For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగస్తులకు అమెజాన్ బంపర్ ఆఫర్: రాజీనామా చేస్తేనే ఇది వర్తిస్తుంది..ఏమిటి ఆ ఆఫర్..?

|

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది. ప్రస్తుతం కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తే వారితో ప్రత్యేకంగా వ్యాపారం పెట్టిస్తామంటూ భరోసా ఇచ్చింది. అదికూడా అమెజాన్‌ ఆన్‌లైన్ షాపింగ్‌ ద్వారా కస్టమర్లు ఆర్డరు ఇచ్చి వస్తువులను డోర్ డెలివరీ చేయాలని సూచించింది. సోమవారం చేసిన ఈ ప్రకటన కొంతమంది ఉద్యోగులకు చాలా బాగా నచ్చింది.

ఉద్యోగస్తులకు అమెజాన్ ఆఫర్

ఉద్యోగస్తులకు అమెజాన్ ఆఫర్

అమెజాన్ వస్తువులను డోర్‌ డెలివరీ చేయడం రెండు రోజుల సమయం పడుతోంది. ఆ కంపెనీ కొత్తగా తమ ఉద్యోగులకు ప్రకటించిన ఆఫర్‌ ద్వారా వస్తువును ఒక్కరోజులోనే డోర్ డెలివరి అయ్యేలా చూస్తుంది. ఇటు కంపెనీకి అటు ఉద్యోగస్తులకు ఈ ఆఫర్ లాభిస్తుందని సంస్థ అభిప్రాయపడింది. డోర్‌డెలివరీ చేసేవారికి అదనంగా ఇన్సెంటివ్స్ ఇవ్వాలని కంపెనీ భావిస్తోంది. ఇలాంటి ప్రోత్సహాకాలు ఇస్తే వస్తువు కూడా త్వరతగతిన డెలివర్ అవుతుందని కంపెనీ యాజమాన్యం చెబుతోంది.

 స్టార్టప్ కంపెనీలకు 10వేల డాలర్లు సహాయం

స్టార్టప్ కంపెనీలకు 10వేల డాలర్లు సహాయం

ఇక కంపెనీ ప్రకటించిన ఆఫర్‌కు ఒప్పుకుని రాజీనామా చేసిన ఉద్యోగులతో స్టార్టప్ కంపెనీలను ప్రారంభిస్తుంది. వారికి అయ్యే ఖర్చుల్లో దాదాపు 10వేల అమెరికన్ డాలర్లను తామే భరిస్తామంటోంది అమెజాన్ యాజమాన్యం. అంతేకాదు ముందస్తుగా మూడు నెలల జీతాలు చెల్లిస్తామని కూడా హామీ ఇచ్చింది. ఇది అమెజాన్ సంస్థలో పనిచేస్తున్న పార్ట్‌టైమ్, ఫుల్ టైమ్ ఉద్యోగస్తులకు వర్తిస్తుందని వారితో పాటు గోదాముల్లో పనిచేసేవారికి కూడా వర్తిస్తుందని ఓ ప్రకటనలో అమెజాన్ సంస్థ వెల్లడించింది. అయితే ఎంతమంది ఉద్యోగస్తులను ఈ స్టార్టప్ కంపెనీలకు వినియోగించుకుంటుందనే దానిపై అమెజాన్ సంస్థ స్పష్టత ఇవ్వలేదు.

సొంతంగా డెలివరీ చేయాలనే ఆలోచనతోనే...

సొంతంగా డెలివరీ చేయాలనే ఆలోచనతోనే...

ఇలాంటి ప్రోత్సహాలకు అమెజాన్ సంస్థలో గతేడాదే బీజం పడింది. ఎవరైనా సరే స్వతంత్రంగా అమెజాన్ డెలివరీ బిజినెస్ ప్రారంభించాలనుకుంటే వారు దరఖాస్తు చేసుకోవచ్చని అమెజాన్ సంస్థ పేర్కొంది. ఇతర సంస్థల ద్వారా అంటే కొరియర్లు, పోస్టాఫీసుల ద్వారా డెలివరీ చేయడం కంటే సొంతంగా డెలివరీ చేసి ఖర్చులు కూడా తగ్గించుకోవాలని భావిస్తోంది యాజమాన్యం. ఇక స్టార్టప్ కంపెనీ ప్రారంభించాలనుకునే వారికి నీలం రంగు వ్యానులను లీజుకు కూడా ఇస్తామని అమెజాన్ సంస్థ తెలిపింది. దానిపై అమెజాన్ లోగో ఉంటుందని వివరించింది.

ఇప్పటి వరకు 200 అమెజాన్ డెలివరీ బిజినెస్ సెంటర్లు ఏర్పాటు

ఇప్పటి వరకు 200 అమెజాన్ డెలివరీ బిజినెస్ సెంటర్లు ఏర్పాటు

గతేడాది జూన్‌లో ఈ తరహా ప్రణాళికను అమలు చేయడంతో ఇప్పటి వరకు 200 అమెజాన్ డెలివరీ బిజినెస్ సెంటర్లు ఏర్పాటు అయ్యాయని అమెజాన్ గ్లోబల్ డెలివరీ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ జాన్ ఫెల్టన్ తెలిపారు. ఎనిమిది నెలల క్రితం మిల్టన్ కొలీర్ అనే వ్యక్తి అమెజాన్ డెలివరీ బిజినెస్ సెంటర్‌ను అట్లాంటాలో ఏర్పాటు చేశాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సంస్థలో 120 మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. ఇందులో 50 వ్యానులు అమెజాన్ వస్తువులను డెలివరీ చేసేందుకున్నాయి. ఒక్క రోజులో 200 డెలివరీలు చేస్తున్నాయి. ఇకొంత మంది ఉద్యోగస్తులను తీసుకుని డెలివరీని వేగవంతం చేసే యోచనలో ఉన్నారు కొలియర్.

English summary

ఉద్యోగస్తులకు అమెజాన్ బంపర్ ఆఫర్: రాజీనామా చేస్తేనే ఇది వర్తిస్తుంది..ఏమిటి ఆ ఆఫర్..? | Amazon offer to its employees,asks them to resign and will help in new business

Amazon company gave its employees a bumper offer where it asked them to resign and start a new delivery business centre. Amazon has also promised them that it would give them USD 1000 for the setting up of new startups.
Story first published: Monday, May 13, 2019, 18:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X