For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాభాల్లో స్టాక్ మార్కెట్లు: బలపడిన రూపాయి, 13పైసలు పెరిగి రూ. 68.70 వద్ద ప్రారంభం

|

ముంబై: స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ప్రారంభమైంది. ఉదయం 9.44 సమయానికి సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 38,473 వద్ద, 25 పాయింట్ల లాభంతో 11,546 వద్ద నిఫ్టీ ట్రేడ్ అయింది.

ఎల్ అండ్ టీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఎల్ అండ్ టీ.. మైండ్ ట్రీని వశం చేసుకోవాలని భావిస్తోన్న విషయం తెలిసిందే. దీనికి మైండ్ ట్రీ అంగీకరించడం లేదు. తాజాగా, మైండ్ ట్రీ ఈ నెల 26వ తేదీన భేటీ కావాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మైండ్ ట్రీ షేర్లు పడిపోయాయి.

పెరుగుతున్న డెబిట్ కార్డులు, తగ్గుతున్న ఏటీఎంలుపెరుగుతున్న డెబిట్ కార్డులు, తగ్గుతున్న ఏటీఎంలు

Stocks Market Update: Rupee opens 13 paise higher at 68.70 against dollar

స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ షేర్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన కొన్ని విమానాలను తీసుకునేందుకు స్పైస్ జెట్ సిద్ధమైంది. అలాగే పైలట్లను కూడా తీసుకోనుంది. ఈ నేపథ్యంలో ఎనిమిది నెలల గరిష్టానికి స్పైస్ జెట్ షేర్లు చేరుకున్నాయి. డాక్టర్ లెడ్డీస్ షేర్లు వరుసగా ఐదో రోజు లాభాల్లో కొనసాగుతున్నాయి. నెరోలాక్ షేర్లు 5 శాతం పడిపోయాయి. ఈ షేర్లు పడిపోవడం వరుసగా నాలుగో రోజు.

మరోవైపు, రూపాయి శుక్రవారం మరింత బలపడింది. ఉదయం 13 పైసలు లాభపడి 68.70 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. అంతకుముందు బుధవారం 68.83 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది. ఫెడ్‌ నిర్ణయం కారణంగా రూపాయి బలపడింది.

English summary

లాభాల్లో స్టాక్ మార్కెట్లు: బలపడిన రూపాయి, 13పైసలు పెరిగి రూ. 68.70 వద్ద ప్రారంభం | Stocks Market Update: Rupee opens 13 paise higher at 68.70 against dollar

The rupee on Friday opened 13 paise up at 68.70 against the greenback as US dollar weakened after the Federal Reserve surprised markets by bringing its three year tightening drive to an earlier than expected end.
Story first published: Friday, March 22, 2019, 11:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X