For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.5872 కోట్ల ట్యాక్స్ కట్టండి.. ఆదిత్యబిర్లాకు ఐటీ శాఖ నోటీస్

By Chanakya
|

ఆదాయపు పన్ను శాఖ ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన సంస్థ గ్రాసిమ్‌కు భారీ పన్ను నోటీసులు జారీ చేసింది. ఆదిత్యబిర్లా నువో సంస్థను ఆదిత్య బిర్లా క్యాపిటల్ సంస్థను విడదీసిన సమయంలో డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేని ప్రశ్నించింది. ఈ డీమెర్జ్ నేపధ్యంలో రూ.5872 కోట్ల పన్నును ల్లించాలని ఐటీ శాఖ షోకాజ్ నోటీసులను పంపింది.

అయితే దీనిపై స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చిన గ్రాసిం సంస్థ, ఇది చట్టం ముందు నిలబడదని దీనిపై న్యాయపరంగా పోరాడుతున్నామని తెలియ జేసింది.

కేంద్రానికీ తాకిన డేటా సెగ ! ఇప్పుడు కొత్త అనుమానాలుకేంద్రానికీ తాకిన డేటా సెగ ! ఇప్పుడు కొత్త అనుమానాలు

I-T dept issued a tax demand notice of Rs.5,872 crore to Grasim Industries

ఐటీ శాఖ ఇచ్చిన షోకాజ్ నోటీసుల ప్రకారం.. ఆదిత్య బిర్లా క్యాపిటల్ సంస్థను విడదీసినప్పుడు దీన్ని ఐటీ సెక్షన్ 115-0, 115Q కింద ఎందుకు పరిగణించకూడదో వివరించాలని ప్రశ్నించింది.

2016లో ఇదీ జరిగింది

ఆగస్ట్ 2016లో ఆదిత్య బిర్లా సంస్థ నుంచి ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ను వీడదిశారు. ఇందుకు ప్రతిగా 10 ఏబీ నువో షేర్లను కలిగిన వాటాదార్లకు 3 గ్రాసిం షేర్లను ఇచ్చారు. వీటికి అదనంగా ఏబీక్యాపిటల్ షేర్లు కూడా వచ్చాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఒక షేర్ హోల్డర్ దగ్గర 100 ఏబీనువో షేర్లు ఉంటే తనకి..
30 గ్రాసిం షేర్లు, 210 ఏబీఫైనాన్షియల్ సర్వీస్ షేర్లు అలాట్ అయ్యాయి.

అయితే ఈ స్కీం ఆఫ్ అరేంజ్‌మెంట్ మొత్తాన్ని డివిడెండ్‌గా పరిగణిస్తూ..ఐటీ శాఖ గ్రాసిం సంస్థకు నోటీసులు జారీచేసింది. దీనిపై ఆదిత్యబిర్లా గ్రూపు న్యాయపోరాటానికి సిద్ధమైంది.

English summary

రూ.5872 కోట్ల ట్యాక్స్ కట్టండి.. ఆదిత్యబిర్లాకు ఐటీ శాఖ నోటీస్ | I-T dept issued a tax demand notice of Rs.5,872 crore to Grasim Industries

The Income Tax Department has slapped a Rs 5,872 crore demand in tax on Aditya Birla Group company Grasim Industries with respect to its merger with Aditya Birla Nuvo and Aditya Birla Financial Services.
Story first published: Sunday, March 17, 2019, 12:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X