For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖేష్ అంబానీ రిలయన్స్‌కు షాక్: JIO టారిఫ్ 20శాతం దాకా పెంచితేనే...!

|

ముంబై: ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) ఆదాయ అంచనాలు 2019-20 ఆర్థిక సంవత్సరంలో 15 శాతం తగ్గేలా ఉన్నాయని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జేపీ మోర్గాన్ అంచనా వేసింది. గత కొద్ది క్వార్టర్లుగా RIL స్థూల రిఫైనింగ్ మార్జిన్లు ఒత్తిడిలో ఉన్నాయి. ప్రస్తుతం రిఫైనింగ్, పెట్రో రసాయనాలకు ఉన్న ప్రతికూలతల నేపథ్యంలో ఈ అంచనా వేసింది. వీటితో పాటు అంతర్జాతీయ సముద్ర సంస్థ (IMO) నిబంధనలు నిరుత్సాహంగా ఉంటే మరింత తగ్గే అవకాశముందని పేర్కొంది. అయితే ధరలు 12 నుంచి 20 శాతం పెంచితే దన్నుగా ఉండొచ్చని భావిస్తున్నారు.

దెబ్బ మీద దెబ్బ: అనిల్ అంబానీపై చైనా ఒత్తిడి!దెబ్బ మీద దెబ్బ: అనిల్ అంబానీపై చైనా ఒత్తిడి!

రిలయన్స్ జియో టారిఫ్ పెంచితే.. కానీ

రిలయన్స్ జియో టారిఫ్ పెంచితే.. కానీ

తన కోర్ బిజినెస్ వ్యాపార బలహీనతలు తగ్గించేందుకు, రిలయన్స్ జియో టారిఫ్ 12 శాతం నుంచి 20 శాతం పెంచితే కొంత సానుకూలం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మార్జిన్ పెరిగితే ప్రతికూలత 9 శాతం తగ్గనుందని పేర్కొంది. అయితే టెలికం ప్రొవైడర్లలో గట్టి పోటీ నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో జియో టారిఫ్ పెంచే అవకాశాలు లేవని చెబుతున్నారు. సోమవారం నాడు RIL షేర్లు సెన్సెక్స్, నిఫ్టీలో పడిపోయాయి. జేపీ మోర్గాన్... సెకండ్ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ. ఇది గత కొంతకాలంగా RIL వృద్ధిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. గత నెలలో మోర్గాన్ స్టాన్లీ కూడా RIL వృద్ధి 2020 ఆర్థిక సంవత్సరంలో సగానికి తగ్గవచ్చునని అంచనా వేసింది. 2017 నుంచి 2019 ఆర్థిక సంవత్సరం వరకు 17 శాతం వృద్ధి కనిపించింది.

 GRM కీలకం

GRM కీలకం

రిఫైనింగ్, పెట్రో రసాయనాల మార్జిన్లు తమ అంచనాల కంటే పదిహేను శాతం తగ్గవచ్చునని, ఆయిల్ ధరలు తక్కువగా కావడం కూడా రిలయన్స్ పైన ప్రభావం పడుతుందని జేపీ మోర్గాన్ పేర్కొంది. గ్యాసిఫైర్, ROGC, ఈథాన్ షిప్పింగ్ వంటి కొత్త ప్రాజెక్టుల లాభదాయకతలు ఆయిల్ ధరలతో ముడివడి ఉంటాయన్నారు. గత కొన్ని క్వార్టర్లుగా GRM (గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్) ఒత్తిడిలో ఉన్నాయని పేర్కొంది. మార్చి క్వార్టర్‌లో బ్యారెల్ ధర 8.2 డాలర్లుగా ఉంటే, అంతకుముందు ఏడాది ఇదే సమయంలో 11.1 డాలర్లుగా ఉందని గుర్తు చేసింది. 2014 అక్టోబర్ - డిసెంబర్ పీరియడ్‌లో బ్యారెల్ 7.3 డాలర్లుగా ఉందని, ఆ తర్వాత కనిష్టస్థాయి ఇప్పుడే (ఈ ఏడాది మార్చి క్వార్టర్)నని పేర్కొంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్

రిలయన్స్ ఇండస్ట్రీస్

ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్ (IMO) రెగ్యులేషన్స్ ప్రకారం షిప్పింగ్ కంపెనీలు జనవరి 2020 వరకల్లా తమ బంకర్ ఇంధనంలో సల్ఫర్ పరిమాణాన్ని 3.5 శాతం నుంచి 0.5 శాతానికి తగ్గించాలి. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి రిఫైనరీస్‌కు ఉత్సాహాన్ని ఇచ్చేదే. IMO 2020 నిబంధనలు నిరుత్సాహపరిస్తే మాత్రం ఇది ప్రతిబంధకంగా మారుతుందని పేర్కొంది. 2020 ద్వితీయర్థంలో GRMలు రికవరీ చెందవచ్చుననే అంచనాతో ప్రస్తుతానికి 2020 ఆర్థిక సంవత్సరం అంచనాలు తగ్గించడం లేదని పేర్కొంది. దీంతో పాటు రిలయన్స్ జియో ఇన్ఫ్రాస్ట్రక్టర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్ (InvIT)కు సంబంధించి పేమెంట్ కమిట్‌మెంట్స్ అందుబాటులో ఉండవచ్చునని భావిస్తోంది. ఒకవేళ రిలయన్స్... జియో ఫిక్స్‌డ్ పేమెంట్స్‌ను కేపిటలైజ్ చేస్తే కనుక ఎర్నింగ్స్ పర్ షేర్ (EPS)పై ప్రభావం ఉండకపోవచ్చునని పేర్కొంది.

English summary

ముఖేష్ అంబానీ రిలయన్స్‌కు షాక్: JIO టారిఫ్ 20శాతం దాకా పెంచితేనే...! | 15% downside to RIL's earnings estimate: JPMorgan

The current weak environment for refining and petrochemicals holds a 15 per cent downside risk to Reliance Industries (RIL) estimated FY20 earnings, brokerage firm JP Morgan said in a note. Analysts said there could be more cuts to estimated earnings if the expected IMO 2020 regulations disappoint.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X