బ్యాంకుల్లో ఖాతాలు తెరిచేందుకు వెళ్లని ప్రజల కోసం బ్యాంకులే వెళుతున్నాయి. ప్రజలందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయంతో ఫినో పేమెంట్స్ బ్యాంక్సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. గల్లీ గల్లీ ఫినో అనే పేరుతో బ్యాంకింగ్ సేవలను ప్రజల వద్దకు తీసుకు వెళుతున్నామని ఫినో పేమెంట్ బ్యాంక్ విక్రయాల విభాగం అధిపతి శైలేష్ పాండే చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా ఫినో పేమెంట్ బ్యాంక్ కు సంబంధించి 400 శాఖలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
ఇందులో భాగంగా కిరాణా షాపులు ,స్టేషనరీ మార్ట్ లు, మొబైల్ రిపేర్ కేంద్రాలను బ్యాంకింగ్ పాయింట్స్ గా మార్చుకుంటోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పనులు మానుకొని బ్యాంకులకు వెళ్లలేరని, బ్యాంకింగ్ సేవల కోసం అధిక సమయాన్ని కేటాయించలేరు అని భావిస్తున్న నేపథ్యంలో వారి కోసం వారి దగ్గరికే వెళ్లి తమ బ్యాంకింగ్ సేవలు అందిస్తామని పేర్కొన్నారు. దీనికి తగ్గట్టుగా మర్చంట్ పాయింట్స్ నెట్వర్క్ ను రూపొందిస్తున్నామని , అన్ని వేళల్లో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఫినో బ్యాంక్ పేర్కొంది.

మైక్రో ఎటిఎం తరహాలో ఈ కేంద్రాల్లో సేవలు పొందవచ్చు అని, ఆధార్ ధృవీకరణతో నగదు లావాదేవీలు చేయవచ్చని సెలవురోజుల్లోనూ పనిచేస్తుందని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో 8000 మర్చంట్ పాయింట్స్ నెలకొల్పినట్లు గా పేర్కొన్నారు .కేవలం హైదరాబాద్ నగరంలోనే 900 మర్చంట్ పాయింట్స్ ఉన్నట్లుగా తెలిపారు.
More From GoodReturns

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..



Click it and Unblock the Notifications