For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెట్రోల్ ధరలు భగ్గుమంటాయా?

By Jai
|

దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమనే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఇరాన్ నుంచి భారత్ ముడి చమురు దిగుమతులు నిలిపివేయడమే. ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతులు చేసుకోవద్దన్న అగ్ర రాజ్యం అమెరికా ఆదేశాల మేరకు భారత ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు ఇరాన్ నుంచి భారత్ నెలకు 25 లక్షల టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకునేది. దీన్ని క్రమంగా 10 లక్షల టన్నులకు తగ్గించు కుంది. ఇప్పుడు పూర్తిగా నిలిపి వేసింది. భారత ముడి చమురు అవసరాల్లో 80 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. భారత్ అవసరాల్లో ఇరాన్ వాటా 10 శాతంగా ఉండేది.

ధరలు పెరగవచ్చు..

గల్ఫ్ దేశాలనుంచి దిగుమతి చేసుకునే ముడి చమురులో నాణ్యత ఎక్కువ ఉంటుంది. అంతే కాకుండా ఈ దేశాలు భారత్ కు క్రెడిట్ సదుపాయాన్ని కల్పిస్తాయి. ఇరాన్ చమురు కస్టమర్లలో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. అయితే అమెరికా ఆంక్షల నేపథ్యంలో గత జనవరి నుంచి భారత్ చమురు దిగుమతులు తగ్గించుకుంటోంది.

SBI కస్టమర్ అలర్ట్: ఇవి తెలుసుకోండిSBI కస్టమర్ అలర్ట్: ఇవి తెలుసుకోండి

Will petrol, diesel price hike soon?

నాలుగు నెలల్లో చమురు దిగుమతులు అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోల్చితే 45 శాతం తగ్గాయి. చమురు దిగుమతులను తగ్గించు కోవడం వల్ల మరోదేశం నుంచి దిగుమతులు చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ దూరం ప్రయాణించాల్సి రావొచ్చు. సమయం కూడా ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. దీని ప్రభావం ధరలపై పడవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు..

English summary

పెట్రోల్ ధరలు భగ్గుమంటాయా? | Will petrol, diesel price hike soon?

Oil marketing companies (OMCs) raised petrol and diesel prices marginally on Friday. As per the Indian Oil Corporation data, petrol became dearer by 14 paise a litre to Rs 71.39 in Delhi, while diesel was revised by 16 paise to Rs 66.45 per litre on Friday.
Story first published: Friday, May 24, 2019, 13:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X