For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇక పిల్లల బొమ్మల మార్కెట్లోకి రిలయన్స్ !

By Chanakya
|

రిలయన్స్ రిటైల్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకు సిద్దమవుతోంది. సుమారు 260 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిటిష్ సంస్థ హామ్లీస్‌ను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ రిటైల్ సంస్థ పావులు కదుపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన హామ్లెస్‌కు చిన్న పిల్లల బొమ్మల మార్కెట్‌పై అమితమైన పట్టు ఉంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ సంస్థను చేజిక్కించుకునేందుకు రిలయన్స్ రిటైల్ సీరియస్‌గా ప్రయత్నాలు ప్రారంభించింది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే త్వరలో ఆర్థిక ఫలితాల ప్రకటన ఉన్న నేపధ్యంలో సంస్థకు ఇది సైలెన్స్ పీరియడ్. అందుకే త్వరలో ఈ ప్రకటన రావొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

హామ్లీస్ ప్రత్యేకత ఏంటి

1760లో లండన్‌లో నోవాస్‌గా మొదలైన సంస్థ ఆ తర్వాత కాలక్రమంలో హామ్లీస్‌గా మారింది. ఈ కంపెనీ తయారు చేసే బొమ్మలకు సౌదీ అరేబియాకి చెందిన రాజ కుటుంబీకులు కూడా ఎంతోకాలం నుంచి కస్టమర్లుగా ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో బ్రెగ్జిట్ సమస్యలతో హామ్లీస్ కూడా ఇబ్బంది పడ్తోంది. 2017లో ఏకంగా 12 మిలియన్ పౌండ్ల నష్టాన్ని(రూ.108 కోట్లు) సంస్థ ప్రకటించింది. ఆదాయంలో కూడా 2.5 శాతం క్షీణత నమోదైంది. గతేడాది హామ్లీస్ ఆదాయం 66.3 మిలియన్ పౌండ్లు(సుమారు రూ.600 కోట్లు). అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 11 బిలియన్ డాలర్ల బొమ్మల మార్కెట్లో హామ్లీస్‌ది ప్రత్యేక స్థానం. అయితే ఇక్కడ ఓ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇప్పటికే ఈ సంస్థ ముగ్గురి చేతులు మారి ఎదుగుతూ వచ్చింది.

Reliance Retail in talks to buy out 259 year old British toymaker Hamleys

రిలయన్స్‌కు కలిసొస్తుందా

రిలయన్స్ రిటైల్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు ఈ కొనుగోలు దోహదపడొచ్చు. వాళ్ల సప్లై చైన్ మేనేజ్మెంట్, పటిష్ట డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా కలిసొస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 129 స్టోర్లు ఉన్నాయి. వాటిల్లో అధిక శాతం ఫ్రాంచైజీ మోడల్‌. యూకె, చైనా, జర్మనీ, చైనా, ఇండియా, సౌత్ ఆఫ్రికా సహా మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో ఈ స్టోర్స్ ఉన్నాయి. ఇలాంటి అక్విజిషన్స్ చేయడంతో పాటు మరింత వేగంగా ఇకపై రిలయన్స్ రిటైల్ ను అభివృద్ధి చేసేందుకు రిలయన్స్ సంస్థ ఉవ్విళ్లూరుతోంది. అందుకు తగ్గట్టే అనేక ప్రయత్నాలను చేపడ్తోంది. ఇంతకాలం జియోపై దృష్టి పెట్టిన ముకేష్ అంబానీ ఇకపై రిటైల్ పై ఫోకస్ ను పెంచబోతున్నారు.

English summary

ఇక పిల్లల బొమ్మల మార్కెట్లోకి రిలయన్స్ ! | Reliance Retail in talks to buy out 259 year old British toymaker Hamleys

Reliance Retail in talks to buy out 259-year-old British toymaker Hamleys Due diligence for the deal is said to be in advanced stages. If the deal goes through, Reliance Retail plans to increase the geographic footprint of Hamleys in India.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X