For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యాపిల్ సంస్థకు భారీ షాక్, చీఫ్ డిజైనర్ ఆఫీసర్ రాజీనామా!

|

టెక్ దిగ్గజం యాపిల్‌కు భారీ షాక్ తగిలింది. కంపెనీలోని చీఫ్ డిజైన్ ఆఫీసర్ జానీ ఐవ్ రాజీనామా చేయనున్నారు. యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఓ సందర్భంలో మాట్లాడుతూ... తనకు యాపిల్‌లో ఎవరైనా స్పిరిచ్యువల్ పార్ట్‌నర్ ఉన్నారా అంటే అది జానీ ఐవ్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. అలాంటి డిజైనర్ ఇప్పుడు యాపిల్‌ను వీడనున్నారు. దాదాపు 3 దశాబ్దాలు పని చేసి, ఇప్పుడు సొంత డిజైనింగ్ కంపెనీ పెట్టేందుకు సిద్ధమయ్యారు.

దారి ఇవ్వకుంటే రూ.10వేలు, రూ.1 లక్ష వరకు ఫైన్దారి ఇవ్వకుంటే రూ.10వేలు, రూ.1 లక్ష వరకు ఫైన్

1992లో కంపెనీలో చేరిన జాన్ ఐవ్

1992లో కంపెనీలో చేరిన జాన్ ఐవ్

జానీ ఐవ్ 1996 నుంచి యాపిల్ డిజైన్ టీమ్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఆయన ఈ ఏడాది చివరన యాపిల్‌కు రాజీనామా చేసి సొంత డిజైనింగ్ సంస్థను నెలకొల్పనున్నారు. అప్పటి వరకు కంపెనీ కార్యకలాపాల్లో పాల్గొంటారు. యాపిల్ కంపెనీని అగ్రస్థానంలో నిలపడంలో ఆయన పాత్ర కూడా ఎంతో ఉంది. జానీ 28 ఏళ్లుగా ఈ కంపెనీలో పని చేస్తున్నారు. యాపిల్‌ సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు ఈయన డిజైన్లు కంపెనీకి కొత్త రూపు తీసుకొచ్చాయి. జానీ ఐవ్ 1992లో యాపిల్ సంస్థలో చేరారు.

యాపిల్‌తో కలిసి ప్రాజెక్టులు

యాపిల్‌తో కలిసి ప్రాజెక్టులు

స్టీవ్ జాబ్స్‌కు ప్రధాన అనుచరుడిగా సలహాలు ఇచ్చేవారు జానీ ఐవ్. 2015లో ఆయన చీఫ్ డిజైన్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం యాపిల్‌ నుంచి వేరుపడి లవ్‌ ఫ్రమ్ పేరుతో కొత్త డిజైన్ కంపెనీని ప్రారంభించనున్నారు. యాపిల్ కంపెనీలో ఉద్యోగం నుంచి రాజీనామా చేసినప్పటికీ ఇదే కంపెనీతో కలిసి పలు ప్రాజెక్టులు చేపడతామని జానీ ఐవ్ చెప్పారు. యాపిల్ సీఈవో టిమ్ కుక్.. జానీ ఐవ్‌ను ప్రశంసించారు. అతను తన ప్రతిభను కంపెనీ కోసం ఉపయోగించారన్నారు.

కంపెనీకి నష్టం లేదని...

కంపెనీకి నష్టం లేదని...

జానీ ఐవ్ రాజీనామా అంశంపై మాక్సిమ్‌ గ్రూపునకు చెందిన విశ్లేషకులు నేహాల్‌ చోక్సీ స్పందించారు. యాపిల్‌ కంపెనీలో జానీ కీలక పాత్ర పోషించినప్పటికీ ఆయన రాజీనామాతో కంపెనీకి ఎలాంటి నష్టం లేదన్నారు. జానీ ఐవ్ వరల్డ్ మోస్ట్ నైపుణ్యం కలిగిన ఇండస్ట్రియల్ డిజైనర్‌లలో ఒకరు. ఇతను 1198 iMac ఉత్పత్తుల కోసం పని చేశారు. ఆ తర్వాత iPhones, iPods, iPads, Apple Watch ఉత్పత్తుకు పని చేశారు. జానీ ఐవ్ వయస్సు 52 ఏళ్లు.

English summary

యాపిల్ సంస్థకు భారీ షాక్, చీఫ్ డిజైనర్ ఆఫీసర్ రాజీనామా! | Iphone Designer Jonathan Ive Announces Apple departure

Apple’s chief design officer Jonathan Ive will depart the company later this year, bringing an end to a tenure spent crafting some of technology’s most influential products, including the iPhone.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X