For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెట్రోల్, డీజిల్ ధరలు సహా... అందరికీ గుడ్‌న్యూస్

|

న్యూఢిల్లీ: బడ్జెట్‌కు ముందు 2018-19 ఆర్థిక సంవత్సం ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. దీనిని ముఖ్య ఆర్థిక సలహాదారు సుబ్రమణియన్ తయారు చేశారు. దేశ ఆర్థిక పరిస్థితులను ఇది ప్రతిబంబించింది. అలాగే, ఆర్థిక సవాళ్లను ప్రస్తావించింది. తమ బృందం పూర్తి అంకితభావంతో పని చేసిందని, మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నామని, ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఆలోచనలను ఇచ్చే అవకాశం తమకు దక్కిందని సుబ్రమణియన్ పేర్కొన్నారు. కాగా, ఆర్థిక సర్వేలో సామాన్యులకు గుడ్ న్యూస్ వినిపించింది.

తెలుగు విద్యార్థులకు గుడ్‌న్యూస్: ప్రాంతీయ భాషల్లో బ్యాంకింగ్ పరీక్షలుతెలుగు విద్యార్థులకు గుడ్‌న్యూస్: ప్రాంతీయ భాషల్లో బ్యాంకింగ్ పరీక్షలు

అందరికీ శుభవార్త

అందరికీ శుభవార్త

ఆర్థిక సర్వేలో అందరికీ ఊరటనిచ్చిన అంశం.. ఇప్పటికే తగ్గుముఖం పడుతున్న చమురు ధరలు ఈ ఆర్థిక సంవత్సరంలో (2020) మరింత తగ్గుతాయనేది. చమురు ధరలు తగ్గితే ద్రవ్యోల్భణం అదుపులో ఉంటుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అలాగే, చమురు ధరలు తగ్గి, పెట్రోల్-డీజీల్ ధరలు తగ్గితే ప్రజల డబ్బు కూడా ఆదా అవుతుందని ఆమె అన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు చమురు ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత ఎన్నికల సమయంలో ఎక్కువగా పెరగలేదు. ఎన్నికల తర్వాత కూడా పెద్దగా పెరగలేదు. కానీ సమీప భవిష్యత్తులో మరింత పెరుగుతాయని ఆందోళనలు అందరిలోను ఉన్నాయి. కానీ ఆర్థిక సర్వే ఇది అందరికీ ఊరటను కలిగించింది.

టెక్నికల్ విద్య

టెక్నికల్ విద్య

2017-18 డేటా ప్రకారం అర్బన్ ప్రాంతంలో 15ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన అర్బన్ 94.3 శాతం మందికి టెక్నికల్ విద్య దూరంగా ఉంది. ఇప్పుడు అది అర్బన్ మహిళల్లో 65.4 శాతం, అర్బన్ పురుషుల్లో 65.8 శాతం పెరిగింది. 2017-18 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం మహిళా ఉద్యోగి కంటే పురుష ఉద్యోగి 1.2-1.3 శాతం ఎక్కువ వస్తోంది.

మరిన్ని ఉద్యోగాల సృష్టి కావాలంటే...

మరిన్ని ఉద్యోగాల సృష్టి కావాలంటే...

చిన్న ఎంఎస్ఎఈ కంపెనీలు పెద్ద కంపెనీలుగా ఎదిగేందుకు ప్రభుత్వం ప్రోత్సహించాలి. అలా చేస్తే ఉద్యోగ కల్పన కూడా పెరుగుతుంది. మన విధానాలు MSME వృద్ధి చెందేలా ఉండాలని ఆర్థిక సర్వే పేర్కోంది. చిన్న కంపెనీలు వేగంగా ఎదిగే అవకాశముంటుందని, వాటిని ప్రోత్సహిస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొంది. వందమంది సిబ్బంది ఉండి, పదేళ్ల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు 50 శాతం ఉండగా, ఉద్యోగాలు 14 శాతమని, పెద్ద కంపెనీలు పదిహేను శాతం ఉన్నప్పటికీ 75 శాతం ఉద్యోగాలు, 90 శాతం ఉత్పత్తి కలిగి ఉన్నాయని తెలిపింది.

మరిన్ని అంశాలు...

మరిన్ని అంశాలు...

అలాగే, మొండి బకాయిలు పెద్ద మొత్తంలో తగ్గినట్లు ఆర్థిక సర్వే తెలిపింది. దీంతో మూలధన పెట్టుబడులు పెరిగే అవకాశముంది. ఆహార ధరల క్షీణత కారణంగా 2019లో రైతులు ఉత్పత్తి తగ్గించి ఉండవచ్చు. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో పెరుగుతుందని అంచనా. అధిక రుణ వృద్ధితో 2019-20లో పెట్టుబడులు పెరగనున్నాయి. దీంతో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. గత ఏడాది కాలంగా గ్రామీణ వేతన వృద్ధి పెరుగుతోంది.

English summary

పెట్రోల్, డీజిల్ ధరలు సహా... అందరికీ గుడ్‌న్యూస్ | Economic Survey 2019: Good news for all! Oil prices predicted to decline this year

Oil could again come to the rescue of the Modi government in its second term as the Economic Survey has outlined that oil prices could decline in the current fiscal.
Story first published: Thursday, July 4, 2019, 15:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X