For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్మెట్ పెట్టుకోలేదా.. అయితే మీకు నో పెట్రోల్: బైకర్స్ ఇబ్బందులు ఇవీ..

|

నోయిడా: నోయిడా పరిధిలో ద్విచక్ర వాహనదారులకు కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. 'నో హెల్మెట్... నో ఫ్యూయల్'ను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లాంచ్ చేసింది. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసే బైకర్స్‌కు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లభించదు. ఇది జూన్ 1, శనివారం నుంచి అమలులోకి వచ్చింది. హెల్మెట్ లేకుంటే పెట్రోల్ పోయవద్దని జిల్లా అడ్మినిస్ట్రేషన్ కఠిన ఆదేశాలు జారీ చేసింది.

భారత్‌కు అమెరికా షాక్, GSP ప్రభావం ఉండదని ఇండియాభారత్‌కు అమెరికా షాక్, GSP ప్రభావం ఉండదని ఇండియా

హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే నో పెట్రోల్

హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే నో పెట్రోల్

రోడ్ సేఫ్టీని ప్రోత్సహించేందుకు జిల్లా మేజిస్ట్రేట్ బ్రిజేష్ నారాయణ్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఉన్నతాధికారులు పెట్రోల్ పంపుల యజమానులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతానికి ఈ అదేశాలను ఇక్కడ అమలు చేసి, అనంతరం ఇతర ప్రాంతాల్లో అమలు చేయాలని యజమానులకు సూచించారు. హెల్మెట్‌ లేకుండా ప్రయాణం చేస్తే డ్రైవింగ్‌ లైసెన్స్ రద్దుతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అలాగే పెట్రోల్ బంకుల్లోని సిబ్బందితో ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే బైక్ రైడర్లను అరెస్ట్‌ చేస్తామని చెప్పారు. ఐపీసీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 151 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేస్తారు. మోటారు వాహనాల చట్టం 129 సెక్షన్ ప్రకారం, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం నేరం. దీనిని ఉల్లంఘిస్తే ఆరు నెలల జైలు శిక్ష విధించవచ్చు.

జరిమానా

జరిమానా

నోయిడా, గ్రేటర్ నోయిడా పరిధిలోని 42 స్టేషన్లలో ఈ ఆదేశాలు వర్తిస్తాయని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. కాగా, శనివారం రోజు హెల్మెట్ పెట్టుకోనందుకు ఈ ప్రాంతంలో 745 మంది బైకర్స్‌కు జరిమానా విధించింది. సెక్టార్ 12/22, నోయిడా స్టేడియం, జల్ వాయు విహార్ ఇంటర్ సెక్షన్, మమురా చౌక్, మోడల్ టౌన్ 62, సెక్టార్ 37, పారి చౌక్‌లలో ఈ జరిమానా విధించారు.

బైక్ యూజర్స్ ఇబ్బందులు

బైక్ యూజర్స్ ఇబ్బందులు

జూన్ 1న జరిమానాపై మనిష్ కుమార్ అనే బైకర్ మాట్లాడుతూ... తాను నోయిడాకు వెళ్తున్నానని, ఇక్కడ ఎప్పుడు కూడా ట్రాఫిక్ పోలీసులు ఆపలేదని, హఠాత్తుగా హెల్మెట్ లేకుంటే పెట్రోల్ పోయమనే నిబంధనను అమలు చేయడం సరికాదని, ఇలా సడన్‌గా అమలు చేస్తే ఎవరికైనా బైక్‌లో పెట్రోల్ పూర్తయితే ఇబ్బంది అని ఆవేదన వ్యక్తం చేశారు.

దినేష్ యాదవ్ అనే మరో వ్యక్తి మాట్లాడుతూ... తాను వాటర్ క్యాన్స్ డెలివరీ చేస్తానని, కాబట్టి తాను హెల్మెట్ పెట్టుకొని తన వృత్తిని నిర్వహించలేనని, తాను రోజంతా వాటర్ క్యాన్స్‌తో బైక్ నడుపుతానని, అలాంటి తనకు పెట్రోల్ దొరకకుంటే ఎలాగని వాపోయారు. అయినా తాను హెల్మెట్ ధరించలేని పరిస్థితి అని చెప్పారు.

English summary

హెల్మెట్ పెట్టుకోలేదా.. అయితే మీకు నో పెట్రోల్: బైకర్స్ ఇబ్బందులు ఇవీ.. | Fights at pumps mark Day 1 of no helmet, no petrol drive

Two wheeler riders without helmets in Noida and Greater Noida will not be given fuels at fuel stations from June 1. This initiative is taken by Brajesh Narain Singh, District Magistrate, to promote road safety
Story first published: Sunday, June 2, 2019, 15:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X