For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'కనీస వేతనాలు రూ.20వేలు, కనీస పింఛన్ రూ.6వేలు'

|

న్యూఢిల్లీ: కార్మికుల కనీస వేతనాలు, పింఛన్లు పెంచాలని కార్మిక సంఘాలు కోరుకుంటున్నాయి. దేశంలో 500 మిలియన్ల మంది కార్మికులు ఉన్నారని, వారికి మరింత ప్రయోజనం చేకూరేలా బడ్జెట్‌లో నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు. పక్షం రోజుల క్రితమే కార్మిక సంఘాలు పలు ప్రతిపాదనలు ముందుకు తెచ్చాయి. ఇందులో పలు అంశాలు ఉన్నాయి.

ధరలు మండిపోతున్నాయని, వాటికి అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలని చెబుతున్నారు. పిల్లల చదువులు, వైద్యం వంటి కనీస అవసరాల వ్యయాలు భారీగా పెరిగిపోతున్నాయని, వాటికి అనుగుణంగా కనీస ఆదాయం ఉండాలని కోరుకుంటున్నారు. కార్మికల కనీస వేతనం రూ.20,000 పెంచాలని కోరుకున్నారు. అలాగే కనీస పింఛన్ మొత్తం రూ.6వేలుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ఏపీకి ఇచ్చిన హామీలు మోడీ ప్రభుత్వం ఏమేం నెరవేర్చిందంటే?ఏపీకి ఇచ్చిన హామీలు మోడీ ప్రభుత్వం ఏమేం నెరవేర్చిందంటే?

Demand for Rs.6K minimum pension, Rs.20K minimum wages

గ్రామీన ఉపాది హామీ పథకం కింద 200 రోజులు పని కల్పించాలని కోరారు. ఆదాయ పన్ను స్లాబుల పరిధిని పెంచాలని కోరారు. పింఛనర్లకు రూ.10 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను విధించవద్దని కోరారు. సీనియర్ సిటిజన్లకు రూ.8 లక్షలను ఆదాయ స్లాబు కిందకు తీసుకు రావాలన్నారు. వీరికి లభించే హోమ్, ఇతర అలెవెన్స్‌లపై పన్ను ఉండకూడదన్నారు.

పబ్లిక్ సెక్టార్ సంస్థలను ప్రయివేటీకరీంచవద్దని, అంతేకాకుండా పెట్టుబడులు విస్తృతం చేయాలన్నారు. కార్మికుల్లో నైపుణ్యల పెంపుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తమను ప్రీబడ్జెట్ చర్చలకు పిలిచారని, వారు లేబర్, స్కిల్, డెవలప్‌మెంట్, ఉద్యోగాలు, వేతనాలకే చర్చను పరిమితం చేయాలని చూశారని ఏఐటీయూసీ విమర్శించింది.

English summary

'కనీస వేతనాలు రూ.20వేలు, కనీస పింఛన్ రూ.6వేలు' | Demand for Rs.6K minimum pension, Rs.20K minimum wages

Trade unions have asked government to raise minimum wages to Rs.20,000 per month, do away with the fixed term employment.
Story first published: Tuesday, July 2, 2019, 18:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X