For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిగ్‌బాస్కెట్‌కు షాక్: సూపర్ ద్వారా పాలు హోండెలివరీ,స్విగ్గీ రూ.680 కోట్ల ఇన్వెస్ట్

|

బెంగళూరు: ఫుడ్ డెలివరీ స్విగ్గీ త్వరలో మీ ఇంటికి పాలు డెలివరీ చేయనుంది. కేవలం పాలతోనే సరిపెట్టకుండా ఇతర నిత్యావసర వస్తువుల డెలివరీ ద్వారా తన వ్యాపార కార్యకలాపాలను మరింతగా విస్తరించే ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు పాలు, గ్రాసరీ వస్తువులు సరఫరా చేసే SUPERను కొనుగోలు చేయడం ద్వారా మైక్రో డెలివరీలోకి ప్రవేశించింది.

చెన్నై కష్టాలు: సర్జరీల కోసం నీళ్లు కొంటున్న డాక్టర్లుచెన్నై కష్టాలు: సర్జరీల కోసం నీళ్లు కొంటున్న డాక్టర్లు

సూపర్ సబ్‌స్క్రిప్షన్ పెంపుపై దృష్టి

సూపర్ సబ్‌స్క్రిప్షన్ పెంపుపై దృష్టి

సూపర్ సబ్‌స్క్రిప్షన్‌ను పెంచుకోవడంపై దృష్టి సారించింది. ఈ డెలివరీ సేవల కోసం రూ.680 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. గత ఏడాది ఇందుకు సైన్ చేసిందని తెలుస్తోంది. స్విగ్గీ స్టోర్స్ పేరుతో హైపర్ లోకల్ డెలివరీ వ్యాపారంలోకి, స్విగ్గీ డెయిలీ పేరిట సబ్‌స్క్రిప్షన్ ఆధారిత ఇంటి వంట డెలివరీ సేవల విభాగంలోకి ప్రవేశించిన నేపథ్యంలో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఆరు నెలల్లో స్విగ్గీ నెలవారీ యూజర్ల సంఖ్య పది రెట్లు పెరిగి లక్షా యాభై వేలకు చేరుకుంది.

డెలివరీ నెట్ వర్క్ విస్తరించేందుకు

డెలివరీ నెట్ వర్క్ విస్తరించేందుకు

స్విగ్గీ డెలివరీ నెట్ వర్క్ విస్తరించడానికి తమ బ్రాండ్ సహకరిస్తుందని, అలాగే తమ ఫుడ్ సర్వీస్ సేవలు ఏకీకృతం చేసేందుకు ఉపయోగపడుతుంది. ఇప్పటికే సూపర్‌కు 1 లక్షకు పైగా కస్టమర్లు ఉన్నారు. బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి వివిధ నగరాల్లో కస్టమర్స్ ఉన్నారు. మరోవైపు, స్విగ్గీ స్టోర్స్, సబ్‌స్క్రిప్షన్ బేస్డ్ హోమ్ కుక్డ్ మీల్స్ సర్వీస్ స్విగ్గీ డెయిలీ ద్వారా మైక్రో ఫుడ్ డెలివరీ సేవల కోసం ఇప్పటికే 1 బిలియన్ డాలర్లు సమీకరించిందట.

ఆ సంస్థలకు స్విగ్గీ గట్టి పోటీ

ఆ సంస్థలకు స్విగ్గీ గట్టి పోటీ

సూపర్ ద్వారా తన వ్యాపారాన్ని ఇందులోకి కూడా విస్తరించడం ద్వారా.. మిల్క్‌బాస్కెట్, డెయిలీ నింజా, బిగ్ బాస్కెట్ వంటి వాటితో నేరుగా బిజినెస్‌లో పోటీ పడనుంది. స్విగ్గీకి ఇప్పటికే దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో లాజిస్టిక్ నెట్ వర్క్ ఉండటం అడ్వాంటేజ్. క్రమంగా రూరల్ మార్కెట్‌లోకి వెళ్లేందుకు కూడా మార్గం సుగమం అవుతుంది. ప్రస్తుతం 1.5 లక్షలమంది కస్టమర్లు ఉన్నారు. ఆరు నెలల్లో పది రెట్లు పెరుగుతుందని అంచనా. SUPER ద్వారా స్విగ్గీ వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ సబ్‌స్క్రిప్షన్ ద్వారా పాలు, పాల పదార్థాలు డెలివరీ చేస్తుంది. కస్టమర్లు నాన్ డెయిరీ ఉత్పత్తులైన గుడ్లు, బ్రెడ్ వంటి సేవలు కూడా పొందవచ్చు. ప్రస్తుతం SUPER సేవల్లో 70 శాతం మిల్క్ డెలివరీ ఉత్పత్తులు.

స్విగ్గీ ద్వారా రూరల్ మార్కెట్లోకి...

స్విగ్గీ ద్వారా రూరల్ మార్కెట్లోకి...

సూపర్ పది నగరాలకు పైగా సేవలు అందిస్తోందని, స్విగ్గీ ద్వారా ఇది రూరల్ మార్కెట్‌లోకి కూడా వెళ్లవచ్చునని చెబుతున్నారు. సూపర్ పాలు, పాల పదార్థాలతో పాటు కూరగాయలు, పండ్లు కూడా డెలివర్ చేస్తోంది. సరాసరిగా ప్రస్తుతం 2.5 లక్షల నుంచి 3 లక్షల డెలివరీ ఆర్డర్స్ ఉన్నాయి. ఆన్‌లైన్ సేవలు అదనం. 60 శాతం గేటెడ్ కమ్యూనిటీ నుంచి వస్తున్నాయి.

ఇదీ సూపర్

ఇదీ సూపర్

సూపర్‌ను స్విగ్గీ గత సంవత్సరం కొనుగోలు చేసింది. అధికారికంగా వెల్లడించలేదు. 2015లో శ్రేయస్ నగ్దావనె, పునీత్‌ కుమార్ దీనిని స్టార్ట్ చేశారు. స్విగ్గీ చేతుల్లోకి వచ్చాక కూడా సూపర్‌ వారి సారథ్యంలోనే నడుస్తుంది. ప్రస్తుతం ఈ విభాగం బెంగళూరు, ముంబై, ఢిల్లీ NCR సహా ఆరు నగరాల్లో డెలివరీలు అందిస్తోంది. మైక్రోడెలివరీ వ్యాపార విభాగంలో ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకలాపాలు సాగిస్తున్న మిల్క్‌బాస్కెట్, డెయిలీ నింజా తదితర సంస్థలకు స్విగ్గీ సారథ్యంలోని సూపర్‌ గట్టి పోటీ ఇస్తుందని చెబుతున్నారు. వారం, నెల, క్వార్టర్లీ వారి చందాదారులకు సేవలు అందిస్తోంది.

English summary

బిగ్‌బాస్కెట్‌కు షాక్: సూపర్ ద్వారా పాలు హోండెలివరీ,స్విగ్గీ రూ.680 కోట్ల ఇన్వెస్ట్ | Swiggy will soon deliver milk at your doorstep

Food delivery player Swiggy will soon deliver milk at your doorstep and as it forays into micro delivery space with the acquisition of Supr, a subscription based business that delivers milk and other essential food items, for $100 million.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X