బ్యాంకుల నుండి లోన్లు తీసుకుని లోన్లు కట్టకుండా ఇబ్బంది పెట్టే మొండి పద్దుల వసూళ్ళకు నడుం బిగించాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు. గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో రూ.1.2 లక్షల కోట్ల మొండి పద్దులను రికవరీ చేసుకున్నట్లు తెలిపాయి . దివాలా స్మృతి చట్టం (ఐబీసీ) ద్వారా ప్రధానంగా ఈ మొండి బకాయిల (ఎన్‌పీఏ)ను రాబట్టుకోగలిగినట్లు ఓ ఉన్నతాధికారి చెప్పారు. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో ఉన్న కొన్ని పెద్ద దివాలా కేసులు పరిష్కారం కాకపోవటంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్ధేశిత రూ.1.80 లక్షల కోట్ల రికవరీ లక్ష్యాన్ని అందుకోలేకపోయాయన్నారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఖాతాలన్నీ పరిష్కారంకావచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వ రంగ బ్యాంకులు కన్సాలిడేషన్ దిశగా సాగుతుండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికవరీలు గరిష్ఠ స్థాయిలో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. మరోవైపు ఎన్‌బీఎఫ్సీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు.
2017-18లో బ్యాంకులు రూ.74,562 కోట్ల ఎన్‌పీఎలను రికవరీ చేసుకోగా 2018-19 నాటికి ఇది రూ.1.2 లక్షల కోట్లకు చేరుకుందన్నారు. ఇందులో ఎన్‌సీఎల్‌టీలో పరిష్కారమైన కేసుల విలువ రూ.55,000 కోట్లుగా ఉందని తెలిపారు.రెండు భారీ మొండి పద్దులైన ఎస్సార్ స్టీల్, భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్ ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని, వచ్చే కొద్ది నెలల్లో ఇవి పరిష్కారం కావచ్చని తెలిపారు. ఈ రెండు పద్దుల విలువ సుమారు రూ.55,000 కోట్ల వరకు ఉండనుందన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!



Click it and Unblock the Notifications