హైదరాబాద్ (Hyderabad) మహానగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. పెరిగిన జనాభా, వాహనాల రద్దీతో నగరవాసులు ట్రాఫిక్ నరకాన్ని చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల వారికి ఒక తీపి కబురు అందించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ రీజినల్ రింగ్ రైల్ (RRR) ప్రాజెక్టుకు సంబంధించి సర్వే నిర్వహించేందుకు రైల్వే శాఖ అనుమతిని ఇచ్చింది.

సర్వే మొదలు.. ప్రాజెక్టుకు అడుగులు
ఇటీవల లోక్‌సభలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు సమాధానమిస్తూ, ఈ సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ఏదైనా పెద్ద ప్రాజెక్టు మొదలవ్వాలంటే ముందుగా 'డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్' (DPR) సిద్ధం చేయాలి. ఈ డీపీఆర్ తయారు చేయాలంటే క్షేత్రస్థాయిలో సర్వే తప్పనిసరి. ఇప్పుడు కేంద్రం ఈ సర్వేకు అనుమతించడంతో ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు, రైల్వే లైన్ ఎటువైపు నుంచి వెళ్లాలి (అలైన్‌మెంట్), అయ్యే ఖర్చు ఎంత వంటి సాంకేతిక అంశాలపై స్పష్టత రానుంది.
రోడ్డుకు సమాంతరంగా రైలు మార్గం
ఈ రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టు ప్రత్యేకత ఏమిటంటే, ప్రస్తుతం ప్రతిపాదిత దశలో ఉన్న రీజినల్ రింగ్ రోడ్డు (RRR) కు దాదాపు సమాంతరంగా ఈ రైల్వే లైన్ కూడా ఉండే అవకాశం ఉంది. అంటే అటు రోడ్డు మార్గం, ఇటు రైలు మార్గం రెండూ అందుబాటులోకి వస్తే రవాణా వ్యవస్థ పూర్తిగా మారిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయంలో కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది. అలైన్‌మెంట్ విషయంలో రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత పనులు వేగవంతం కానున్నాయి.
ఎవరికి లాభం?
ఈ ప్రాజెక్టు పూర్తయితే కేవలం హైదరాబాద్ (Hyderabad )నగరానికే కాకుండా చుట్టుపక్కల ఉన్న సంగారెడ్డి, గజ్వేల్, యాదాద్రి, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, షాద్ నగర్ , చేవెళ్ల వంటి ప్రాంతాలకు భారీగా ప్రయోజనం కలుగుతుంది.
- రవాణా సౌకర్యం: సుదూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వారికి ప్రయాణ సమయం తగ్గుతుంది.
- రియల్ ఎస్టేట్: రైల్వే లైన్ వచ్చే ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. కొత్త పరిశ్రమలు, ఐటీ హబ్‌లు ఏర్పడే అవకాశం ఉంది.
- కనెక్టివిటీ: ఎంఎంటీఎస్ (MMTS) రెండో దశతో ఈ రింగ్ రైలును అనుసంధానిస్తే, నగరంలోని ఏ మూలకైనా తక్కువ ఖర్చుతో చేరుకోవచ్చు.
ఏదేమైనా మొత్తానికి ఈ రింగ్ రైలు ప్రాజెక్ట్ పూర్తయితే.. హైదరాబాద్ చుట్టూ ఒక రక్షణ కవచంలా ఒక రైల్వే లైన్ ఏర్పడుతుంది. సర్వే ప్రక్రియ వేగంగా పూర్తయ్యి, నిధుల కేటాయింపు కూడా సజావుగా జరిగితే.. వచ్చే కొన్నేళ్లలో భాగ్యనగర రూపురేఖలు మారిపోవడం ఖాయం. ఇది కేవలం రైల్వే లైన్ మాత్రమే కాదు, తెలంగాణ ఆర్థిక ప్రగతికి ఒక కొత్త ఇంజిన్ లాంటిది.
More From GoodReturns

Hyderabad: హైదరాబాదే దేశంలో సురక్షితమైన నగరం.. బెంగళూరు, ఢిల్లీ పై రేవంత్ రెడ్డి సెటైర్లు!

Gold rates: క్రూడాయిల్ ఎఫెక్ట్.. పసిడి మార్కెట్లో ఒడిదుడుకులు, తులం బంగారం ఎంతంటే?

Hyderabad: మధ్యప్రదేశ్ కొండల్లో కొత్త హైవే.. హైదరాబాద్ ప్రయాణికులకు ఇక విమాన వేగంతో ప్రయాణం!

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!



Click it and Unblock the Notifications