భారత స్టార్టుప్ చరిత్ర లో సరికొత్త అధ్యాయం. కంపెనీలు నెలకొల్పి పదేళ్లు ఐనా కాకుండా బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ కు వెళ్లిన స్టార్టుప్ కంపెనీల సంఖ్య మన దేశం లో నానాటికీ పెరుగుతోంది. ఫ్లిప్కార్ట్, ఓలా, ఓయో లాంటి కంపెనీలే ఇందుకు నిదర్శనం. ఇన్వెస్టర్ల మనసు గెలిచి వేళ కోట్ల పెట్టుబడులను ఆకర్షిండం ద్వారా ఆయా కంపెనీల ప్రమోటర్లు బిలియనీర్లు అవుతున్నారు. ఇంత వరకు ఒక అధ్యాయం అయితే, ఇప్పుడు జరగ బోతోంది మరో సరికొత్త మైలు రాయిగా నిలవనుంది.
ఆన్లైన్ హోటల్ గదుల అగ్రిగేటర్ కంపెనీ ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ ఇందుకు వేదిక కాబోతోంది. ఇంతకూ అసలు విషయం ఏంటంటే... ఓయో ఫౌండర్ రితేష్ అగర్వాల్ ... కంపనీలో తన వాటా ను భారీగా పెంచుకొంటున్నారు. కొత్తగా 20 శాతానికి పైగా వాటాను ఆయన కొనుగోలు చేయనున్నారు. ఇందుకోసం ఏకంగా 2.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ 15,400 కోట్లు) మేరకు వెచ్చించనున్నారు. ఈ విషయాన్నీ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది.

రెండో అతిపెద్ద వాటా దారు....
ప్రస్తుతం కంపెనీ ఫౌండర్ రితేష్ అగర్వాల్ కు ఓయో లో కేవలం 10 శాతం వాటా ఉంది. దీనికి ప్రస్తుత ప్రతిపాదిత కొనుగోలు ద్వారా 32 % నుంచి 33% వరకు పెంచుకోనున్నారు. ఇందు కోసం ఓయో లో పెట్టుబడి పెట్టిన ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు ఐన సేకోయ కాపిటల్, లైట్ స్పీడ్ వెంచర్ పార్టనర్స్ల నుంచి వాటాలను కొనుగోలు చేయబోతున్నారు. అలాగే కొత్తగా కూడా కొంత వాటా ను నేరుగా ఓయో నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ డీల్ ద్వారా .... సేకోయ కేపిటల్ కు సుమారు 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ 3,500 కోట్లు ), లైట్ స్పీడ్ సంస్థకు 1 బిలియన్ డాలరు (సుమారు రూ 7,000 కోట్లు ) దక్కనున్నాయి. మిగితా మొత్తం ఓయో కు పెట్టుబడి రూపం లో చేరనుంది. ఇంత భారీ పెట్టుబడితో ఒక స్టార్టుప్ కంపెనీ ఫౌండర్ తన సొంత కంపెనీలోనే బైబ్యాక్ పధ్ధతి లో షేర్లను కొనుగోలు చేస్తుండటం భారత దేశ చరిత్రలోనే ప్రథమం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

అతిపెద్ద వాటా దారు సాఫ్ట్ బ్యాంకు.....
జపాన్ కు చెందిన పెట్టుబడుల దిగ్గజం సాఫ్ట్ బ్యాంకు ... ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ కంపెనీలో అతి పెద్ద వాటా దారుగా ఉంది. దీనికి ఏకంగా 48% వాటా ఉంది. అయితే, ప్రస్తుతం ఫౌండర్ అతని సంస్థలు, ఇతర పెట్టుబడి సంస్థల మధ్య ఉన్న ఒప్పందం మేరకు సాఫ్ట్ బ్యాంకు కు మరో 1.9 శాతం వాటా మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది.

నిధులు అందించనున్న నోమురా...
నిజానికి ఇంత పెద్ద మొత్తంలో నిధులను సమీకరించు కోవటం ఏ ప్రమోటర్ కైనా కష్టమైన పనే. అందుకే.. రితేష్ అగర్వాల్ నిధుల కోసం మరో జపాన్ దిగ్గజం నోమురా సహాయం తీసుకోనున్నారు సమాచారం. 2. 2 బిలియన్ డాలర్లు సర్దుబాటు చేసేందుకు నోమురా సంసిద్ధ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఋణం తో పాటు, వివిధ మార్గాల్లో ఈ నిధులను సమకూర్చనుంది.

సొంత పెట్టుబడి కంపెనీ పేరుతో కొనుగోలు...
రితేష్ అగర్వాల్ ఇటీవలే... ప్రపంచం లోని పన్ను స్వర్గధామాల్లో ఒకటైన కీమెన్ ఐలాండ్ లో ఆర్ ఏ హాస్పిటాలిటీ పేరుతొ సొంత ఇన్వెస్ట్మెంట్ కంపెనీని ఏర్పాటు చేసారు. ఈ కంపెనీ తో ఓయో పేరెంట్ కంపెనీ ఐన ఓరావెల్ స్టే స్ లో పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ మేరకు రితేష్ అగర్వాల్ కంపెనీ భారత ప్రభుత్వ అనుమతుల కోసం దరఖాస్తు చేసింది.

సేకోయ, లైట్ స్పీడ్ లకు జాక్ పాట్ ....
ఓయో హోటల్స్ లో ప్రాధమిక స్థాయిలో పెట్టుబడి పెట్టిన సేకోయ, లైట్ స్పీడ్ సంస్థలకు ఈ డీల్ తో జాక్ పాట్ తగిలినట్లే. దాదాపు 10% వాటా కలిగిన సేకోయ కు కేవలం 5% వాటా విక్రయంతో నే 500 మిలియన్ డాలర్లు లభించనున్నాయి. అలాగే, లైట్ స్పీడ్ కంపెనీ కేవలం 200 మిలియన్ డాలర్లకు 13. 5% వాటాను కొనుగోలు చేస్తే... ఇప్పుడు ఏకంగా 1 బిలియన్ డాలర్ల మేరకు ప్రతిఫలం లభించబోతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications