కొత్త ఫండ్స్ వచ్చాయ్ ... పెట్టుబడికి సిద్ధమేనా?

మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడుతున్న ఇన్వెస్టర్ల కోసం మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు కొత్త పథకాలను అందుబాటులోకి తెచ్చాయి. వీటిలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికోసం ఈ సమాచారం ఇస్తున్నాం....

ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్

ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్

ఈ సంస్థ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫిక్స్డ్ టర్మ్ ప్లాన్ - సిరీస్ ఎస్ పి (1099 రోజులు) పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఫిక్స్డ్ ఇన్ కమ్ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయాన్ని పెంచాలని ఈ పథకం ఉద్దేశంగా ఉన్నది. ఇది క్లోజ్ ఎండెడ్ పథకం. ఆదాయం కేటగిరీలో దీన్ని తెచ్చారు.

- ఫండ్ ప్రారంభమైన తేదీ : మే 23

- ఫండ్ ముగింపు తేదీ : మే 29

- ఈ పథకంలో ఎలాంటి ఎంట్రిలోడ్ ఉండదు. ఎగ్జిట్ లోడ్ కూడా ఏమిలేదు. ఈ స్కీం మెచ్యూరిటీ కన్నా ముందుగా యూనిట్ల విమోచనము/ ;పునః కొనుగోలుకు అనుమతించరు. ఒకవేళ ఇన్వెస్టర్లు ఈ పథకం నుంచి ఎగ్జిట్ కావాలనుకుంటే స్టాక్ ఎక్స్చేంజి ద్వారా ఎగ్జిట్ కావొచ్చు.

- ఈ పథకంలో కనీసం రూ . 1,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని పెంచుకుంటూ పోవచ్చు.

- సంపూర్ణ సమాచారం కోసhttps://mutualfund.adityabirlacapital.com వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

డీ ఎస్ పీ మ్యూచువల్ ఫండ్

డీ ఎస్ పీ మ్యూచువల్ ఫండ్

ఈ సంస్థ డీ ఎస్ పీ క్వాంట్ పేరుతో కొత్త స్కీం ను తెచ్చింది. ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మధ్య కాలం నుంచి దీర్ఘ కాలంలో ఇన్వెస్టర్లకు మంచి రిటర్ను లు ఇవ్వాలన్నది ఈ పథకం లక్ష్యం. సెక్టోరల్/తేమాటిక్ కేటగిరిలో వచ్చిన ఓపెన్ ఎండెడ్ స్కీం ఇది.

- ఫండ్ ప్రారంభమైన తేదీ : మే 20

- ఫండ్ ముగింపు తేదీ : జూన్ 3

- ఎంట్రిలోడ్, ఎగ్జిట్ లోడ్ లేదు. రెగ్యులర్ ప్లాన్ నుంచి డైరెక్ట్ ప్లాన్ కు మారినా, డైరెక్ట్ ప్లాన్ నుంచి రెగ్యులర్ ప్లాన్ కు మారినా ఎగ్జిట్ లోడ్ ఉండదు.

- ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ. 500

- సంపూర్ణ సమాచారం కోసం www.dspim.com వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

ఐ సి ఐ సి ఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్

ఐ సి ఐ సి ఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్

ఈ సంస్థ ఐ సి ఐ సి ఐ ప్రుడెన్షియల్ ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్ - సిరీస్ 86-1106 రోజులు ప్లాన్ డి పేరుతో ఈ పథకం తెచ్చారు. స్థిర ఆదాయ సెక్యూరిటీలు / రుణ సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్వెస్టర్ల రాబడిని పెంచాలన్నది ఈ స్కీం లక్ష్యం. ఆదాయం కేటగిరీలో వచ్చిన క్లోజ్ ఎండెడ్ పథకం ఇది.

- ఫండ్ ప్రారంభమైన తేదీ : మే 23

- ఫండ్ ముగింపు తేదీ : మే 29

- ఎంట్రిలోడ్, ఎగ్జిట్ లోడ్ లేదు. ఒకవేళ ఇన్వెస్టర్లు ఈ పథకం నుంచి ఎగ్జిట్ కావాలనుకుంటే స్టాక్ ఎక్స్చేంజి ద్వారా ఎగ్జిట్ కావొచ్చు.

- ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ. 1,000

- సంపూర్ణ సమాచారం కోసం https://mutualfund.adityabirlacapital.com వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్

ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్

ఈ సంస్థ ఇన్వెస్కో ఇండియా ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్ - సిరీస్ 34 - ప్లాన్ సీ పేరుతో ఈ స్కీం తెచ్చారు. రుణ, మనీ మార్కెట్ సాధనాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయాన్ని పెంచాలన్నది ఈ స్కీం ఉద్దేశం. ఆదాయం కేటగిరీలో వచ్చిన క్లోజ్ ఎండెడ్ స్కీం ఇది.

- ఫండ్ ప్రారంభమైన తేదీ : మే 21

- ఫండ్ ముగింపు తేదీ : మే 27

- ఎంట్రిలోడ్, ఎగ్జిట్ లోడ్ లేదు.

- ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ. 1,000

- సంపూర్ణ సమాచారం కోసం www.invescomutualfund.com వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

యూ టీ ఐ మ్యూచువల్ ఫండ్

యూ టీ ఐ మ్యూచువల్ ఫండ్

యూ టీ ఐ ఫిక్స్డ్ టర్మ్ ఇన్ కమ్ ఫండ్ XXXI-XV (1099 రోజులు) పేరుతో ఈ పథకం ప్రారంభించారు. స్థిర ఆదాయ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయం పెంచాలన్నది ఈ పథకం ఉద్దేశం. ఆదాయం కేటగిరీలో తెచ్చిన క్లోజ్ ఎండెడ్ స్కీం ఇది.

- ఫండ్ ప్రారంభమైన తేదీ : మే 20

- ఫండ్ ముగింపు తేదీ : జూన్ 3

- ఎంట్రిలోడ్, ఎగ్జిట్ లోడ్ లేదు.

- ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ. 5,000

- సంపూర్ణ సమాచారం కోసం www.utimf.com వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+