For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేంద్రానికీ తాకిన డేటా సెగ ! ఇప్పుడు కొత్త అనుమానాలు

By Chanakya
|

గత రెండు, మూడు వారాలుగా తెలుగు రాష్ట్రాలను కుదిపివేసిన డేటా వార్ ఇప్పుడు కేంద్రానికి కూడా వెళ్లింది. అయితే సదరు ఐటీ గ్రిడ్స్ కేసుతో ఏ మాత్రం సంబంధం లేకపోయినా డేటా అనే అంశం ఇప్పుడు కేంద్రాన్ని ఇబ్బందిపెడ్తోంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గణంకాలపై కొద్దిగా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆర్థిక వేత్తలు.

గురువారం 108 మంది భారత, విదేశీ ఆర్థికవేత్తలు సహా సోషల్ సైంటిస్టులు ఢిల్లీలో సమావేశమై భారత ప్రభుత్వం ఇస్తున్న గణాంకాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్రంగా ఉండాల్సిన కేంద్ర సంస్థల్లో రాజకీయ జోక్యం ఎక్కువైపోయిందనే విషయాన్ని వారంతా ముక్త కంఠంతో ఖండించారు. తాము ఇది సాధించాము అని కేంద్రం చెప్పిన ప్రతీ సారీ అనుమానించాల్సి వస్తోందనే వాపోయారు.

విడుదల ఒక్క నెలలోనే 13000 వేల XUV300 అమ్మకాలు ..విడుదల ఒక్క నెలలోనే 13000 వేల XUV300 అమ్మకాలు ..

నమ్మలేని డేటాను ఎందుకు ఉపేక్షించాలి ?
ప్రొఫెషనల్ ఎకనమిస్ట్స్, స్టాటిష్‌టీషియన్స్, ఇండిపెండెంట్ రీసెర్చర్స్ అందరికీ ఓ బహిరంగ లేఖ రాసిన 108 సభ్యుల ఆర్థిక వేత్తల బృందం.. ఈ అంశంపై కలిసిరావాలని కోరారు. నమ్మశక్యంగా లేని గణాంకాలను ఆమోదించడం కంటే.. దానిపై చర్చ జరగడమే మంచిదనే విషయాన్ని వాళ్లంతా ఏకీభవిస్తున్నారు.

state data issue touched central

తాజాగా వచ్చిన జీడీపీ గణాంకాలు, ఎన్ఎస్ఎస్ఓ ఇచ్చిన నిరుద్యోగ డేటా దుమారం రేపిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పట్లో ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చేపట్టే యత్నం చేసినప్పటికీ కేంద్ర సంస్థలపై కొద్దిగా నమ్మకం సడలింది. దీంతో నిపుణులంతా ఒక్క చోట చేరి ఈ అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరిపారు. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా గణాంక సంబంధ సంస్థలన్నీ స్వతంత్రంగా పనిచేయాలని, వాటిల్లో రాజకీయ జోక్యం ఏ మాత్రం మంచిది కాదని వాళ్లంతా సూచించారు. కేంద్రం చెప్పే నెంబర్స్‌పై ఒకసారి నమ్మకం కోల్పోతే అంతర్జాతీయ స్థాయిలో మనకు చెడ్డపేరు వస్తుందని, అది పెట్టుబడులపై కూడా ప్రభావం చూపుతుంది అనే విషయంపై ఆర్థికవేత్తలంతా పెదవి విరిచారు.

పాల్గొన్నవారిలో..
తమ అసహనాన్ని వ్యక్తం చేసిన ఆర్థికవేత్తల బృందంలో ఎంఐటీ ప్రొఫెసర్స్ అభిజిత్ బెనర్జీ, ఎస్తర్ డుఫ్లో, జెఎన్‌యూ నుంచి అభిజిత్ సేన్, అలహాబాద్ యూనివర్సిటీ నుంచి జీన్ డ్రీజ్, ఐఐఎం అహ్మదాబాద్ నుంచి రాకేష్ బసంత్ సహా మరికొంత ప్రముఖులు ఉన్నారు.

English summary

కేంద్రానికీ తాకిన డేటా సెగ ! ఇప్పుడు కొత్త అనుమానాలు | state data issue touched central

Economists allege political interference in statistical data. A group of economists has appealed to raise voice against the tendency “to suppress uncomfortable data”.
Story first published: Friday, March 15, 2019, 17:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X