలర్లు), 2021లో ప్రింటి మీడియాను దాటి (5.1 బిలియన్ డాలర్లు) ముందుకెళ్తుందని అంచనా.

ఆన్‌లైన్ వీడియో యూజర్లు...

ఆన్‌లైన్ వీడియో యూజర్లు...

2018లో ఆన్‌లైన్ వీడియో యూజర్లు 325 మిలియన్లు. ఇందులో 150 మిలియన్లు ఆడియో స్ట్రీమింగ్ యూజర్లు. 2021 నాటికి దేశంలో ఓవర్ ది టాప్ (OTT) వీడియో సేవల సబ్‌స్క్రిప్షన్ చెల్లింపులు జరిపేవారు 3-3.5 కోట్ల స్థాయికి పెరగవచ్చునని అంచనా. ఆడియో సేవల సబ్‌స్క్రిప్షన్ 60-70 లక్షలకు చేరవచ్చునని నివేదిక తెలిపింది.

డిజిటల్ మీడియా దూసుకెళ్తోంది..

డిజిటల్ మీడియా దూసుకెళ్తోంది..

ప్రపంచంలో ఇంటర్నెట్ యూజర్ల చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. భారత్‌లో 57 కోట్ల మంది యూజర్స్ ఉన్నారు. ప్రతి సంవత్సరం 13 శాతం చొప్పున పెరుగుతున్నారు. ప్రస్తుతం ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయం 2.2 బిలియన్ డాలర్లుగా ఉంది. రానున్న రెండేళ్లలో ఇది రెండింతలు పెరిగి 4.3 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఇక సబ్‌స్క్రిప్షన్ ఆధారిత మోడల్ 80 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చు. రానున్న అయిదేళ్లలో ఇంటర్నెట్ చూసే సమయం మూడు నుంచి 3.5 రెట్లు పెరగనుందని నివేదిక తెలిపింది. ఆన్‌లైన్ వీడియో, ఆడియో వినియోగంలో 60% టెలికాం ఆపరేటర్ల కస్టమర్ల ద్వారానే ఉంది. 2021 నాటికి 75 శాతానికి చేరుకోవచ్చని అంచనా.

Read more about: report india ఇండియా
English summary

ఈ ఏడాది సినిమా రంగాన్ని దాటనున్న డిజిటల్ మీడియా, 2021 నాటికి 35వేల కోట్లకు... | Digital media to reach $5.1 billion by 2021: Report

The digital media is likely to overtake film entertainment in 2019 and the print media by 2021 to reach a target of $5.1 billion in two years, media reports have cited a FICCI-EY report.
Story first published: Tuesday, July 23, 2019, 12:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X