For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జెట్ ఎయిర్వేస్‌లో వాటాను కొనుగోలు చేయనున్న ముఖేష్ అంబానీ?

|

జెట్ ఎయిర్‌వేస్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. మూడ్రోజుల క్రితం ఈ సంస్థ తమ విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేసింది. జెట్‌కు రుణాలు ఇచ్చిన ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకర్ల కన్సార్టియం ఈ సంస్ధను బయటపడేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం నరేష్ గోయల్‌ను తప్పించింది. కొత్త సంస్థ కోసం బిడ్స్‌ను ఆహ్వానించింది. మే 10వ తేదీన బిడ్ ఎవరిని వరించనుందో తేలనుంది.

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కూడా జెట్ ఎయిర్వేస్ పైన కన్నేసిందని వార్తలు వస్తున్నాయి. జెట్‌లో వాటాను కొనుగోలు చేసేందుకు ముఖేష్ ప్లాన్ చేస్తున్నారట. జెట్ ఎయిర్వేస్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్స్‌ప్రెషన్ అఫ్ ఇంటరెస్ట్ (ఈవోఐ) సమర్పించలేదని, కానీ బిడ్ దాఖలు చేసిన ఎతిహాద్ ఎయిర్వేస్‌లో చేరవచ్చునని అంటున్నారు. ఎతిహాద్ ఎయిర్వేస్ యూఏఈకి చెందిన ఎయిర్ లైన్స్. ఇప్పటికే ఇది ఎక్స్‌ప్రెషన్ అఫ్ ఇంటరెస్ట్ (ఈవోఐ) సమర్పించింది. ఈ బిడ్‌లో రిలయన్స్ వాటా తీసుకోవచ్చునని అంటున్నారు.

1లక్ష కోట్ల రెవెన్యూతో రిలయన్స్ రిటైల్ టాప్: ముఖేష్ ఆర్ఐఎల్ 5 మైండ్ బ్లోయింగ్ లెక్కలు1లక్ష కోట్ల రెవెన్యూతో రిలయన్స్ రిటైల్ టాప్: ముఖేష్ ఆర్ఐఎల్ 5 మైండ్ బ్లోయింగ్ లెక్కలు

Reliance Industries chairman Mukesh Ambani may buy stake in Jet Airways

ఎఫ్‌డీఐ రూల్స్ ప్రకారం జెట్ ఎయిర్వేస్‌లో ఎతిహాద్ ఎయిర్ లైన్స్ వాటా 49 శాతం వరకు మాత్రమే ఉండాలి. ఆ తర్వాత ప్రభుత్వం అనుమతులు ఉండాలి. ఇప్పటికే ఎతిహాద్‌కు 24 శాతం వాటా ఉంది. ఈ నేపథ్యంలో ఎతిహాద్‌తో రిలయన్స్ కలవవచ్చునని భావిస్తున్నారు. మరోవైపు, దీనిపై సూటిగా స్పందించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికార ప్రతినిధి నిరాకరించరట. కాగా, బిజినెస్‌లో దూసుకుపోతున్న ముఖేష్.. జెట్‌లో వాటాను కొనుగోలు చేస్తే ఉద్యోగులు కూడా ఆనందించే అవకాశముంది. ఎందుకంటే దీనిని గట్టెక్కిస్తారనే అంచనాలు చాలామందికి ఉంటాయి.

ప్రధానికి విజ్ఞప్తి

జెట్ ఎయిర్వేస్‌ను కేంద్ర ప్రభుత్వం టేకోవర్ చేయాలని బ్యాంకింగ్ యూనియన్లు ప్రధాని నరేంద్ర మోడీని కోరాయి. సంస్థలో పని చేస్తున్న వేలాదిమంది రోడ్డున పడకుండా కేంద్రం జోక్యం చేసుకోవాలని ప్రధానికి రాసిన లేఖలో ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కోరింది. మరిన్ని రుణాలు ఇవ్వాలని బ్యాంకులపై ఒత్తిడి తెవొద్దని, దీనిని టేకోవర్ చేయడమే ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయమన్నారు.

English summary

జెట్ ఎయిర్వేస్‌లో వాటాను కొనుగోలు చేయనున్న ముఖేష్ అంబానీ? | Reliance Industries chairman Mukesh Ambani may buy stake in Jet Airways

After disrupting the telecom sector in recent times, Mukesh Ambani led Reliance industries is now planning to buy a stake in the embattled Jet Airways.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X