For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

GDPని చాలా ఎక్కువ చేసి చూపారు: మన్మోహన్-మోడీపై సుబ్రహ్మణియన్

|

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వంలో చీఫ్ ఎకనమిస్ట్‌గా పని చేసిన అరవింద్ సుబ్రహ్మణియన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో, అలాగే మోడీ ప్రభుత్వంలో ఒక్కోసారి జీడీపీ (గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్ )ను భారీగా పెంచి చూపినట్లు ఆరోపించారు. 4.5 శాతంగా ఉన్న జీడీపీని 7 శాతంగా చూపించారని తెలిపారు. ఈ మేరకు 'ఇండియాస్ జీడీపీ మిస్ ఎస్టిమేషన్: లైక్లీ హుడ్, మ్యాగ్నిట్యూడ్, మెకానిజం, ఇంప్లికేషన్స్' అనే పేరుతో వెలువరించిన పరిశోధనా పత్రం మంగళవారం ఓ ఇంగ్లీష్ మీడియాలో వచ్చింది. ఇందులో పలు ఆసక్తికర అంశాలు ఉన్నాయి.

<strong>రూ.10వేల లోపు ధర కలిగిన 6GB రామ్ స్మార్ట్ ఫోన్!</strong>రూ.10వేల లోపు ధర కలిగిన 6GB రామ్ స్మార్ట్ ఫోన్!

GDPని ఎక్కువ చేసి చూపారు

GDPని ఎక్కువ చేసి చూపారు

మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ, మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ హయాంలో భారత జీడీపీ వృద్ధి అంచనాల్ని ఎక్కువగా చూపించారని ఈ మాజీ ప్రధాన ఆర్థికసలహాదారు(అరవింద్ సుబ్రహ్మణ్యం) పేర్కొన్నారు. 2011-12, 2016-17 మధ్యకాలంలో జీడీపీని ఎక్కువ చేసి చూపించారని తెలిపారు. జీడీపీ లెక్కింపు పద్ధతుల్లో ఉన్న తేడాల వల్లే అసలు కంటే 2.5 శాతం ఎక్కువగా అంచనా వేశారన్నారు. 2011, 2016 మధ్యకాలంలో భారత వృద్ధి సరాసరి 4.5 శాతంగా ఉందని, కానీ అధికారిక అంచనా మాత్రం 6.9 శాతంగా ఉందని చెప్పారు.

ఆధారాలు ఉన్నాయని వ్యాఖ్య

ఆధారాలు ఉన్నాయని వ్యాఖ్య

2011 తర్వాత జీడీపీ లెక్కింపు కోసం తీసుకు వచ్చిన కొత్త పద్ధతులే అధిక అంచనాలకు కారణమని, దీనికి సంబంధించి పలు ఆధారాలు ఉన్నాయని చెప్పారు. భారత్ వేగవంతమైన వృద్ధి కోసం వాస్తవిక విధానాలను అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. వెహికిల్ సేల్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, క్రెడిట్ గ్రోత్, ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ వంటి 17 అంశాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

భారత ఆటోమొబైల్స్ విధానంపై సుబ్రహ్మణియన్

భారత ఆటోమొబైల్స్ విధానంపై సుబ్రహ్మణియన్

భారతీయ ఆటోమొబైల్ విధానం సరిగాలేదని అరవింద్ సుబ్రహ్మణియన్ అన్నారు. ఇది దశ, దిశ లేని విధంగా ఉందన్నారు. అరవింద్ సుబ్రహ్మణియన్ గత ఏడాది జూన్ నెలలో సీఈఏ (చీఫ్ ఎకనమిస్ట్ ఆఫీసర్) పదవి నుంచి తప్పుకున్నారు.

English summary

GDPని చాలా ఎక్కువ చేసి చూపారు: మన్మోహన్-మోడీపై సుబ్రహ్మణియన్ | Real GDP Growth Between 2011-12 and 2016-17 Was 4.5%, Not 7%: Arvind Subramanian

Questioning the government's official GDP growth figures, former Chief Economic Advisor Arvind Subramanian has said that the country may have grown at an average 4.5 percent between 2011-12 and 2016-17, instead of the 7 percent average shown officially.
Story first published: Tuesday, June 11, 2019, 16:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X