For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI ఆన్‌లైన్ కస్టమరా?: మీకు గుడ్‌న్యూస్, ఇంటి కల సాకారం!

|

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు ఇతర బ్యాంకులతో పోలిస్తే తక్కువకే రుణాలు అందిస్తోంది. ఇప్పుడు ఎస్బీఐ హోమ్ లోన్ రేట్‌ను మరింత తగ్గించింది. ఇప్పుడు SBI కేవలం 8.40 శాతం వడ్డీరేటుకు ఇంటి రుణాన్ని ఆఫర్ చేస్తోంది. ఎస్బీఐ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారికి అప్లై అవుతుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఎస్బీఐ తెలియజేసింది. మీరు 8.40 శాతం (ప్రారంభం) వడ్డీ రేటు నుంచి హోమ్ లోన్స్ తీసుకోవచ్చునని తెలిపింది.

గుడ్‌న్యూస్: హోమ్ లోన్స్ సహా రుణాలు మరింత చౌక, వడ్డీరేటు తగ్గించిన SBIగుడ్‌న్యూస్: హోమ్ లోన్స్ సహా రుణాలు మరింత చౌక, వడ్డీరేటు తగ్గించిన SBI

హోమ్ లోన్ ఈ సందర్భాల్లో తీసుకోవచ్చు

హోమ్ లోన్ ఈ సందర్భాల్లో తీసుకోవచ్చు

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసే సమయంలో మీ పేరు, నగరం పేరు, భాష, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ వంటివి పొందుపర్చాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఎస్బీఐ నుంచి ఫోన్ కాల్ వస్తుంది.

హోమ్ లోన్ వివిధ సందర్భాల్లో తీసుకోవచ్చు.

- సిద్ధంగా ఉన్న ఇళ్లు లేదా ప్లాట్ కొనుగోలు చేయవచ్చు.

- నిర్మాణంలో ఉన్న ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేయవచ్చు.

- ఇళ్లు లేదా ఫ్లాట్ రిపేర్ లేదా రినోవేషన్ కోసం లోన్ తీసుకోవచ్చు.

- హౌస్ ఎక్స్‌టెన్షన్ కోసం లోన్ తీసుకోవచ్చు.

- ఇంటి నిర్మాణం కోసం ప్లాట్ కొనుగోలు చేసేందుకు తీసుకోవచ్చు.

- ఇతర బ్యాంకుల్లోని హోమ్ లోన్ ట్రాన్సుఫర్‌కు

- హోమ్ లోన్ తీసుకున్న వారికి టాపప్ లోన్స్.

ఆన్‌లైన్ అప్లికేషన్ ద్వారా ప్రయోజనం

ఆన్‌లైన్ అప్లికేషన్ ద్వారా ప్రయోజనం

లోన్ కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నా లేదా బ్రాంచ్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ప్రక్రియ అయితే త్వరగా పూర్తి కావొచ్చు. ఆన్‌లైన్ ద్వారా హోమ్ లోన్‌కు దరఖాస్తు చేసుకుంటే ప్రయోజనాలు ఉన్నాయి. మీరు ఎక్కడైనా, ఏ సమయంలో అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకు ఎగ్జిక్యూటివ్ లేదా రిప్రజెంటేటివ్‌తో లోన్ అవసరాల గురించి మాట్లాడేందుకు మీరు వెయిటింగ్ చేసే పరిస్థితి తప్పుతుంది.

ప్రీ ఫిల్డ్ అప్లికేషన్

ప్రీ ఫిల్డ్ అప్లికేషన్

లోన్ తీసుకునే వారు తమకు నచ్చిన టెన్యూర్‌ను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. రుణ మొత్తం, నెలవారీ చెల్లింపులు, టెన్యూర్ క్లియర్‌గా ఉంటాయి. మీ వద్ద అవసరమైన డాక్యుమెంట్స్ లేదా సమాచారం లేకుంటే తర్వాత దరఖాస్తును సమర్పించవచ్చు. బ్యాంక్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌కు సమర్పించేందుకు ముందే నింపిన లోన్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాస్త సమయం ఆదా చేస్తుంది. ప్రక్రియ వేగవంతం చేసేందుకు మీ KYC, ఇన్‌కం, ఇతర డాక్యుమెంట్లు ఆన్ లైన్ ద్వారా అప్ లోడ్ చేయవచ్చు. శాలరీ స్లిప్స్, ఐటీ రిటర్న్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు వంటివి హోమ్ లోన్‌కు అవసరమవుతాయి.

English summary

SBI ఆన్‌లైన్ కస్టమరా?: మీకు గుడ్‌న్యూస్, ఇంటి కల సాకారం! | SBI Online customer? Now, buy your dream home with loans starting at 8.40 percent

SBI offers one of the cheapest home loan interest rate compared to other lenders. But guess what! SBI has just made home loan rates even more attractive.
Story first published: Monday, July 15, 2019, 15:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X