For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు -చేయకూడని 5 తప్పులు

By Chanakya
|

మ్యూచువల్ ఫండ్స్ ఉపయోగం ఏంటో.. భారీగా ఆస్తులను కూటబెట్టడంలో వాటి పాత్ర ఏంతో ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇప్పుడు మనలో చాలా మందికి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) గురించి మెరుగైన అవగాహనే ఉంది. ఈ నేపధ్యంలో మ్యుచువల్ ఫండ్స్ ఎంపిక సమయంలో చేయకూడని 5 తప్పులను తెలుసుకుందాం.

లక్ష్యం లేకుండా పెట్టుబడులు వద్దు

లక్ష్యం లేకుండా పెట్టుబడులు వద్దు

ప్రతీ పెట్టుబడికీ ఓ లక్ష్యమంటూ ఉండాలి. ఎందుకు పెట్టుబడి పెడ్తున్నామో.. దేనికి చేస్తున్నామో తెలియకుండా చేయడం వల్ల అది మనకు అక్కరకు రాదు. ఉదాహరణకు ఓ ఫండ్‌ను పిల్లల పై చదువు గురించి, మరొకటి అమ్మాయిపెళ్లి, లేదా మరో ఫండ్ మన రిటైర్మెంట్ గురించి అని నిర్దిష్టంగా అనుకోవాలి. అప్పుడే ప్రతీ అవసరానికీ వాటిపై కన్నుపడకుండా ఉంటుంది. దీర్ఘకాలిక, మధ్యకాలిక, సమీప భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. పెట్టుబడి పెట్టుకోవాలి. ఉదా. ఇల్లు, కార్ కొనుగోలు దీర్ఘకాలిక లక్ష్యం. ఇంటి మరమ్మత్తు, ఇంట్లో ఫర్నిచర్ మొత్తం మార్పు మధ్యకాలిక లక్ష్యమైతే... ఏదైనా ఊరికి ట్రిప్, మంచి వాచ్, ఫోన్ కొనుగోలు వంటివి సమీప భవిష్యత్ లక్ష్యాలు. ఇలా దేనికి దానికి ఓ టార్గెట్ పెట్టుకుని.. దానికి గోల్‌గా ఓ ఫండ్‌ను నిర్దేశించుకుంటే మంచిది.

టైమింగ్ చేయొద్దు

టైమింగ్ చేయొద్దు

మార్కెట్ పడినప్పుడు ఎక్కువ కొందాం. మార్కెట్ పీక్‌లో ఉన్నప్పుడు యూనిట్స్ అమ్మేసుకుందాం... అని ప్రతీ ఇన్వెస్టర్ అనుకుంటాడు. అందులో ఎలాంటి సందేహమూ లేదు. కానీ ఎంతటి టాప్ ఇన్వెస్టర్ అయినా మార్కెట్‌ను టైం చేయలేడు. అంటే తక్కువలో కొని పీక్‌లో అమ్మలేడు. మనం మ్యూచువల్ ఫండ్స్ మార్గాన్ని సంపద సృష్టి కోసం ఎంచుకున్నాం కాబట్టి ఒడిదుడుకులను పట్టించుకోకుండా పెట్టుబడులు పెడ్తూ ఉండాలి. అవసరమైనప్పుడు మార్కెట్లలో భారీ పతనం వచ్చినప్పుడు మరింత మొత్తాన్ని పెంచుకోవాలి. అలా ఓ క్రమశిక్షణతో కూడిన పెట్టబడులు అవసరం, డబ్బు ఉన్నప్పుడు ఎక్కువగా కుమ్మరించడం, అవసరమైనప్పుడు విత్ డ్రా చేసుకోవడం సరైంది కాదు.

థిమాటిక్ ఫండ్స్‌కు సమయం ఇవ్వండి

థిమాటిక్ ఫండ్స్‌కు సమయం ఇవ్వండి

థిమాటిక్ ఫండ్స్ అంటే.. నిర్దిష్టంగా ఒక్క రంగానికి మాత్రమే పరిమితమైన ఫండ్. ఉదా. బ్యాంకింగ్, ఫార్మా, ఐటీ వంటివి. సాధారణంగా ఇలాంటి థీమ్స్ భారీగా రిటర్న్స్ ఇవ్వడమే కాకుండా నష్టాలను కూడా అదే స్థాయిలో ఇస్తాయి. ఎందుకంటే ప్రతీ రంగానికీ ఓ సైకిల్ అంటూ ఉంటుంది. అలాంటి సైకిల్‌ను మనం అంత ఈజీగా పట్టుకోలేం. ఒకసారి ఐటి మంచి బూమ్‌లో ఉంటే, మరోసారి బ్యాంకింగ్ థీమ్ ఆకర్షణీయంగా ఉటుంది. అందుకే అప్ సైకిల్, డౌన్ సైకిల్‌లో మనం ఉంటే.. రిస్క్ యావరేజ్ అవుతుంది. కనీసం ఏడెనిమిదేళ్ల పెట్టుబడి లక్ష్యం ఉన్నప్పుడే ఇలాంటి సెక్టోరల్, థిమాటిక్ ఫండ్స్ పిక్ చేసుకోండి.

ఎక్కువ ఫండ్స్ వద్దు, పోర్ట్‌ఫోలియో డిజైన్ చేసుకోండి

ఎక్కువ ఫండ్స్ వద్దు, పోర్ట్‌ఫోలియో డిజైన్ చేసుకోండి

కొంత మంది తెలిసో, తెలియకో.. లేక మరో కారణం వల్లే ఏకంగా 15-20 ఫండ్స్‌ను ఎంపిక చేసుకుని పెట్టుబడులు పెడ్తూ ఉంటారు. వాస్తవానికి ఏ పోర్ట్‌ఫోలియోలో అయినా పదికి మంచి ఫండ్స్ ఉండకపోవడం మంచిది. ఎందుకంటే అంత డైవర్సిఫికేషన్ ఉండడం వల్ల మనంవాటి పనితీరును అంచనా వేయడానికి కష్టపడాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకూ ఏడెనిమిది ఫండ్స్‌ను పోర్ట్‌ఫోలియోలో ఉంచుకోవాలి. బ్లూచిప్స్, మిడ్ క్యాప్స్, థిమాటిక్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్‌ కలయికతో పోర్ట్‌ఫోలియో రూపొందించుకోవడం రిస్క్ తగ్గుతుంది.

ఫండ్ మేనేజర్‌పైనా కన్నేయండి

ఫండ్ మేనేజర్‌పైనా కన్నేయండి

మనం సాధారణంగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని నమ్మి పెట్టుబడి పెడ్తాం. కానీ మనం ఎంపిక చేసుకున్న ఫండ్, దాన్ని నిర్వహించే ఫండ్ మేనేజర్ సామర్థ్యాన్ని కూడా బేరీజు వేసుకోవాలి. దూకుడుగా ఉన్నారా, గతంలో నిర్వహించిన ఫండ్స్ పనితీరు ఎలా ఉంది అనే అంశాన్ని కూడా చూసుకోవాలి. స్థిరంగా లాభాలను అందిస్తున్నారా లేదా చూడాలి. అప్పుడే నిర్ణయాలను తీసుకోవాలి. ఒక వేళ మన పెట్టుబడి స్టైల్‌కు సరిపోలేదనిపిస్తే ఫండ్ మారడం తప్పేంలేదు.

చివరగా డబ్బు మనది, కష్టం మనది, సంపాదన అవసరం మనకి. అందుకే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి అయినా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఓ భాగం మాత్రమే. ఇది తొలి అడుగే.

ఈ ఆర్టికల్ నచ్చితే మరింత మంది షేర్ చేయండి, వారి భవిష్యత్‌లో ఆర్థికంగా మరింత నిలదొక్కుకునేందుకు సహాయం చేసిన వారవుతారు.

English summary

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు -చేయకూడని 5 తప్పులు | Avoid these 5 common mistakes before investing in mutual funds

Avoid these 5 common mistakes before investing in mutual funds. One should bear in a mind that it is one of the part in financial planning and it is not entire planning.
Story first published: Wednesday, May 15, 2019, 15:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X