For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బడ్జెట్‌పై రియల్ ఎస్టేట్ రంగం భారీ అంచనాలు

By Jai
|

హైదరాబాద్: తిరుగులేని మెజారిటీతో రెండో సారి అధికారం లోకి వచ్చిన మోడీ ప్రభుత్వంపై భారత రియల్ ఎస్టేట్ రంగం భారీ ఆశలను పెట్టుకొంది. త్వరలో ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశ పెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్లో ఈ రంగానికి ప్రయోజం చేకూర్చే అంశాలను విన్నవిస్తోంది. ఈ మేరకు ప్రముఖ రియల్ ఎస్టేట్ రంగ కన్సల్టెన్సీ సంస్థ అనారోక్ ప్రాపర్టీస్ ఆరు అంశాలతో కూడిన వినతులను ప్రభుత్వం ముందు ఉంచింది.

దేశ జీడీపీ లో అత్యంత ప్రముఖ పాత్ర కలిగిన రియల్ ఎస్టేట్ రంగం మరింత అభివృద్ధి చెందితే లక్షల మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తద్వారా దేశ అభివృద్ధి సాధ్య పడుతుందని అనారోక్ పేర్కొంది. విన్నపాలు ఇవే:....

బహుళజాతి కంపెనీలకు ముచ్చెమటలు పట్టించిన పతంజలికి ఏమైంది?బహుళజాతి కంపెనీలకు ముచ్చెమటలు పట్టించిన పతంజలికి ఏమైంది?

NBFC లకు రీ ఫైనాన్స్ సౌకర్యం:

NBFC లకు రీ ఫైనాన్స్ సౌకర్యం:

రియల్ ఎస్టేట్ రంగంలోని దేవేలోపెర్స్ కు రుణాలు అందించే NBFC సంస్థలకు రీ ఫైనాన్స్ సౌకర్యం కల్పించాలి . ఇప్పటికే సంక్షోభంలో మునిగిన ఈ రంగానికి ఊతం లభించాలి. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో 5.6 లక్షల యూనిట్స్ పూర్తి అయ్యేందుకు ఇది తోడ్పడుతుంది.

బ్యాంకు ఫండింగ్ పెంచాలి:

బ్యాంకు ఫండింగ్ పెంచాలి:

నిధుల కొరత వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న రియల్ ఎస్టేట్ దేవేలోపెర్సకి బ్యాంకుల నుంచి నిధుల లభ్యత పెంచాలి.

ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పునరుద్ధరించాలి:

ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పునరుద్ధరించాలి:

జీఎస్టీ లో భాగంగా దేవేలోపెర్స్కు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐసీటీ ) పునరుద్ధరించాలి. లేదంటే వారి లాభదాయకత దెబ్బతింటుంది. ఐసీటీ ఆప్షన్ లేకపోతే వారు ఆ భారాన్ని వినియోగదారులపై మోపుతారు. కాబట్టి ఈ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది.

కొనుగోలుదారులకు మరిన్ని ప్రయోజనాలు:

కొనుగోలుదారులకు మరిన్ని ప్రయోజనాలు:

రియల్ ఎస్టేట్ కొనుగోలుదారులకు బడ్జెట్లో మరిన్ని పన్ను కల్పించాలి. పన్ను స్లాబులను సవరించటంతో పటు, 80సి పరిమితి పెంచాలి. తద్వారా వినియోగదారులు,ఇన్వెస్టర్స్ ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మరింత ఆసక్తి చూపుతారు.

మౌలికవసతుల కల్పన:

మౌలికవసతుల కల్పన:

మౌలిక వసతుల కల్పన వల్ల రియల్ ఎస్టేట్ రంగం కూడా లాభపడింది. గృహ, వాణిజ్య సముదాయాలకు సరైన రవాణా సదుపాయాలు ఉంటె కొనుగోలు దారులు లబ్ది పొందుతారు. ఇది దేవేలోపెర్స్కు, వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

పెట్టుబడుల ఆకర్షణ:

పెట్టుబడుల ఆకర్షణ:

రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి జరగాలంటే ఈ రంగంలోకి భారీగా పెట్టుబడులు ఆకర్షించాలి. విదేశీ పెట్టుబడులను సైతం పెద్ద ఎత్తున ఆకర్షించాల్సి ఉంటుంది. అందుకే ఆ మేరకు పెట్టుబడి అనుకూల నిర్ణయాలు ఉండాలి.

English summary

బడ్జెట్‌పై రియల్ ఎస్టేట్ రంగం భారీ అంచనాలు | Developers want Budget to ease liquidity, make changes in GST

As the new Finance Minister Nirmala Sitharaman presents the Union Budget for the fiscal 2019-20 on July 5, the real estate players want the Budget document to feature steps to improve the liquidity situation with a proposal to re introduce Input Tax Credit (ITC) for under construction properties.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X