For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓపెన్ ఎండెడ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో తగ్గిన పెట్టుబడులు

By Jai
|

ఓపెన్ ఎండెడ్ ఇన్ కమ్ లేదా డెట్ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. మే నెలలో ఈ పథకాల్లోకి రూ. 70,119 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏప్రిల్ నెల (రూ.1,20,920 కోట్లు) తో పోల్చితే పెట్టుబడులు 42 శాతం తగ్గాయి. డెట్ పథకాలపై ఇన్వెటర్ల విశ్వాసం తగ్గడమే పెట్టుబడులు తగ్గడానికి కారణమని విశ్లేషకులుచెబుతున్నారు.

ఇటీవలి కాలంలో కొన్ని కంపెనీలు డీఫాల్ట్ కావడంతోపాటు కొన్ని కంపెనీల పథకాలను డౌన్ గ్రేడ్ చేయడం వంటి పరిణామాలు ఇన్వెస్టర్ల విశ్వసాన్ని దెబ్బతీస్తున్నాయి. మే నెలలో లో డురేషన్ ఫండ్స్, షార్ట్ డురేషన్ ఫండ్స్, మీడియం డురేషన్ ఫండ్స్, డైనమిక్ బ్యాండ్ ఫండ్, క్రెడిట్ రిస్క్ ఫండ్స్, గిల్ట్ ఫండ్స్ వంటి డెట్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీల్లో నుంచి నిధులు బయటకు వెళ్లాయి.

Open ended debt mutual funds see 42% fall in net inflows

ఫిక్స్డ్ టర్మ్ ప్లాన్ లదీ అదే తీరు...
ఫిక్స్డ్ టర్మ్ ప్లాన్ల నుంచి కూడా పెట్టుబడులు తరలిపోతున్నాయి. మే నెలలో ఈ కేటగిరీ నుంచి రూ. 1,798 కోట్లు వెళ్లాయి. ఏప్రిల్ నెలలో తరలిపోయిన పెట్టుబడులు రూ. 17,644 కోట్లు గా ఉన్నాయి.

- మరోవైపు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి పెట్టుబడులు 17 శాతం పెరిగి రూ.4,609 కోట్ల నుంచి రూ. 5,408 కోట్లకు చేరాయి.
- ఈఎల్ఎస్ఎస్ లేదా టాక్స్ సేవింగ్ ఈక్విటీ స్కీం లలోకి మే నెలలో రూ. 1,310 కోట్లు వచ్చాయి. ఏప్రిల్లో ఈ స్కీమ్స్ రూ. 1,354 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి.
- మే నెలలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల సగటు విలువ 0.62 శాతం పెరిగి రూ. 25.43 లక్షల కోట్లకు చేరుకున్నాయని యాంఫీ గణాంకాల ద్వారా తెలుస్తోంది.

రూ.300 ఇన్వెస్ట్‌తో కోటీశ్వరులు కావొచ్చు!రూ.300 ఇన్వెస్ట్‌తో కోటీశ్వరులు కావొచ్చు!

English summary

ఓపెన్ ఎండెడ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో తగ్గిన పెట్టుబడులు | Open ended debt mutual funds see 42% fall in net inflows

Open ended income or debt oriented scheme witnessed a 42 per cent month on month fall in net inflows, shows AMFI data. The net inflows for May stood at Rs 70,119 crore as against net inflows of Rs 1,20,920 crore in April.
Story first published: Monday, June 10, 2019, 16:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X