For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.3 లక్షల కోట్లు హాంఫట్ ! బడ్జెట్ దెబ్బకు ఫారిన్ ఇన్వెస్టర్లు పరార్

By Chanakya
|

నిర్మలా బడ్జెట్‌ నిరుత్సాహకరంగా ఉండడంతో స్టాక్ మార్కెట్ సూచీలు కుప్పకూలాయి. ఒక్క రోజులోనే ఏకంగా రూ.5 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైపోయింది. గత నాలుగేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజున ఈ స్థాయిలో పతనం షేర్ హోల్డర్లకు ముచ్చెమటలు పట్టించింది. హెవీ వెయిట్ స్టాక్స్ కూడా పేకమేడల్లా కూలిపోవడంతో.. ఏ స్టాక్‌లో తలదాచుకోవాలో అర్థంకాని స్థితిలో ఉండిపోయారు ఇన్వెస్టర్లు.

మొత్తానికి గత వారమంతా అక్కడక్కడే కొట్టుమిట్టాడిన మార్కెట్లకు ఈ రోజు మాత్రం బ్లాక్ మండే అనే చెప్పాలి. మన దేశీయ స్థితిగతులకు తోడు ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన నిరుత్సాహక సంకేతాలు కూడా తోడవడం మరింత ఆజ్యం పోసింది. చివరకు సెన్సెక్స్ 872 పాయింట్లు కోల్పోయి 30, 604 దగ్గర క్లోజైంది. నిఫ్టీ 252 పాయింట్లు నష్టపోయి 11,559 దగ్గర, బ్యాంక్ నిఫ్టీ 872 పాయింట్లు కోల్పోయి 30,604 దగ్గర స్థిరపడింది.

Investor wealth plunges Rs.3 lakh crore on Budget day as markets tank

నిఫ్టీ 50లో యాభై స్టాక్స్ మినహా మిగిలనవన్నీ నష్టపోవడం.. పతన తీవ్రతను సూచిస్తోంది. సెక్టోరల్ సూచీల్లో ఏ ఒక్కటీ లాభాల్లో లేకపోవడం కూడా గమనించాల్సిన అంశం. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్, రియాల్టీ, మీడియా, ఆటో, మెటల్, ఫార్మా రంగ సూచీల్లో నష్టం అత్యధికంగా ఉంది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు కూడా రెండున్నర శాతం వరకూ కోల్పోయాయి.

భారీగా పతనమైన మార్కెట్లు, 800 పాయింట్లకు సెన్సెక్స్ నష్టంభారీగా పతనమైన మార్కెట్లు, 800 పాయింట్లకు సెన్సెక్స్ నష్టం

యెస్ బ్యాంక్, హెచ్ సి ఎల్ టెక్, ఇన్ఫ్రాటెల్, టీసీఎస్, జెఎస్‌డబ్ల్యు స్టీల్ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, హీరోమోటోకార్ప్ టాప్ ఫైవ్ లూజర్స్ జాబితాలో నిలిచాయి.

FPIs పై ట్యాక్స్ ముంచిందా
అల్ట్రా రిచ్, సూపర్ రిచ్.. అంటే ఏటా రూ.2 కోట్లకు పైగా ఆదాయం పొందుతున్న వారిపై సర్ ఛార్జీల రూపంలో కేంద్రం ఈ సారి అధిక పన్నులు వడ్డించింది. రూ.5 కోట్ల పైన ఆదాయం పొందుతున్న వారు 45 శాతం వరకూ పన్నును చెల్లించాల్సి వస్తుంది. ఇది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడ్తున్న ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు రుచించినట్టు లేదు. ఎఫ్ పీ ఐల్లో ఉన్న 40-45 శాతం మంది ఈ కొత్త పన్నుల వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉండడంతో వాళ్లు అమ్మకాలకు తెగబడ్డారని నిపుణుల మాట. ఇది కూడా మార్కెట్ పతనానికి దోహదపడింది. వీటికి తోడు కనీసం లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్ షేర్ హోల్డింగ్ 35 శాతం ఉండాలనే ప్రతిపాదన కూడా పెద్ద ఎన్వెస్టర్లను, కంపెనీలను ఆందోళనలోకి నెట్టింది.

బజాజ్ ట్విన్స్‌లో ఎప్పుడూ ఇలా లేదు
బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్‌లో గతంలో ఎప్పుడూ లేనంతగా పతనం నమోదైంది. రెండు స్టాక్స్ పది శాతం వరకూ కుప్పకూలాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజు ఈ స్థాయి సెల్లింగ్ కలవర పెట్టింది. ఎఫ్ఐఐలు పెద్ద ఎత్తున అమ్మకాలు జరపడం ఇలాంటి పెద్ద స్టాక్స్‌నూ పడేసింది.

మారుతి ట్రాక్ తప్పింది
మారుతి సుజుకి స్టాక్ రెండేళ్ల తర్వాత మళ్లీ రూ.6000 మార్కు దిగువకు పడిపోయింది. అమ్మకాలు క్షీణించడంతో వరుసగా ఐదో నెల కూడా ఉత్పత్తిని తగ్గించడంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. దీంతో స్టాక్ 6 శాతం పతనమై రూ.5986 వరకూ వెళ్లింది. చివరకు 5 శాతం నష్టంతో రూ.6039 దగ్గర క్లోజైంది.

ఎల్ అండ్ టి పరిస్థితీ అంతే
బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్.. ఎల్ అండి స్టాక్‌ను డౌన్ గ్రేడ్ చేసింది. తన ఔట్‌లుక్‌ను న్యూట్రల్‌కు మార్చింది. ఈ నేపధ్యంలో ఈ స్టాక్ 4 శాతం కోల్పోయింది. చివరకు స్టాక్ 4.4 శాతం కోల్పోయి రూ.1490 దగ్గర ముగిసింది.

యెస్ బ్యాంక్ హమ్మయ్య..
బ్యాంక్ ఆర్థిక స్థితిగుతులు మెరుగ్గా ఉన్నాయని, లిక్విడిటీకి సంబంధించిన ఇబ్బందులేవీ లేవంటూ యెస్ బ్యాంక్ యాజమాన్యం ప్రకటన చేయడం కొద్దిగా యెస్ బ్యాంక్ షేర్‌కు ఊరటనిచ్చింది. స్టాక్ ఒక దశలో 8 శాతం వరకూపెరిగింది. చివరకు 5.5 శాతం లాభాలతో రూ.93.10 దగ్గర క్లోజైంది.

మైండ్ పోయినంత పనైంది
మైండ్ ట్రీ కీలక టీం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అయిన సీఈఓ, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ రాజీనామాలు చేయడంతో మైండ్ ట్రీ స్టాక్ ఒక్కసారిగా కుప్పకూలింది. కాంట్రాక్ట్ ప్రకారం జూలై 17వ తేదీ వరకూ బోర్డులో కొనసాగుతామని వాళ్లు చెప్పినప్పటికీ స్టాక్ మాత్రం ఎక్కడా ఆగలేదు. చివరకు 14 శాతం కోల్పోయి రూ.769 దగ్గర స్టాక్ క్లోజైంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు మరో దెబ్బ
భూషణ్ స్టీల్‌కు అప్పు ఇచ్చిన విషయంలో మరో రూ.3800 కోట్ల ఫ్రాడ్‌ను గుర్తించినట్టు బ్యాంక్ యాజమాన్యం వెల్లడించింది. దీంతో స్టాక్ 11 శాతం నష్టపోయి రూ.72.80 దగ్గర క్లోజైంది.

English summary

రూ.3 లక్షల కోట్లు హాంఫట్ ! బడ్జెట్ దెబ్బకు ఫారిన్ ఇన్వెస్టర్లు పరార్ | Investor wealth plunges Rs.3 lakh crore on Budget day as markets tank

More than Rs.3 lakh crore of equity investor wealth got wiped out on Monday, as investors reacted nervously to a not too market friendly Budget.
Story first published: Monday, July 8, 2019, 17:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X