For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్వెస్టర్లు ట్రేడ్ అలర్ట్స్ పై నిర్లక్ష్యం వద్దు...

|

స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వీటి విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్ల మీ ఖాతాలోని సొమ్ము ఖాళీ అయ్యే పరిస్థితి రావొచ్చు. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని స్టాక్ మార్కెట్లు ఎస్సెమ్మెస్ తో పాటు ఈ-మెయిల్ కు ట్రేడింగ్ కు సంబంధించిన అలర్టులను పొందే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. వీటిని వినియోగించుకోవడం వల్ల మేలు జరుగుతుంది.

* ఇన్వెస్టర్ల ఖాతాల ద్వారా అనధికారిక స్టాక్ మార్కెట్ లావాదేవీలు నిర్వహించ కుండా ఉండటానికి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి (ఎన్ఎస్ఈ) చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వారి లావాదేవీలకు సంబంధించి ఎస్సెమ్మెస్ తోపాటు ఈమెయిల్ అలర్టులను రిటైల్ ఇన్వెస్టర్లకు పంపుతోంది.

ఇవీ సదుపాయాలు...

ఇవీ సదుపాయాలు...

* ఈ సదుపాయాన్ని ఉచితంగానే అందిస్తోంది.

* మార్కెట్ ట్రేడింగ్ పని గంటలు ముగిసిన తర్వాత ఈ అలర్టులు అందుతాయి.

* ఎన్ఎస్ఈలో జరిగే ట్రేడింగులకు సంబంధించి మాత్రమే ఈ అలర్టులు ఉంటాయి.

* క్యాష్ ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, డెట్ సెగ్మెంట్ లకు ఇవి అందుతాయి.

* ఎం ఎస్ ఈ లో ట్రేడింగ్ జరిపిన రోజు మాత్రమే ఈ అలర్ట్‌లు వస్తాయి.

ఇలా చేయండి...

ఇలా చేయండి...

* తమ లావాదేవీలకు సంబంధించిన అలర్టులను పొందాలనుకుంటే ఇన్వెస్టర్లు తమ స్టాక్ బ్రోకర్లకు ఇమెయిల్ ఐడీ తో పాటు మొబైల్ నెంబర్ ను ఇవ్వాలి.

* ఈ వివరాలను ఎన్ ఎస్ ఈ రికార్డుల్లో నమోదు చేసిందీ లేనిదీ సరి చూసుకోవాలి.

* ఒకవేళ నెంబర్ లేదా ఇమెయిల్ ఐడీని మార్చుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ తమ స్టాక్ బ్రోకర్ ను సంప్రదించాల్సి ఉంటుంది.

ఈ సమాచారం అందుతుంది..

ఈ సమాచారం అందుతుంది..

* ఎస్సెమ్మెస్ ద్వారా సెగ్మెంట్ వారీగా మొత్తం ట్రేడ్ అయిన విలువ తెలియజేస్తారు. పాన్, మొబైల్ నెంబర్ వివరాలు కూడా అందులో ఉంటాయి.

* ఇ-మెయిల్ కు షేర్ల క్రయ విక్రయాలు ఏ ధర వద్ద జరిగింది అన్న వివరాలు అందుతాయి. ట్రేడింగ్ కు సంబంధించిన గణాంకాలు పీడీఎఫ్ రూపంలో అందుతాయి. ఏమైనా తేడాలు ఉంటే దీనిద్వారా సరి చూసుకోవచ్చు.

* తాము నిర్వహించని లావాదేవీలకు సంభందించి సమాచారం అందిన సందర్భంలో వెంటనే స్టాక్ బ్రోకర్ ను సంప్రదించాలి. వారు ఇచ్చే సమాచారం సంతృప్తి కరంగా లేకపోతే ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్ సర్వీసెస్ సెల్ ఫోన్ నెంబరు (022-26754312 / 1800220058)ను సంప్రదించాలి.

* క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాల మేరకు స్టాక్ మార్కెట్లు తప్పని సరిగా ట్రేడింగ్ గంటలు ముగిసిన తర్వాత ఆ రోజు లావాదేవీలు నిర్వహించిన ఇన్వెస్టర్లకు ఎస్సెమ్మెస్, ఇమెయిల్ ద్వారా అలర్టులను పంపాల్సి ఉంటుంది.

స్టాక్ మార్కెట్లో లావాదేవీలు డబ్బులతో ముడిపడి ఉంటాయి కాబట్టి ఈ లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించడం వల్ల అనధికారిక లావాదేవీలు జరిగినప్పుడు వెంటనే స్పందించడానికి అవకాశం ఏర్పడుతుంది.

English summary

ఇన్వెస్టర్లు ట్రేడ్ అలర్ట్స్ పై నిర్లక్ష్యం వద్దు... | Investors to get trade alerts through SMS, email

In a circular, BSE told its member brokers that it would start sending trade alerts through SMS and email to retail investors in new format soon.
Story first published: Friday, July 19, 2019, 16:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X