For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఖండాంతరాలు దాటుతున్న దేశీ స్టార్టప్ ఓయో, కొత్తగా అమెరికాలో రూ.2,000 కోట్ల పెట్టుబడి

By Jai
|

హైదరాబాద్: దేశీయ స్టార్టుప్ దిగ్గజం ఓయో రూమ్స్ ఖండాంతరాలు విస్తరిస్తోంది. ఇప్పటికే చైనా లో సైతం పాగా వేసిన ఈ కంపెనీ తాజాగా అమెరికాపై కన్నేసింది. ఇందుకోసం ఏకంగా రూ 2,000 (300 మిలియన్ డాలర్స్) పెట్టుబడి పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకోంది.

కారు రుణ బదిలీలో కష్ఠాలున్నాయ్?కారు రుణ బదిలీలో కష్ఠాలున్నాయ్?

భారత్, చైనా తర్వాత ఒక మార్కెట్లో ఇంత భారీ ఇన్వెస్ట్మెంట్ పెడుతూండటం ఓయో రూమ్స్ కి ఇదే తొలిసారి. ఆన్లైన్ లో హోటల్ రూమ్స్ ను బుక్ చేసుకొనే సదుపాయం కల్పించే ఆరేళ్ళ ఈ స్టార్టుప్ కంపెనీ ... ఇప్పటికే చైనా లో దాదాపు రూ 4,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళికలు రచించింది. అలాగే కొత్తగా ప్రపంచంలోనే అతిపెద్ద కన్స్యూమర్ మార్కెట్ కలిగిన అమెరికా లో అడుగు పెట్టడం విశేషం.

OYO commits $300 million investment in the US for growth

సహజంగా బడా బడా కంపెనీలు ఫేస్బుక్, గూగుల్, ఉబెర్ లాంటి దిగ్గజాలు అన్నీ కూడా అమెరికా నుంచి దిగుమతి అవుతున్న సమయంలో మన దేశం నుంచి ఒక స్టార్టుప్ కంపెనీ అమెరికా లో కార్యకాలపు విస్తరించటం గర్వ కారణమే. ఇప్పటి వరకు కేవలం ఐటీ, ఫార్మా కంపెనీలు మాత్రమే అమెరికా లో విజయవంతం అయ్యాయి. ఇప్పుడు ఇక మన స్టార్టుప్ కంపెనీలు కూడా అక్కడ పాగా వేస్తె మనకు లాభమే.

ఓయో రూమ్స్ తొలుత 50 ప్రాపర్టీస్ ద్వారా అమెరికా లోని 10 రాష్ట్రాల్లోని 35 నగరాల్లో తన కార్యకాలపు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిందని బ్లూమ్బెర్గ్ వార్త సంస్థ ను ఉటంకిస్తూ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. డాలస్, హూస్టన్, ఆగస్తా, అట్లాంటా, మియామీ వంటి నగరాలూ ఇందులో ఉన్నాయ్. త్వరలోనే న్యూయార్క్, లోడ్ అంగెల్స్, శాన్ఫ్రాన్సిస్కో వంటి నగరాలకు విస్తరించేందుకు సమాయత్తమవుతోంది.

ఆరేళ్ళ క్రితం రితేష్ అగర్వాల్ ప్రారంభించిన ఓయో రూమ్స్ అమెరికాలో ఓయో హోటల్స్ , ఓయో టౌన్షిప్ అనే రెండు బ్రాండ్ల ద్వారా విస్తరించనుంది. తన కార్యకలాపాల ద్వారా ఇప్పటికే ఓయో రూమ్స్ అమెరికా లో 1,000 కొత్త ఉద్యోగాలను సృష్టించింది.

యూకె , యూరప్, ఇండోనేషియా, మలేషియా, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా , ఫిలిప్పీన్స్, జపాన్ దేశాల్లో ఇప్పటికే విస్తరించిన ఓయో రూమ్స్ త్వరలోనే మరిన్ని దేశాల్లో తన జెండా యెగార వేసి భారత్ నుంచి ఎదిగిన బహుళ జాతి కంపెనీ గా ఆవిర్భవిస్తుంది. ఈ కంపెనీలో జపాన్ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం సాఫ్ట్ బ్యాంకు భారీగా పెట్టుబడి పెట్టింది.

5 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఓయో రూమ్స్ ప్రపంచ వ్యాప్తంగా 20,000 భవంతులు, 7,00,000 గదులను నిర్వహిస్తోంది. ఒక్క చైనాలోనే 320 నగరాల్లో 10,000 హోటల్స్, 4,50,000 గదులను నిర్వహిస్తోంది. భారత్ లో 259 నగరాల్లో 8,700 హోటల్స్, 1,73,000 రూమ్స్ ని మేనేజ్ చేస్తోంది.

English summary

ఖండాంతరాలు దాటుతున్న దేశీ స్టార్టప్ ఓయో, కొత్తగా అమెరికాలో రూ.2,000 కోట్ల పెట్టుబడి | OYO commits $300 million investment in the US for growth

OYO Hotels & Homes has committed to invest $300 million (about Rs 2,000 crore) over the next few years in the United States, the SoftBank-backed hospitality chain announced ion Wednesday, signalling its intent to expand its presence in the world’s largest consumer market.
Story first published: Monday, June 24, 2019, 8:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X