For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టాక్ టిప్స్‌ను ఎంత వరకూ నమ్మొచ్చు ?

By Chanakya
|

స్టాక్ మార్కెట్‌లో టిప్స్ చాలా కామన్. ప్రతీ ఒక్కరూ వీటికి బాగా ఎట్రాక్ట్ అవుతారు. మార్కెట్లో పదివేల పెట్టుబడి పెట్టేవాళ్లు మొదలు... కోట్లకు కోట్లు కుమ్మరించేవాళ్లు కూడా వీటిపై ఓ చెవు వేసి ఉంటారు. ఇద్దరు స్టాక్ మార్కెట్ మిత్రులు ఎవరైనా కలిస్తే... మొదట మాట్లాడుకునేది ఇప్పుడు ఏ స్టాక్స్ బాగున్నాయ్.. ఏవి కొనాలి ? అనే అంశమే చర్చకు వస్తుంది. అయితే అలాంటి టీ షాప్ డిస్కషన్ల దగ్గరా, బార్‌లో రిలాక్స్ అవుతూ మాట్లాడుకునే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయొచ్చా.. ? ఇది ఇప్పుడు మన టాపిక్.

ఎందుకు నమ్మకూడదు

ఎందుకు నమ్మకూడదు

స్టాక్ మార్కెట్ - ఇది ఏ కామర్స్, ఎకనమిక్స్, స్టాటిస్టిక్స్‌కు అందని ఓ ఎమోషనల్ గేమ్. ఇందులో ప్రతీ ఒక్కరూ తాము గెలుస్తామని ధీమాగా ఉంటారు. కానీ ఎండ్ రిజల్ట్ మాత్రం వేరుగా ఉంటుంది. ప్రతీ ఒక్కరూ.. ఇది తమకు మాత్రమే తెలిసిన స్టాక్ టిప్ అని, ఇది ఎవ్వరికీ చెప్పొద్దని మాట్లాడుకుంటారు. కానీ ఏదైనా స్టాక్ టిప్ తెలిస్తే.. వాళ్లు ఇద్దరికే చెబుతారు. మొదటిది అడిగిన వాళ్లకు, రెండోది అడగని వాళ్లకు. (లాజిక్ అర్థమైందా.. ?!) అంటే మనకు ఏదైనా తెలిస్తే.. నలుగురికీ చెప్పకపోతే మనకు మనశ్శాంతి ఉండదు. అది మానవ నైజం. అందుకే ఎక్కడో అహ్మదాబాద్‌లో మొదలైన స్టాక్ రికమెండేషన్.. అనకాపల్లికో, ఆదిలాబాద్‌లో చేరడానికి రెండు, మూడు రోజులకు మించి సమయం పట్టదు. కొన్ని సందర్భాల్లో గంటల్లోనే ఇది దేశవ్యాప్తంగా పాకిపోతుంది.

విశ్వసనీయత

విశ్వసనీయత

అయితే ఈ స్టాక్ టిప్‌లో ఎంత విశ్వసనీయత ఉంది అనే అంశాన్నే మనం పరిగణలోకి తీసుకోవాలి. వాస్తవానికి టిప్ ఇచ్చే వాళ్లకు ఏదో ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేకపోతే తప్ప అది బయటకు రాదు. అందుకే అలాంటి వాటిని నమ్మకపోవడమే శ్రేయస్కరం. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే.. ఇలా వచ్చే స్టాక్ రికమెండేషన్స్ అన్నీ రూ.50/100 లోపు ఉన్న స్టాక్స్ ఉంటాయి. వీటిల్లో విపరీతమైన యాక్టివిటీ ఉంటుంది. ఒక వేళ రూ.5 నుంచి 10 లోపు ఉన్న స్టాక్ టిప్స్ అయితే మహా క్రేజ్ ఉంటుంది. కొంత మంది ఇన్వెస్టర్లు కూడా వీటిని ఏకంగా 5వేలు, 10వేలు, 20 వేల చొప్పున కొంటారు. ఎందుకంటేవాళ్ల లెక్క ఏంటంటే.. ఒక్క నాలుగైదు రూపాయలు స్టాక్ పెరిగినా వేలకు వేలు డబ్బులు వచ్చిపడ్తాయి కదా అని భావిస్తారు. కానీ ఇలాంటి టిప్స్‌లో డబ్బులు పోయిన సందర్భాలే ఎక్కువ. ఎందుకంటే సదరు స్టాక్ టిప్ మన దగ్గరకు వచ్చే సరికి దాన్ని అంతకు ముందు తక్కువ ధరకు కొన్నవారు లాభాలు మూటగట్టుకుని బయటపడ్తారు.

మరి ఎవరిని నమ్మాలి

మరి ఎవరిని నమ్మాలి

స్టాక్ రికమెండేషన్‌కు మనం సెబీ రిజిస్టర్డ్ కంపెనీని ఎంపిక చేసుకోవాలి. అదికూడా పెద్ద కంపెనీలను, పటిష్టమైన రీసెర్చ్ టీం ఉన్న కంపెనీలను చూసుకోవాలి. సదరు స్టాక్‌ను రికమెండేషన్ చేయడం వెనుక హేతుబద్ధత (రేషనేల్) ఏంటో ఉండాలి. ఈపీఎస్ ఎంత, పీఈ ఎంతుంది, గతంలో కంపెనీ పనితీరు ఏంటి, రాబోయే రోజుల్లో విస్తరణ ప్రణాళికలపై సంస్థ యాజమాన్యం ఏం అంటోంది.. వంటి అనేక అంశాలకు స్పష్టమైన సమాధానాలు ఉండాలి. అవన్నీ సంతృప్తి పరిచేవిగా ఉండాలి. అందులోనూ సదరు స్టాక్ ప్రైస్.. అప్పటికే భారీగా పెరిగి ఉండకూడదు. చాలా చాలా ఫ్యాక్టర్స్ పరిగణలోకి తీసుకున్న తర్వాత... మాత్రమే టిప్ రూపంలో వచ్చిన స్టాక్‌ను కొనుగోలు చేయొచ్చు. ఊరికే ఎవరో చెప్పారు కదా.. అని కొంటే మాత్రం నష్టపోకతప్పదు.

English summary

స్టాక్ టిప్స్‌ను ఎంత వరకూ నమ్మొచ్చు ? | can we believe stock tips?

can we believe stock tips?
Story first published: Thursday, May 23, 2019, 15:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X