For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జెట్ ఎయిర్‌వేస్ ఎఫెక్ట్: ప్రపంచ టాప్ 10 సంస్థల్లో ఇండిగో, స్పైస్‌జెట్‌కు అదే ప్లస్

|

జెట్ ఎయిర్వేస్ ఆర్థిక సంక్షోభం స్పైస్ జెట్, ఇండిగో డిమాండ్ పెరగడానికి దోహదపడింది. స్టాక్ మార్కెట్లలో కూడా జెట్ షేర్లు బాగా పడిపోతే, పై రెండు విమానయాన సంస్థల షేర్లు భారీగా పెరిగాయి. గురువారం బీఎస్ఈలో ఇండిగో, స్పైస్ జెట్ షేర్లు వరుసగా 1.39 శాతం, 4.16 శాతం పెరిగాయి. జెట్ షేర్లు ఏప్రిల్ 17వ తేదీ నుంచి 30 శాతం పడిపోయాయి. ఏడాది ప్రారంభం నుంచి జెట్ ఇన్వెస్టర్లు రూ.700 కోట్ల వరకు నష్టపోతే, స్పైస్ జెట్ 43 శాతం, ఇండిగో 27 శాతం పెరిగింది. మొత్తంగా జెట్ కష్టాలు ఇతర విమానయాన సంస్థలకు కలిసి వస్తోంది. ఇండిగో, స్పైస్ జెట్ షేర్లు బాగా పెరిగాయి.

1,000మంది ఉద్యోగులు వచ్చారు, మరింత మంది వస్తారు: జెట్‌పై స్పైస్ జెట్ చైర్మన్1,000మంది ఉద్యోగులు వచ్చారు, మరింత మంది వస్తారు: జెట్‌పై స్పైస్ జెట్ చైర్మన్

 జెట్ ఎఫెక్ట్: ప్రపంచ టాప్ 10లో ఇండిగో, దేశీయంగా దూసుకెళ్తున్న స్పైస్

జెట్ ఎఫెక్ట్: ప్రపంచ టాప్ 10లో ఇండిగో, దేశీయంగా దూసుకెళ్తున్న స్పైస్

గత ఆరు నెలల కాలంలో ఇండిగో, స్పైస్ జెట్ వరుసగా 80 శాతం, 77 శాతం చొప్పున దూసుకెళ్లాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విమానయాన షేర్లుగా నిలిచాయి. జెట్‌ సిబ్బందిని తక్కువ వేతనాలకు తీసుకుంటున్నాయి. జెట్‌ వదిలేసిన మార్కెట్‌ వాటాను అందిపుచ్చుకున్నాయి. ఇండిగో అయితే 8.1 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువతో ప్రపంచ టాప్ టెన్ విమానయాన సంస్థల లిస్టులో చేరింది. దేశీయ మార్గాల్లో విమానాల సంఖ్యను స్పైస్‌జెట్‌ పెంచుకుంది. ఈ ప్రయోజనాలు ఈ కంపెనీ షేర్లపై కనిపిస్తున్నాయి. ఏటా 50 వరకు విమానాలు మనం దేశంలో యాడ్ అవుతూ ప్రయాణీకుల అవసరాలను తీరుస్తున్నాయి. జెట్ విమానాలు ఆగిపోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండిగో, స్పైస్‌జెట్‌లు 100 వరకు విమానాలను చేర్చుకోనున్నాయి.

 జెట్ తరహా విమానాలు నడపడం స్పైస్ జెట్‌కు ప్లస్

జెట్ తరహా విమానాలు నడపడం స్పైస్ జెట్‌కు ప్లస్

ఒక్కో సీటుకు కిలో మీటరుకు వచ్చే ఆదాయం 20 నుంచి 60 శాతం పెరగనుందని, అది కూడా ఇండిగో, స్పైస్ జెట్‌కే పెరగనుందని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది ఇది 15-20 శాతంగా ఉంది. ఒక వేళ జెట్‌ వేరే వారి చేతికి వెళ్లినా, మళ్లీ పునరుద్ధరణకు రెండు-మూడేళ్ల సమయం తీసుకుంటుందని, ఇప్పుడు మాత్రం ఇండిగో, స్పైస్‌జెట్ షేర్లు 30-50 శాతం వరకు పెరగుతాయని అంటున్నారు. ఇండిగో షేర్ ధర లక్ష్యాన్ని రూ.1650 నుంచి రూ.1800కు క్రెడిట్‌ సూయిజీ పెంచింది. జెట్ తరహా బోయింగ్‌ 737-800 విమానాలు రన్ చేస్తుండటం స్పైస్ జెట్‌కు బాగా కలిసి వచ్చిందని చెబుతున్నారు. జెట్‌ పైలట్లు, గ్రౌండ్ హ్యాండ్లింగ్‌ సిబ్బందిని తమ స్థాయి వేతనాలకే నియమించుకుంటోంది. లీజుదార్ల నుంచి 22 బోయింగ్‌ విమానాలను సిబ్బంది ప్రమేయం లేకుండా స్పైస్‌జెట్‌ తీసుకుంది. ఈ విమానాలన్నీ విమాన యజమానులు జెట్ నుంచి వెనక్కి తీసుకున్నవి. జెట్ మార్గాల్లోనే ఆ విమానాలను నడపనుంది.

గత ఆరు నెలల్లో అత్యధిక లాభంలో షేర్లు

గత ఆరు నెలల్లో అత్యధిక లాభంలో షేర్లు

గత ఆరు నెలల కాలాన్ని పరిగణలోకి తీసుకుంటే ఎక్కువగా స్పైస్ జెట్, ఇండిగో షేర్లు పెరిగాయి. ప్రపంచంలోని ఖరీదైన విమానయాన షేర్లలో ఇవి టాప్‌లో నిలిచాయి. స్పైస్ జెట్ 76.45 శాతం, ఇండిగో 80.30 శాతంలు ఉన్నాయి. ఆ తర్వాత వర్జిన్ ఆస్ట్రేలియా (ఆస్ట్రేలియా), ఏషియానా ఎయిర్ లైన్స్ (దక్షిణ కొరియా), స్ప్రింగ్ ఎయిర్ లైన్స్ (చైనా), లాతమ్ ఎయిర్ లైన్స్ (చిలీ), చైనా ఎయిర్ లైన్స్ (తైవాన్), ఎయిర్ ైచనా (చైనా), జునేమాయో ఎయిర్ (చైనా), కోపా హోల్డింగ్స్ (పనామా)లు ఉన్నాయి. ఇందులో స్పైస్ జెట్, ఇండిగో షేర్ల దరిదాపుల్లో కేవలం ఏషియానా ఎయిర్ లైన్స్ మాత్రమే ఉంది.

English summary

జెట్ ఎయిర్‌వేస్ ఎఫెక్ట్: ప్రపంచ టాప్ 10 సంస్థల్లో ఇండిగో, స్పైస్‌జెట్‌కు అదే ప్లస్ | One chart shows how Jet’s loss is IndiGo, SpiceJet’s gain

The two budget carriers are India’s only other listed aviation stocks, and investors have rushed to lap up their shares on the bourses. On Thursday, the stock of InterGlobe Aviation, which operates IndiGo, and SpiceJet rose 1.39% and 4.16%, respectively on BSE.
Story first published: Friday, April 26, 2019, 11:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X