For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ola money SBI credit cardతో ఓలా రివార్డ్స్, క్యాష్ బ్యాక్: ఏ ఖర్చుపై ఎంత లాభమంటే?

|

రైడ్ హెయిలింగ్ దిగ్గజం ఓలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భాగస్వామ్యంతో ఓలా మనీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తీసుకు వచ్చింది. దీంతో ఓలా కూడా డిజిటల్ పేమెంట్స్ రంగంలోకి ప్రవేశించింది. క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తెచ్చింది. ఎస్బీఐతో పాటు వీసా భాగస్వామ్యం కూడా ఉంది. దీనిని ఆవిష్కరించారు. ఎటువంటి ఫీజు లేకుండానే ఓలా యాప్ ద్వారా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది.

ఓలా క్రెడిట్ కార్డుతో క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్స్, లైఫ్ వ్యాలిడిటీ

2022 నాటికి ఒక కోటి ఓలా క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ప్రకటించింది. ఇంతకుముందు పేటీఎం.. సిటీబ్యాంక్‌తో కలిసి పేటీఎం ఫస్ట్ పేరుతో కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును తీసుకు వచ్చింది. ఇప్పుడు ఎస్బీఐతో కలిసి ఓలా క్రెడిట్ కార్డ్ తెచ్చింది. ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా ఎక్కువ మొత్తంలో క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్స్, లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఇస్తున్నారు. ఫ్లైట్స్, హోటల్ బుకింగ్స్ చేసుకోవచ్చు. ఎలాంటి ఛార్జీ లేకుండానే ఓలా యాప్ ద్వారా క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. వినియోగదారులకు అత్యున్నత సేవలు అందించేందుకు ఓలా సిద్ధంగా ఉందని కంపెనీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ తెలిపారు. ఇలాంటి చెల్లింపు విధానంతో ఉత్తమమైన సేవలు లభిస్తాయన్నారు.

ఏ ఖర్చుపై ఎంత శాతం క్యాష్ బ్యాక్

ఏ ఖర్చుపై ఎంత శాతం క్యాష్ బ్యాక్

కంపెనీ క్యాష్ బ్యాక్ ఉదాహరణలను షేర్ చేసింది. ఓలా క్యాబ్ స్పెండింగ్ పైన 7 శాతం, ఫ్లైట్ బుకింగ్స్ పైన 5 శాతం, డొమెస్టిక్ హోటల్ బుకింగ్స్ పైన 20 శాతం, ఇంటర్నేషనల్ హోటల్ బుకింగ్స్ పైన 6 శాతం, 6,000కు పైగా రెస్టారెంట్స్ పైన 20 శాతం క్యాష్ బ్యాక్ ఉంటుందని పేర్కొంది. అలాగే, ఇతర స్పెండింగ్స్ పైన 1 శాతం ఉంటుందని, అలాగే, ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ పైన ఒక శాతం క్యాష్ బ్యాక్ ఉంటుందని పేర్కొంది.

డిజిటల్ పేమెంట్స్

డిజిటల్ పేమెంట్స్

డిజిటల్ పేమెంట్స్ రంగం రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓలా ఈ రంగంలో ఓ స్థానం ఏర్పరుచుకునేందుకు సిద్ధమైంది. క్యాబ్ సేవల రంగం నుంచి ఓ అడుగు ముందుకేసి, ఇప్పుడు క్రెడిట్ కార్డులు తీసుకు వచ్చింది. వచ్చే మూడేళ్లలో కోటి కార్డులు ఇవ్వనుంది. 2015లో ఓలా మనీ వ్యాలెట్, 2016లో ఓలా క్రెడిట్ సదుపాయాలు ప్రవేశపెట్టారు. ఆర్థికపరమైన సేవల్లో భాగంగా వ్యాలెట్, పోస్ట్ పెయిడ్‌ బిల్లింగ్, ఓలా రైడ్స్‌కు మైక్రో ఇన్సూరెన్స్‌ తదితర సేవల్ని సమీప భవిష్యత్తులో అందించేందుకు కార్యచరణ రూపొందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

English summary

Ola money SBI credit cardతో ఓలా రివార్డ్స్, క్యాష్ బ్యాక్: ఏ ఖర్చుపై ఎంత లాభమంటే? | Ola launches Ola money SBI credit card

In a move to enrich the customer experience of millions of the homegrown ride hailing platform's users, Ola has partnered the state run SBI cards to launch Ola Money SBI Credit Card for the country's first such co branding initiative in the segment, a statement said on Wednesday.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X