For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మళ్లీ లాభాల్లో ముగింపు, మిడ్, స్మాల్ క్యాప్స్‌లో మానియా రన్

By Chanakya
|

స్టాక్ మార్కెట్ మళ్లీ లాభాల్లో ముగిసింది. మిడ్ సెషన్ తర్వాత వచ్చిన కొనుగోళ్ల మద్దతుతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో లాభాల జోరు మొదలైంది. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ చప్పగానే సూచీలు ఆఖర్లో బాగా కోలుకున్నాయి. నిఫ్టీ ఇంట్రాడే కనిష్ట స్థాయి నుంచి ఏకంగా 70 పాయింట్లు పెరిగింది. ఆఖర్లో కొద్దిగా తడబడినా లాభాల్లోనే క్లోజైంది. చివరకు 47 పాయింట్ల లాభంతో 11643 దగ్గర నిఫ్టీ ముగిసింది. సెన్సెక్స్ 160 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 152 పాయింట్లు పెరిగింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. వీక్లీ బేసిస్ పరంగా చూస్తే.. వరుస లాభాలకు ఈ వారం బ్రేక్ పడింది.

<strong>జెట్ ఎయిర్‌వేస్‌లో సరికొత్త ట్విస్ట్: నరేష్ గోయల్ బిడ్ సమర్పించే ఛాన్స్</strong>జెట్ ఎయిర్‌వేస్‌లో సరికొత్త ట్విస్ట్: నరేష్ గోయల్ బిడ్ సమర్పించే ఛాన్స్

గెయిల్, ఐటీసీ, మారుతి సుజుకి, సిప్లా టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. ఇండియాబుల్స్ హౌసింగ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్, భారతి ఎయిర్టెల్, ఎల్ అండ్ టి స్టాక్స్ లూజర్స్ జాబితాలో చేరాయి.

SpiceJet soars 9% as airline looks to add 16 aircrafts to its fleet

పిజి జ్యువెలర్స్ మెరుపులు

పిసి జ్యువెలర్స్‌లో అనూహ్యమైన కొనుగోళ్ల మద్దతు కనిపించింది. స్టాక్ తొమ్మిది నెలల గరిష్ట స్థాయికి చేరింది. 17 లక్షల షేర్లు బ్లాక్ డీల్ ద్వారా చేతులు మారడంతో స్టాక్ బాగా పెరిగింది. ఎవరు స్టాక్ కొన్నారు అనే అంశంపై ఇంకా క్లారిటీ రానప్పటికీ స్టాక్ ఈ రోజు 17 శాతానికిపైగా లాభపడింది. చివరకు రూ.112 దగ్గర ముగిసింది. 20 రోజుల యావరేజ్‌తో పోలిస్తే ట్రేడింగ్ వాల్యూమ్ రెట్టింపైంది.

ఇన్ఫీ రిజల్ట్స్

ఈ రోజు ఇన్ఫోసిస్ రిజల్ట్స్ నేపధ్యంలో స్టాక్ ఫ్లాట్‌గానే ముగిసింది. రెవెన్యూ, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని నిపుణులు అంచనా కడ్తున్నారు. చివరకు స్టాక్ 0.63 శాతం లాభాలతో రూ.748 దగ్గర క్లోజైంది.

రుచి సోయా.. రుచులు

రుచి సోయాకు సంబంధించిన 50 లక్షల షేర్లు బ్లాక్ డీల్ ద్వారా ఈ రోజులు చేతులు మారాయి. ట్రేడింగ్ వాల్యూమ్ కూడా సుమారు 9 రెట్లు పెరిగింది. ఈ సంస్థను పతంజలి కొనుగోలు చేయడానికి మెల్లిగా లైన్ క్లియర్ అవుతున్నట్టు తెలుస్తోంది. కమిటీ ఆఫ్ క్రెడిటర్స్‌తో పతంజలి సంస్థ చర్చలు తుది అంకానికి చేరినట్టు సమాచారం. ఈ వార్త బయటకు పొక్కినప్పటి నుంచి స్టాక్ లాభాల్లో తేలియాడుతోంది. ఈ రోజు కూడా స్టాక్ 5 శాతం లాభాలతో రూ.7.34 దగ్గర క్లోజైంది.

స్పైస్ జెట్ స్పైసీ జంప్

విమానయాన సంస్థ స్పైస్ జెట్ షేర్లు వరుసగా రెండో రోజు కూడా పెరిగాయి. 16 కొత్త బోయింగ్‌ విమానాలను డ్రై లీజ్‌కు తీసుకుని తమ ఫ్లీట్‌లో చేర్చబోతున్నట్టు స్పైస్ జెట్ వెల్లడించింది. దీంతో ఈ స్టాక్ 9 శాతం పెరిగి రూ.110 దగ్గర క్లోజైంది.

రెయిన్ ఇండస్ట్రీస్ లాభాల వాన

రెయిన్ ఇండస్ట్రీస్ షేర్ అనూహ్యమైన, ఆశ్చర్యకరమైన లాభాలను నమోదు చేసింది. గత కొద్దికాలం నుంచి నీరసంగా ఉన్న స్టాక్ ఈ రోజు ఏకంగా 20 శాతం లాభపడింది. ట్రేడింగ్ వాల్యూమ్ కూడా 9 రెట్లు పెరిగింది. చివరకు స్టాక్ రూ.132 దగ్గర క్లోజైంది.

English summary

మళ్లీ లాభాల్లో ముగింపు, మిడ్, స్మాల్ క్యాప్స్‌లో మానియా రన్ | SpiceJet soars 9% as airline looks to add 16 aircrafts to its fleet

Shares of SpiceJet surged over 9 per cent in Friday's session after the company announced it will induct new aircraft in its fleet. As per a BSE filing, the company will induct 16 Boeing 737-800 NG aircraft on dry lease in the next ten days after regulatory approvals.
Story first published: Friday, April 12, 2019, 17:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X