రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) కోసం కొనసాగుతున్న దివాలా ప్రక్రియ కోసం రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్‌పి) గా డెలాయిట్ యొక్క అనీష్ నిరంజన్ నానావతిని నియమించారు.
రుణదాతల కమిటీ చేసిన విజ్ఞప్తిని ఆమోదించిన ధర్మాసనం మే 23 లోగా నివేదిక సమర్పించాలని ఆర్‌పిని కోరింది. ఈ నేపధ్యంలో ఆర్‌కామ్ సహా దాని అనుబంధ సంస్థలు రిలయన్స్ టెలికాం, రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ ఈ నెల 16న ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌లో దివాలా పిటిషన్‌ను దాఖలు చేశాయి.

ఆర్‌కామ్ దివాలా ప్రక్రియలో భాగంగా రిసొల్యూషన్ ప్రొఫెషనల్‌గా అనీష్ నానావతి ఎన్నిక
రుణదాతలకు రూ.57,382 కోట్ల బకాయిలను చెల్లించటంలో విఫలం కావటంతో ఆర్‌కామ్ తానే సొంతంగా ఈ దివాలా పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ మొత్తంలో రూ.7,000 కోట్లు గ్రూప్ కంపెనీలకు సంబంధించినవి కాగా మిగిలిన రూ.47,000 కోట్లు 53 బ్యాంకులు నుంచి రుణాలుగా తీసుకుంది. ఇందులో రూ.14,775 కోట్ల రుణాలను చైనాకు చెందిన సంస్థలు అందించాయి. ఈ మూడు సంస్థలు వ్యాపారపరంగా ఒకదానికొకటి సంబంధాలను కలిగి ఉండటంతో రిసొల్యూషన్ ప్రొఫెషనల్‌గా అనీష్ నానావతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయని రుణదాతల కమిటీ (సీఓసీ) ట్రిబ్యునల్‌కు తెలిపింది.

దోహా బ్యాంక్ ట్రిబ్యునల్ ముందు దాఖలు చేసిన పిటిషన్ జూన్ 28 న విచారణ
రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ రూ.1,400 కోట్ల బకాయిలు చెల్లించటంలో విఫలం కావటంతో ఈ ఏడాది మే 30న దోహా బ్యాంక్ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది.ఆర్‌కామ్ యొక్క అనుబంధ సంస్థ రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ (ఆర్‌ఐటిఎల్) కు ఆర్థిక రుణదాత అయిన దోహా బ్యాంక్ ట్రిబ్యునల్ ముందు దాఖలు చేసిన పిటిషన్ కూడా శుక్రవారం విచారణకు వచ్చింది. ఇది జూన్ 28 న విచారణ కోసం వాయిదా వేయబడింది.దోహా బ్యాంక్ ఇంతకుముందు ఎన్‌సిఎల్‌టిని రుణదాతల కమిటీ నిర్ణయాలపై స్టే ఇవ్వాలని కోరింది. RITL అందించిన కార్పొరేట్ హామీ ఆధారంగా RCC యొక్క రుణదాతల వాదనలను CoC పరిగణించిందని, ఇది CoC లో తన ఓటింగ్ వాటాను తగ్గిస్తుందని పేర్కొంది.

ఆర్‌కామ్‌కు రుణాలిచ్చిన బ్యాంకుల్లో ఎస్‌బీఐదే అగ్రస్థానం
కాగా ఆర్‌కామ్‌కు రుణాలిచ్చిన బ్యాంకుల్లో ఎస్‌బీఐ అగ్రస్థానంలో ఉంది.ఆర్‌కామ్‌కు ఎస్‌బీఐ రూ.4,905.37 కోట్ల రుణాలను ఇవ్వగా ఎల్‌ఐసీ రూ.4,758 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.2,707.67 కోట్లు, స్టాండర్డ్ అండ్ చార్టర్డ్ బ్యాంక్ రూ.2,130.23 కోట్లు, సిండికేట్ బ్యాంక్ రూ.1,225.19 కోట్లు, పీఎన్‌బీ రూ.1,126.87 కోట్ల రుణాలిచ్చాయి. మరోవైపు చైనా డెవల్‌పమెంట్ బ్యాంక్ రూ.9,863.89 కోట్లు, చైనా ఎగ్జిమ్ బ్యాంక్ రూ.3,356.44 కోట్లు, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనాకు రూ.1,554 కోట్ల మేర ఆర్‌కామ్ బకాయి పడింది.
More From GoodReturns

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!



Click it and Unblock the Notifications