For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్లిప్కార్ట్ లో అక్షరాలా బిలియన్ డాలర్లు హామ్ ఫట్

By Jai
|

హైదరాబాద్: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ లో అక్షరాలా ఒక బిలియన్ డాలర్లు (సుమారు రూ 7,000 కోట్లు ) హాం ఫట్ అయ్యాయట. అది కూడా కేవలం అమెరికా దిగ్గజం వాల్మార్ట్ కొనుగోలు చేసిన నాటి నుంచే ఇంత భారీ మొత్తం లో నగదు, నగదు సమానమైన నిధులు ఖర్చు అయినట్లు సమాచారం. అయితే ఈ ఖర్చు అంత కూడా అమెజాన్ తో పోటీ పడేందుకే ఫ్లిప్కార్ట్ ఖర్చు చేసిందని సమాచారం. ఈ మేరకు ఫ్లిప్కార్ట్ లో 77% వాటా కొనుగోలు చేసిన వాల్మార్ట్ తన వాటా దారులకు అమెరికా స్టాక్ ఎక్స్చేంజి ద్వారా వెల్లడించింది. గతేడాది ఆగష్టు లో 2.2 బిలియన్ డాలర్లుగా ఉన్న నగదు నిల్వలు ఈ ఏడాది ఏప్రిల్ చివరికల్లా 1.2 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు వాల్మార్ట్ పేర్కొంది. ఫ్లిప్కార్ట్ కొనుగోలు కోసం వాల్మార్ట్ ఏకంగా 16 బిలియన్ డాలర్లు చెల్లించిన విషయం తెలిసిందే.

ఫ్లిప్కార్ట్ ను కొనుగోలు చేసినప్పుడు వాల్మార్ట్ ఆ కంపెనీ లో 77% గుడ్ విల్ కోసం అలాగే భారత్ లో పట్టు కోసమే వెచ్చించింది. కేవలం 23% మేరకు ఫ్లిప్కార్ట్ ఆస్తులు (టెక్నాలజీ, స్థిర, చర ఆస్తులు ) లెక్క కట్టిందని ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనం లో పేర్కొంది. భారత దేశ చరిత్ర లోనే కానీ వినీ ఎరుగని రీతిలో ఇక స్టార్టుప్ కంపెనీ ని లక్ష ఇరవై వేళా కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేయడం ఫ్లిప్కార్ట్ విషయం లోనే చూశాం. ఇంత భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసిన కూడా ఫ్లిప్కార్ట్ నష్టాలు ఏమాత్రం తగ్గ లేదట. పైగా ఫ్లిప్కార్ట్ నమోదు చేస్తున్న నష్టాల వాళ్ళ ఏకంగా వాల్మార్ట్ లాభదాయకత పైన ప్రభావం పడుతోంది. అందుకే వాల్మార్ట్ షేర్స్ కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి.

Flipkart lost Rs.7000 crore after joining Wallmart

ఇది ఇలా ఉండగా.. భారత్ లో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్న అమెరికా ఈకామెర్స్ దిగ్గజం అమెజాన్ ఏకంగా భరత్ లో 5 బిలియన్ డాలర్లు కుమ్మరించింది. 2013 లో తన కార్య కలాపాలు ప్రారంభించిన అమెజాన్ ఆనతి కలం లోనే ఫ్లిప్కార్ట్ కు గట్టి పోటీ ఇచ్చింది. కానీ ఈ రెండు కంపెనీలు ఒకరిపై మరొకటి పై చేయి సాధించేందుకు ఏటా 1 బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నాయట. ఇంట భారీ నిధులను వివిధ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్స్ ఆఫర్ చేసేందుకు, కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు వాడుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో రెండు సంస్థలు కూడా అదే స్థాయి లో నష్టాలను మూట కట్టుకొంటున్నాయని అభిప్రాయం పడుతున్నారు. భారీ డిస్కౌంట్స్ వాళ్ళ వినియోగ దారులు లాభ పడుతున్నా చిన్న చిన్న రిటైలర్లు మాత్రం బిజినెస్ దెబ్బతిని నష్ట పోతున్నట్లు వివిధ నివేదికలు వెల్లడిస్తున్నాయి.
అయితే, ఫ్లిపకార్ట్ ఖాతాల్లో నుంచి మాయమైన 1 బిలియన్ డాలర్లను ఇందుకోసం వాడిందీ వాల్మార్ట్ కూడా వెల్లడించక పోవడం విశేషం.

English summary

ఫ్లిప్కార్ట్ లో అక్షరాలా బిలియన్ డాలర్లు హామ్ ఫట్ | Flipkart lost Rs.7000 crore after joining Wallmart

Flipkart lost Rs.7000 crore after joining Wallmart
Story first published: Thursday, June 20, 2019, 7:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X