For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ నష్టాల్లో మార్కెట్లు, మరింత బలహీనపడిన రూపాయి: కారణాలివే

|

ముంబై: మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం. 9.40 నిమిషాల సమయంలో సెన్సెక్స్‌ 360 పాయింట్లకు పైగా నష్టంతో 37,803 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 104 పాయింట్లు కోల్పోయి 11,352 వద్ద కొనసాగింది. మధ్యాహ్న సమయానికి సెన్సెక్స్ 38,000 కంటే తక్కువకు ట్రేడ్ అయింది.

బీఎస్ఎన్ఎల్, ఐడియా, ఎయిర్‌టెల్, జియో ఐపీఎల్ ఆఫర్లుబీఎస్ఎన్ఎల్, ఐడియా, ఎయిర్‌టెల్, జియో ఐపీఎల్ ఆఫర్లు

ప్యాసింజర్‌ వెహికల్స్‌ ధరలు పెంచనున్నారన్న వార్తల నేపథ్యంలో టాటా మోటార్స్‌ షేర్లు రెండు శాతం మేర నష్టపోయాయి. బ్యాంకింగ్‌, ఫార్మా, లోహ, ఆటో, ఎఫ్‌ఎమ్‌సీజీ రంగాల షేర్లు నష్టాల్లో కొనసాగాయి. వోల్టాస్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, వేదాంత, యస్‌బ్యాంకు, డీఎల్‌ఎఫ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టెక్ మహీంద్రా, ఐఓసీ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.

Sensex breaks below 38,000: 5 factors that could be weighing downmarket

సెన్సెక్స్ అంతకుముందు రోజు 38,164 పాయింట్లతో పోలిస్తే 148 పాయింట్ల నష్టంతో 38,016 వద్దనే ప్రారంభమైంది. నిఫ్టీ గత ముగింపు కంటే 11,456 పాయింట్లతో పోలిస్తే 61 పాయింట్ల నష్టంతో 11,395 వద్ద ట్రేడింగ్ ఆరంభించింది.

మరింత బలహీనపడిన రూపాయి

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ సోమవారం మరింత బలహీనపడింది. ఉదయం డాలర్‌తో రూపాయి విలువ 69.07గా నమోదయింది. అంతకుముందు రోజు 68.95తో ముగిసింది. ఆ తర్వాత శుక్రవారం నాటితో పోలిస్తే మరింత బలహీనపడింది. 16 పైసలు తగ్గి 69.11 వద్ద కొనసాగింది.

మార్కెట్లు నష్టపోవడానికి కారణాలు

ఎఫ్‌డీ వడ్డీ రేట్లపై అమెరికా మెతక వైఖరి, యూరోజోన్‌లో బ్రెగ్జిట్‌ అంశం తీవ్రతరం కావడం, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమన వంటి కారణాల వల్ల మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీన సెంటిమెంట్‌ను నెలకొన్నాయి. దీంతో అమెరికా మార్కెట్లు శుక్రవారం పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఆసియా మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇది మన మార్కెట్లపై కూడా పడింది.

ఆసియా మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ ప్రభావం భారత మార్కెట్లపై కూడా పడింది. జపాన్‌కు చెందిన నిక్కీ 2.9 శాతం, దక్షిణ కొరియాకు చెందిన కోస్పీ ఇండెక్స్ 1.5 శాతం పడిపోయింది. అదే విధంగా ఆస్ట్రేలియా షేర్లు 1.3 శాతం పడిపోయాయి. శుక్రవారం నాడు మూడు ప్రధాన అమెరికా స్టాక్ ఇండెక్స్‌లు భారీ నష్టాల్లో ముగిశాయి. జనవరి 3వ తేదీ నుంచి అంత నష్టాల్లో ముగియడం శుక్రవారమే. డౌ 1.8 శాతం, ఎస్ అండ్ పి 1.9 శాతం, నస్‌దఖ్ 2.5 శాతం నష్టపోయింది.

అమెరికా, యూరప్‌ ఫ్యాక్టరీ డేటా బలహీనంగా మార్కెట్లను భయపెట్టింది. భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వృద్ధి తగ్గవచ్చనే ఆందోళనలు నేపథ్యంలో వాల్‌స్ట్రీట్‌ షేర్లను భారీగా విక్రయించేశారు.ఈ ఆందోళన కారణంగా మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. శుక్రవారం నాడు అమెరికా స్టాక్ మార్కెట్లు పడిపోయాయని, లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డెబిట్స్ షార్ట్ టర్మ్ కంటే పడిపోయాయని, ఇది మాంధ్యానికి సంకేతమని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్కెట్ల పతనానికి ఇది కూడా కారణమని అంటున్నారు. బ్రెగ్జిట్ విషయం తేలకపోవడం కూడా ఆ కారణం.

ట్రేడర్స్ అధికస్థాయిలో లాభాలపై అధిక లాభాలపై దృష్టి సారించారని, గత వారం మార్చి 11వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు నిఫ్టీ, సెన్సెక్స్ లాభాల్లో ముగిసిందని గుర్తు చేస్తున్నారు. వారం రోజుల్లో 0.26 మేర మాత్రమే పెరిగిందన్నారు. మార్కెట్లు నష్టాలతో ప్రారంభం కావడానికి పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. రూపాయి స్వల్పంగా విలువ కోల్పోవడం మార్కెట్లలో భయాన్ని సూచించింది. దీంతోపాటు డాలర్‌ బలపడటం కూడా మార్కెట్ల కుంగుబాటుకు కారణమైంది. నేడు రూపాయి ట్రేడింగ్‌ రూ.68.98 వద్ద మొదైంది.

English summary

భారీ నష్టాల్లో మార్కెట్లు, మరింత బలహీనపడిన రూపాయి: కారణాలివే | Sensex breaks below 38,000: 5 factors that could be weighing downmarket

Indian rupee today weakened against US dollar tracking losses in Asian currencies market on rising concerns over global economic growth. The Indian rupee has extended its morning losses and trading lower by 16 paise at 69.11 per dollar versus Friday's close 68.95.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X