For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికాతో ట్రేడ్ వార్.. తెలివైన ఆలోచన: చైనాకు ఆనంద్ మహీంద్రా సూపర్ సలహా! భారత్‌కు ప్లస్

|

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం నేపథ్యంలో మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడం డ్రాగన్ కంట్రీకి తప్పనిసరిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. అమెరికా ఆంక్షలు తప్పించుకోవాలంటే భారత్ వంటి దేశాల్లో తమ యూనిట్లను ఏర్పాటు చేసి, అక్కడి నుంచి అమెరికాకు ఎగుమతులు చేయడమే చైనా ముందు ఉన్న మార్గమన్నారు.

ఆన్‌లైన్ ద్వారా SBI అకౌంట్‌ను సులభంగా ట్రాన్స్‌ఫర్ చేయండిఆన్‌లైన్ ద్వారా SBI అకౌంట్‌ను సులభంగా ట్రాన్స్‌ఫర్ చేయండి

భారత్‌లో చైనా పెట్టుబడులు ఖాయం

భారత్‌లో చైనా పెట్టుబడులు ఖాయం

అమెరికాతో వాణిజ్యయుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో చైనా పెట్టుబడులు భారత్ వైపు మళ్లే అవకాశాలు లేకపోలేదని ఆనంద్ మహీంద్రా అన్నారు. ట్రేడ్ వార్ అంశంపై చర్చించేందుకు వచ్చే నెలలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరవు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యలకు ప్రాధాన్యత చేకూరింది. వారి భేటీ అనంతరం ఒకవేళ వివాదాస్పద అంశాలు పరిష్కారం అయినప్పటికీ అమెరికాకు భారీగా ఎగుమతులు చేసే చైనా పరిశ్రమలు కొంత హెడ్జింగ్ కోసం భారత్‌లోను అనుబంధ సంస్థలపై పెట్టుబడులు పెట్టడం, తయారీ పరిజ్ఞానాన్ని బదలాయించడం వంటివి మంచి నిర్ణయాలు అవుతాయన్నారు.

లేదంటే చైనాకే నష్టం, భారత్‌కు ఉద్యోగాలు

లేదంటే చైనాకే నష్టం, భారత్‌కు ఉద్యోగాలు

లేదంటే చైనా కంపెనీలు అమెరికా మార్కెట్లో తమ పట్టును కోల్పోతారని ఆనంద్ మహీంద్రా చెప్పారు. రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ ముగిసినా, ముందు జాగ్రత్త కోసం చైనా కంపెనీలకి ఇది (భారత్‌లో యూనిట్లు ఏర్పాటు) తప్పనిసరి అన్నారు. దీని వల్ల భారత్‌లోనూ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఈ లెక్కన భారత్‌లోకి చైనా పెట్టుబడులు వెల్లువెత్తే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. చైనా పెట్టుబడులతో భారత్‌లో అవసరమైన ఉద్యోగాల కల్పన జరిగే అవకాశముందన్నారు.

అమెరికా - చైనా ట్రేడ్ వార్

అమెరికా - చైనా ట్రేడ్ వార్

అమెరికా - చైనా మధ్య ట్రేడ్ వార్ అంతర్జాతీయస్థాయిలో కలవరం రేపుతోంది. ఓ వైపు చర్చలు అంటూనే మరోవైపు ఇరు దేశాలు టారిఫ్‌లు పెంచుతున్నాయి. చైనా నుంచి వచ్చే 200 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై ట్రంప్ 25 పన్ను వేశాడు. మరో 300 బిలియన్ డాలర్ల పన్నుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో చైనా కూడా ఓ అడుగు ముదుకేసి అమెరికాకు చెందిన 60 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై టారిఫ్ విధించింది. ఇది మరింత వేడి రాజేసింది.

English summary

అమెరికాతో ట్రేడ్ వార్.. తెలివైన ఆలోచన: చైనాకు ఆనంద్ మహీంద్రా సూపర్ సలహా! భారత్‌కు ప్లస్ | Chinese Investment in India May be Imminent: Anand Mahindra on US, China Trade War

Anand Mahindra on Wednesday said a wave of Chinese investment in India may be imminent in the wake of intensifying trade war between the US and China.
Story first published: Thursday, May 16, 2019, 10:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X