For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI సేవింగ్స్ అకౌంట్ ఉందా?: రూల్స్ మారాయి.. ఇక నుంచి మీ వడ్డీ తగ్గనుంది!

|

నేటి నుంచి (మే 1వ తేదీ) ఎస్బీఐ కొన్ని రూల్స్ మారుతున్నాయి. ఎస్బీఐ వడ్డీని రెపో రేటుకు అనుసంధానం చేస్తోంది. అధిక డిపాజిట్ కలిగిన సేవింగ్స్ ఖాతాలు, స్వల్పకాలిక రుణాల వడ్డీ రేట్లను ఆర్బీఐ రెపో రేటుతో లింక్ చేయనున్నట్లు మార్చిలో ఎస్బీఐ ప్రకటన చేసింది. రెపో రేటు ప్రయోజనాల్ని కస్టమర్లకు అందించేందుకు లింక్ చేస్తోంది. డిపాజిట్లపై వడ్డీ తగ్గనుంది. ఈ రోజు నుంచి ఇది అమలుల్లోకి వస్తోంది. గత మూడు నెలల్లో ఆర్బీఐ రెపో రేటును 6.5 నుంచి 6 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే.

SBI నుంచి కనీసం ఒక నెల శాలరీ ఇప్పించండిSBI నుంచి కనీసం ఒక నెల శాలరీ ఇప్పించండి

రూ.లక్ష వరకు 3.5 శాతం, లక్ష మించితే రూ.3.25 శాతం

రూ.లక్ష వరకు 3.5 శాతం, లక్ష మించితే రూ.3.25 శాతం

సేవింగ్స్ అకౌంట్లో రూ.లక్షకు మించి ఉన్న నగదుపై వడ్డీ రేటు తగ్గనుంది. ప్రస్తుతం సేవింగ్స్ ఖాతాలో రూ.కోటి వరకు ఉన్న నగదు నిల్వలపై రూ.3.5 శాతం వడ్డీ రేటు ఉంది. రూ.కోటికి మించితే 4 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. ఇకపై రూ.లక్ష లోపు నగదుకు 3.5 శాతం వడ్డీ చెల్లిస్తారు. రూ.లక్షకు మించిన నగదుపై మాత్రం 3.25 శాతం వడ్డీ రానుంది. ఎక్కువ అకౌంట్లలో రూ.కోటి లోపు మాత్రమే నగదు నిల్వలు ఉంటాయి. ఆర్బీఐ రెపో రేటు తగ్గించడంతో ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. వడ్డీని ప్రతి త్రైమాసికం చివరలో చెల్లిస్తారు.

95 శాతం మంది వీరే

95 శాతం మంది వీరే

రెపో రేటు తగ్గడంతో నిల్వలపై వచ్చే ఆదాయం కాస్త తగ్గనుంది. రెపో రేటు మరింత తగ్గితే వడ్డీ ఆదాయం కూడా మరింత తగ్గుతుంది. రెపో రేటు పెరిగితే వడ్డీ ఆదాయం పెరుగుతుంది. ఎస్బీఐ పొదుపు ఖాతాదారుల్లో 95 శాతం మంది రూ.లక్ష లోపు డిపాజిట్ కలిగిన వారే. కాబట్టి దీని ప్రభావం కొద్దిమంది పైనే ఉండనుందని అంటున్నారు.

రుణాలు

రుణాలు

కొత్త రూల్స్ ప్రకారం ఎస్బీఐ రూ.లక్షకు పైగా క్యాష్‌ క్రెడిట్‌ ఖాతాలు, ఓవర్ డ్రాఫ్ట్‌ (ఓడీ)లపై వసూలు చేసే వడ్డీ రేట్లను రెపోతో లింక్ చేసింది. వీటిపై రెపో కంటే 2.25 శాతం అధిక వడ్డీ వసూలు చేయనుంది. అంటే ఈ సేవలు పొందేవారు బ్యాంక్‌‌కు 8.25 శాతం వార్షిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

ఈ తరహా రుణాలపై 8.25 శాతం ఫ్లోర్‌ రేటుకు అదనంగా కస్టమర్ రిస్క్ ప్రొఫైల్‌ ఆధారంగా ప్రీమియం సైతం వసూలు చేయనున్నట్లు బ్యాంక్‌ వెల్లడించింది. గత నెల 9న రుణాలపై నిధుల ఎంసీఎల్ఆర్‌ను 0.05 శాతం తగ్గించింది.

English summary

SBI సేవింగ్స్ అకౌంట్ ఉందా?: రూల్స్ మారాయి.. ఇక నుంచి మీ వడ్డీ తగ్గనుంది! | SBI Savings Bank Account Holders With Rs 1 Lakh Plus Balance To Earn Lesser Interest From Today

From May 1, India's largest bank State Bank of India (SBI) will move to a new interest rate regime on large savings account deposits as well as short-term loans. In March, SBI had announced that it will link its interest rate on savings account with balance above ₹1 lakh and short term loans like overdraft and cash credit facility to Reserve Bank of India's (RBI) repo rate, effective 1 May 2019.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X