బెంగళూరు: అమెజాన్ ఇండియా సరికొత్త ఆలోచన చేస్తోంది. తమ డెలివరీల్లో విద్యార్థులు, మహిళలు (housewives)ను భాగస్వామ్యం చేయాలని చూస్తోంది. దీంతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కీలకమైన సమయంలో... అంటే ఎక్కువ డెలివరీలు ఉన్న సమయంలో ఓవైపు వేగవంతమైన డెలివరీతో పాటు, ఉబేర్ తరహా ఫ్లెక్సిబుల్ ఉద్యోగాల కల్పనకు బాటలు వేసినట్లుగా ఉంటుందని భావిస్తోంది.

రెండు గంటల్లో గ్రాసరీస్ డెలివరీ
ఈ-కామర్స్ బిజినెస్‌కు వేగవంతమైన మరియు నమ్మకమైన డెలివరీ ఎంతో కీలకం. మంచి లేదా అందుబాటులో ఉండే ధరల ఉత్పత్తులతో పాటు పై రెండు అంశాలు కూడా ఎంతో ముఖ్యం. వేగవంతమైన డెలివరీ కోసం అమెజాన్ ఇండియా గత కొంతకాలంగా కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా వన్ డే, టూ డే, షెడ్యూల్డ్ డెలివరీస్ ఇస్తోంది. ప్రైమ్ ఆఫర్స్ అయితే కొన్ని ఉత్పత్తులను మరుసటి రోజు డెలివరీ చేస్తోంది. గ్రాసరీస్ అయితే రెండు గంటల్లో డెలివరీ చేస్తోంది.

రోజుకు 4 గంటలు.. గంటకు రూ.140 వరకు సంపాదన
ఇందులో భాగంగా అమెజాన్ ఇండియా హౌస్‌వైఫ్స్, విద్యార్థులు ఖాళీగా ఉన్న సమయాల్లో వారికి అదనంగా డబ్బులు సంపాదించుకునే అవకాశం కల్పించాలని చూస్తోంది. ఓ వ్యక్తి రోజుకు 4 గంటలు పని చేస్తే వారు డెలివరీ చేయడం ద్వారా వారికి గంటకు రూ.120 నుంచి రూ.140 వరకు సంపాదించుకునే వెసులుబాటు ఉండనుంది. ఇలా పార్ట్‌టైమ్ డెలివరీ చేసే వారికి ప్రతి బుధవారం పేమెంట్ ఇవ్వనుంది. ఇందులో భాగంగా అమెజాన్ ఫ్లెక్స్ (Amazon Flex)ను ప్రారంభించింది.

అమెజాన్ ఫ్లెక్స్ సేవలు
అమెజాన్ ఫ్లెక్స్ ద్వారా విద్యార్థులు, ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్, సర్వీస్ సెక్టార్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్స్, హౌస్‌వైఫ్స్ వంటి వారు ఉత్పత్తులను డెలివరీ చేసి సంపాదించుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ఈ సేవల్ని 2015లో ప్రారంభించింది. ఆరు దేశాల్లో ఈ రకమైన సేవలు ఉన్నాయి. భారత్‌లో ఇప్పుడు లాంచ్ చేసింది. తొలుత ఢిల్లీ, ముంబై, బెంగళూరులో అమెజాన్ ఫ్లెక్స్ సేవలు ప్రారంభించింది. క్రమంగా ఇతర నగరాలకు విస్తరించనున్నారు. అమెజాన్ ఫ్లెక్స్ సేవలు లాంచ్ అయిన దేశాల్లో ఇండియా ఏడోది. నార్త్ అమెరికా, జర్మనీ, స్పెయిన్, జపాన్, సింగపూర్, యూకేలో ఇదివరకే ప్రారంభించింది.

అమెజాన్
అమెజాన్ భారత్‌లోకి 2013లో అడుగు పెట్టింది. 4,00,000 మంది వ్యాపారుల నుంచి 170 మిలియన్ ఉత్పత్తులు అమెజాన్‌లో లభిస్తాయి. గత ఏడాది తమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను 1.5 రెట్లు పెంచుకుంది. డిమాండ్ (డెలివరీ) ఎక్కువగా ఉన్న సమయంలో అమెజాన్ ఫ్లెక్స్ ద్వారా వచ్చే పార్ట్ టైమ్ సేవలు వేగవంతమైన డెలివరీకి ఉపయోగపడతాయని, తమ సర్వీస్ పర్ఫార్మెన్స్ పెరగడానికి కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications