For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్ల్ ఫ్రెండ్‌తో అమెజాన్ సీఈవో సీక్రెట్ మెసేజ్, ఫోటోలు: హ్యాకింగ్ చేసింది ఎవరంటే?

|

వాషింగ్టన్: అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఫోన్‌ను సౌదీ అరేబియా హ్యాక్ చేసినట్లు సెక్యూరిటీ చీఫ్ వెల్లడించారు. గావిన్ డీ బెక్కర్.. చాలాకాలంగా బెజోస్‌కు కన్సల్టంట్‌గా ఉన్నారు. ఈ ఏడాది జనవరి నెలలో బెజోస్, అతని గర్ల్ ఫ్రెండ్ లూరెన్ సాంజెస్ మధ్య జరిగిన రహస్య సంభాషణ బహిర్గతమైన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపారు.

<strong>కాపురంలో 'మెసేజ్' చిచ్చు: బిలియనీర్ గర్ల్‌ఫ్రెండ్ సోదరుడే 2 లక్షల డాలర్లకు లీక్ చేశాడా?</strong>కాపురంలో 'మెసేజ్' చిచ్చు: బిలియనీర్ గర్ల్‌ఫ్రెండ్ సోదరుడే 2 లక్షల డాలర్లకు లీక్ చేశాడా?

అమెజాన్ చీఫ్ ఫోన్ హ్యాక్ చేసింది సౌదీస్

అమెజాన్ చీఫ్ ఫోన్ హ్యాక్ చేసింది సౌదీస్

ఈ మేరకు సౌదీ అరేబియా అథారిటీస్.. అమెజాన్ చీఫ్ ఫోన్‌ను హ్యాక్ చేశాయని, ఆయన పర్సనల్ డేటాతో యాక్సెస్ అయిందని తెలిపారు. మా విచారణాధికారుతో పాటు పలువురు నిపుణులు ద్వారా జెఫ్ బెకోజ్ ఫోన్ ఎలా లీక్ అయిందో తెలిసిందని, అతని ఫోన్‌కు సౌదీస్ యాక్సెస్ చేసుకున్నారని (హ్యాక్), వారు అతని ప్రయివేటు సమాచారాన్ని తీసుకున్నారని పేర్కొన్నారు. కాగా, దీనిపై సౌదీస్ స్పందించాల్సి ఉంది.

 ప్రధాన శత్రువుగా

ప్రధాన శత్రువుగా

వాషింగ్టన్ పోస్ట్ (జెఫ్ బెకోజ్ పత్రిక)ను 'ఎంబీఎస్' ప్రధాన శత్రువుగా భావిస్తున్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతోందని గావిన్ డీ బెక్కర్ అన్నారు. 'ఎంబీఎస్' అని ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌ను (ఎంబీఎస్) ఉద్దేశించి అన్నారు. అయితే, హ్యాకింగ్‌కు సౌది అరేబియాలోని ఏ ప్రాంతాన్ని లేదా ఎవరిని తప్పుపడుతున్నారో స్పష్టంగా చెప్పలేదు. విచారణ గురించి కొన్ని వివరాలు మాత్రమే చెప్పారు.

తన పర్సనల్ డేటా, ఫోటోలు బహిర్గతం కావడంపై విచారణ

తన పర్సనల్ డేటా, ఫోటోలు బహిర్గతం కావడంపై విచారణ

జెఫ్ బెజోస్ తన పర్సనల్ డేటా, ఫోటోలు బహిర్గతం కావడంపై గావిన్ డీ బెక్కర్ అండ్ అసోసియేట్స్‌ను నియమించారు. ప్రియురాలితో బెజోస్ సన్నిహిత సందేశాలు, ఫోటోలు బయటపడటంతో అతని సతీమణి విడాకుల వరకు వెళ్లిన విషయం తెలిసిందే.

English summary

గర్ల్ ఫ్రెండ్‌తో అమెజాన్ సీఈవో సీక్రెట్ మెసేజ్, ఫోటోలు: హ్యాకింగ్ చేసింది ఎవరంటే? | Bezos Security Advisor Claims Saudis Hacked, Leaked Amazon CEO Intimate Messages

The investigator hired to look into the release of intimate images of Jeff Bezos said Saturday he has concluded that Saudi Arabian authorities hacked the Amazon chief's phone to access his personal data.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X