For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్ లో షాంగ్రిలా హోటల్?

By Jai
|

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన షాంగ్రిలా హోటల్ దృష్టి ఇప్పుడు మన హైదరాబాద్ పై పడింది. హొంకోంగ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఈ ప్రముఖ లగ్జరీ హోటల్ త్వరలో భాగ్యనగరంలో ఒక స్టార్ హోటల్ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. చాలా హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో దీనిని ప్రముఖంగా చూపిస్తారు. ముఖ్యంగా డాన్ ఓరియెంటెడ్ సినిమాల్లో అధికంగా వాడతారు. బాహుబలి ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా మూవీ లో ఉన్నది మలేసియాలోని కౌలాలంపూర్ సిటీ లోని షాంగ్రిలా హోటల్. ఒక సిటీ లో భారీగా వ్యాపార అవకాశం ఉంటె తప్ప షాంగ్రిలా తన కార్యకలాపాను ప్రారంభించాడు అని అంటారు. రాబర్ట్ కోక్ దీని వ్యాపస్థాకుడు.

కొత్త అద్దె చట్టం: 2 నెలల అడ్వాన్స్, ఎక్కువ రోజులుంటే 4 రెట్ల రెంట్కొత్త అద్దె చట్టం: 2 నెలల అడ్వాన్స్, ఎక్కువ రోజులుంటే 4 రెట్ల రెంట్

మరో మూడు నగరాలు కూడా...

మరో మూడు నగరాలు కూడా...

ఇండియా లో ఇప్పటికే బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో షాంగ్రిలా హోటల్స్ ఉన్నాయ్. అయితే కొత్తగా మరిన్ని హోటల్స్ ప్రారంభించేందుకు హైదరాబాద్ సహా గోవా, ముంబై, కోల్కతా నగరాలను షాంగ్రిలా పరిశీలిస్తున్నట్లు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న షాంగ్రిలా హోటల్స్ కు భారతీయ టూరిస్టుల తాకిడి అధికంగా ఉంటుందట. అందుకే, భారత్ లో కూడా మన వారికి సేవలు విస్తరించేందేకు ఈ ప్రముఖ హోటల్ బ్రాండ్ ప్రయత్నాలు మొదలు పెట్టిందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (మిడిల్ ఈస్ట్, ఇండియా అండ్ ఇండియన్ ఓషన్) జాన్ నార్తర్న్ ను ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది.

100 కు పైగా హోటల్స్...

100 కు పైగా హోటల్స్...

ప్రపంచ వ్యాప్తంగా షాంగ్రిలా హోటల్స్ కు 100 కు పైగా హోటల్స్, రిసార్టులు ఉన్నాయి. సుమారు 34,000 నుంచి 40,000 హోటల్ గదులను నిర్వహిస్తోంది. ప్రపంచం లో మాకు 102 హోటల్స్ ఉన్నాయ్. అందులో 18% రిసార్టులు. భారత దేశంలో రిసార్ట్ నెలకొల్పేందుకు గోవా అత్యుత్తమ సిటీ అని మా అభిప్రాయం. ముంబై కూడా సరిపోతుంది. హోటల్స్ కోసం హైదరాబాద్, కోల్కతా నగరాలను పరిశీలిస్తున్నాం అని నార్తర్న్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న హోటల్స్ లో 80% వరకు షాంగ్రిలా సొంత మనగెమెంత్ లోనే ఉన్నాయట. భారత్ లో కూడా ప్రాపర్టీ డెవలప్మెంట్ తో పాటు హోటల్ నిర్వహణ కూడా చేపట్టే ఉద్దేశం ఉన్నట్లు కంపెనీ ఉన్నతాధికారి వెల్లడించారు.

శ్రీలంక లో బాంబు పేలుళ్ల ప్రభావం...

శ్రీలంక లో బాంబు పేలుళ్ల ప్రభావం...

శ్రీలంక లోని కొలంబోలో కూడా షాంగ్రిలా కు లగ్జరీ హోటల్ ఉంది. మొన్నటి ఉగ్రదాడిలో ఈ హోటల్ కూడా ఉండగా, కొందరు గీస్తులతో పాటు, హోటల్ సిబ్బంది కూడా మృతి చెందారు. అయితే, శ్రీలంక లో దీర్ఘ కాళికా ప్రణాళిక లో భాగంగానే పెట్టుబడి పెట్టమని... ఉగ్రదాడి ప్రభావం తాత్కాలికమే నని ఆయన తెలిపారు. దాడి తర్వాత శ్రీలంక తో పాటు, భారత్ లోనూ తమ హోటల్స్ వద్ద సెక్యూరిటీ పెంచినట్లు పేర్కొన్నారు. గెస్ట్ లు , ఉద్యోగుల భద్రతే తమ తోలి ప్రాధాన్యమని ఆయన వెల్లడించారు.

English summary

హైదరాబాద్ లో షాంగ్రిలా హోటల్? | Shangri La plans 5 more hotels in India including Hyderabad

Hong Kong-headquartered Shangri-La Hotels and Resorts is targeting opening five more hotels in India by 2024. The hospitality company, which has two hotels in the country, in Delhi and Bengaluru, is evaluating locations including Mumbai, Goa, Kolkata and Hyderabad, said its executive vice president for the Middle East, India & Indian Ocean, John Northern.
Story first published: Friday, July 12, 2019, 10:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X