For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేటిఎం క్రెడిట్ కార్డ్ వచ్చేసిందోచ్ ! రూ. 10 వేల విలువైన సూపర్ ఆఫర్స్

By Chanakya
|

వీసాతో కలిసి ఈ మధ్యే డెబిట్ కార్డ్‌ను లాంఛ్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న పేటిఎం.. మొట్టమొదటి క్రెడిట్ కార్డును లాంఛ్ చేసింది. సిటీ బ్యాంకుతో కలిసి పేటిఎం ఫస్ట్‌తో పేరుతో కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ప్రారంభించింది. కాంటాక్ట్ అవసరం లేని (కాంటాక్ట్‌లేస్ ఎనేబుల్డ్ కార్డ్) కార్డును సిటీ బ్యాంక్.. పేటిఎం కోసం ఆఫర్ చేస్తోంది.

సూపర్ ఆఫర్స్

సూపర్ ఆఫర్స్

ఎలాంటి పరిమితులు, నిబంధనలు లేకుండా క్రెడిట్ కార్డ్ వాడకంలో ఒక్క శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ఇస్తోంది పేటిఎం. ప్రతీ నెలా నెలాఖరులో ఈ క్యాష్ బ్యాక్ మన అకౌంట్‌లో జమ అవుతుందని పేటిఎం వెల్లడించింది. ఇందుకోసం ఏడాదికి రూ.500 వార్షిక ఫీజును వసూలు చేయనుంది. అయితే ఏడాదికి రూ.50 వేలకు మించి లావాదేవీలు జరిపితే.. ఈ ఫీజును రద్దు చేస్తామని ప్రకటించింది పేటిఎం. ఇండియాతో పాటు ఇంటర్నేషనల్‌గా కూడా ఈ క్రెడిట్ కార్డును వాడుకోవచ్చు.

రూ.10వేలు ఆఫర్

రూ.10వేలు ఆఫర్

ఒక శాతం క్యాష్ బ్యాక్‌తో పాటు రూ.10 వేల విలువైన ప్రోమో కోడ్స్‌ను కూడా ఆఫర్ చేస్తోంది పేటిఎం. అయితే ఇందుకోసం కార్డ్ అందుకున్న నాలుగు నెలల్లో కనీసం ర���.10 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఈ కార్డ్‌ను సాధారణ అన్ని బ్యాంకుల వాటి మాదిరే డైనింగ్, షాపింగ్, ట్రావెల్ వంటి వివిధ అవసరాలకు వినియోగించవచ్చు. ఇక ఈఎంఐకి మార్చుకునే వెసులుబాటుకు సంబంధించిన అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఎంత లిమిట్ ఇస్తారు

ఎంత లిమిట్ ఇస్తారు

సిటీ బ్యాంకుతో కలిసి అభివృద్ధి చేసిన కొన్ని అంశాల ఆధారంగా పేటిఎం క్రెడిట్ లిమిట్‌ను నిర్ణయిస్తుంది. పేమెంట్ హిస్టరీ, గత ట్రాన్సాక్షన్స్, సిబిల్ స్కోర్ సహా అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని వీళ్లు క్రెడిట్ నెట్వర్త్‌ను నిర్ణయిస్తారు.

ఎలా అప్లై చేయొచ్చు

ఎలా అప్లై చేయొచ్చు

పేటిఎం యాప్‌లో పేటిఎం కస్టమర్లు క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫస్ట్ కార్డ్ పాస్‌బుక్‌లో ఆఫర్లకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పేటిఎం అప్‌డేట్ చేస్తుంది. సో.. ఇక ఆలస్యం చేయకుండా.. ఆఫర్లు నచ్చితే పేటిఎం ఫస్ట్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి.

English summary

పేటిఎం క్రెడిట్ కార్డ్ వచ్చేసిందోచ్ ! రూ. 10 వేల విలువైన సూపర్ ఆఫర్స్ | Paytm Credit Card Launched in Partnership With Citi

Indian digital payments major, Paytm, on Tuesday announced its foray into the credit card business with the launch of its Paytm First credit card, co-branded and issued by Citibank India.
Story first published: Wednesday, May 15, 2019, 14:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X