హైదరాబాద్: అది పేరుకే రెరా.. అన్నీ లోపాలే.. ప్రభుత్వ పెద్దల కనుసన్నలతో నడుస్తున్న సంస్థ కదా అని అందరూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భవన నిర్మాణ నిబంధనలు పాటించని ప్రాజెక్ట్‌లు సైతం రెరాలో నమోదవుతున్నాయా? రెరాలో రిజిస్టర్ అయిన ప్రాజెక్ట్‌లను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే నిజమే అనిపిస్తుంది. తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్-రెరా)లో ఇప్పటివరకు నమోదు చేసుకున్న అపార్ట్‌మెంట్లలో చాలా వాటిల్లో ఫైర్ సేఫ్టీ గానీ ఇంధన, పర్యావరణ శాఖ నిబంధనలు పాటించలేదు.

భవన నిర్మాణాల్లో అన్నీ లోపాలే..! పట్టించుకోని అదికారులు..!!
భవన నిర్మాణ నిబంధన ప్రకారం.. 15 మీటర్ల కంటే ఎత్తయిన భవనాలకు అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌వోసీ), 15 మీటర్ల కంటే తక్కువ ఉంటే జీహెచ్‌ఎంసీ నుంచి ఎన్‌వోసీ ఉండాలి. కానీ, కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు చేపడుతున్న హైరైజ్ భవనాలు మినహా చాలా ప్రాజెక్ట్‌లు ఎలాంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించలేదు. అయినా సరే రెరా అధికారులు ప్రాజెక్ట్‌లను రిజిస్టర్‌లో చేయడం, గుర్తింపు పత్రం, సంఖ్య కూడా కేటాయించారు.

రెరా లక్ష్యం అదేనా..! కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న నిర్లక్ష్యం..!!
ఈ రోజుల్లో నివాస భవనాల నిర్మాణంలో ఫాల్స్ సీలింగ్, ఫోమ్ సీలింగ్, అదనపు లైట్ల ఏర్పాట్లు, పైప్‌డ్ గ్యాస్ కనెక్షన్స్ వంటి ఏర్పాట్లు ఎక్కువయ్యాయి. వీటికి వేడిని గ్రహించే శక్తి ఎక్కువగా ఉండటంతో అగ్ని ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. అందుకే ఫైర్ ఎన్‌వోసీ ఉంటేనే రెరాలో రిజిస్ట్రేషన్ చేయాలని, ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా సరే ప్రమాదాలను ఊహించలేమని రెసిడెన్స్ అసోసియేషన్ హెచ్చరిస్తుంది.

ఇంధన, పర్యావరణ నిబంధనలు కూడా లేవు..! గాలికొదిలేసిన నిర్వాక్ష్కులు..!!
రెరాలో నమోదైన చాలా ప్రాజెక్ట్‌లు ఫైర్ సేఫ్టీ మాత్రమే కాదండోయ్ ఇంధన, పర్యావరణ నిబంధనలు కూడా గాలికొదిలేశాయి. సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్‌టీపీ), రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, ఘన వ్యర్థాల నిర్వహణ, ఇంకుడు గుంతలు వంటి ఏర్పాట్లేవీ లేని ప్రాజెక్ట్‌లు సైతం రెరాలో రిజిస్టరయ్యాయి. 300 చదరపు మీటర్ల కంటే ఎక్కువ స్థలంలో నిర్మించే భవనాల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాట్లు ఉండాల్సిందే.

ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత సేఫ్టీ పాటిస్తారట..!!
కానీ, నగరంలోని ప్రధాన ప్రాంతాలతో పాటూ శివారుల్లోని అర్హత ఉన్న భవనాల్లోనూ నిబంధనలు పాటించలేదు. 'కొన్ని సందర్భాల్లో ఇలాంటి ప్రాజెక్ట్‌లు రెరాలో నమోదైన విషయం వాస్తవమే. సంబంధిత ప్రాజెక్ట్ నిర్మా ణం పూర్తయ్యాక తగిన చర్యలు తీసుకుంటామని' రెరా అధికారులు తెలపడం గమనార్హం.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications