For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2019 రికార్డ్ స్థాయికి సెన్సెక్స్!లార్జ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ సపోర్ట్‌తో భారీ లాభాల్లో ముగింపు

By Chanakya
|

స్టాక్ మార్కెట్ సూచీలు మంచి లాభాలతో దూసుకుపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్ వంటి హెవీ వెయిట్ స్టాక్స్ మద్దతుకు తోడు స్మాల్ - మిడ్ క్యాప్ స్టాక్స్‌లో కూడా కొనుగోళ్లు ఇండెక్స్‌ను 2019 గరిష్ట స్థాయిలకు తీసుకెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పాజిటివ్ సంకేతాలకు తోడు దేశీయంగా పోల్ సెంటిమెంట్‌ను సూచీలను దౌడు తీయించింది. సెన్సెక్స్ 37 వేల పాయింట్లపైన స్థిరంగా ముగిసింది. నిఫ్టీ కూడా 11,150పైన కాన్ఫిడెంట్‌గా క్లోజైంది. సెప్టెంబర్ 2018 తర్వాత సూచీలు మళ్లీ ఈ స్థాయిలో క్లోజ్ కావడం మళ్లీ ఇప్పుడే. చివరకు 132 పాయింట్ల లాభంతో 11,168 దగ్గర నిఫ్టీ ముగిసింది. సెన్సెక్స్ 382 పాయింట్ల లాభంతో, బ్యాంక్ నిఫ్టీ 205 పాయింట్ల లాభంతో ముగిశాయి. ఇంట్రాడేలో బ్యాంక్ నిఫ్టీ 28000 పాయింట్ల మార్కును దాటింది. లైఫ్ టైం గరిష్ట స్థాయికి కేవలం 1 శాతం దూరంలో మాత్రమే బ్యాంక్ నిఫ్టీ ఉంది.

భారతీ ఎయిర్టెల్, హెచ్ పి సి ఎల్, బిపిసిఎల్, ఐషర్ మోటార్స్, భారతి ఇన్ఫ్రాటెల్ టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. ఎన్టీసీ, టెక్ మహీంద్రా, జీ ఎంటర్‌టైన్‌మెంట్, హెచ్ సి ఎల్ టెక్, టిసిఎస్ టాప్ 5 లూజర్స్ జాబితాలో చేరాయి.

ఒక్క ఐటీ మినహా...

ఒక్క ఐటీ మినహా...

ఈ రోజు ట్రేడింగ్‌లో ఒక్క ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లూ లాభాల్లోనే ముగిశాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్, మెటల్, ఎఫ్ఎంసిజి, ఆటో రంగ కౌంటర్లకు మంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. రూపాయి - డాలర్ రూ.70 మార్కు దిగువకు రావడంతో ఐటీ రంగ కౌంటర్లు దిగాలు పడ్డాయి.

మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు రెండు శాతానికిపైగానే లాభపడ్డాయి. ఎన్ఎస్ఈలో అడ్వాన్సెస్ 1540 నుంచే డిక్లైన్స్ 642 మాత్రమే ఉన్నాయి.

ఎన్నాళ్లకెన్నాళ్లకు ఎయిర్టెల్

ఎన్నాళ్లకెన్నాళ్లకు ఎయిర్టెల్

భారతి ఎయిర్టెల్ చాలా కాలం తర్వాత భారీగా పెరిగి ఆశ్చర్యపరిచింది. తాజాగా కంపెనీ రూ.32 వేల కోట్ల రుణ సమీకరణకు రావడం, దీనికి సింగపూర్ ప్రభుత్వ సంస్థ నుంచి కూడా మద్దతు రావడం కలిసొచ్చింది. దీంతో చాలా కాలం తర్వాత ఎయిర్టెల్ షేర్ 8 శాతానికి పైగా లాభపడింది. వాల్యూమ్స్‌తో సహా పెరిగిన స్టాక్ చివరకు 8.13 శాతం లాభాలతో రూ.333.70దగ్గర క్లోజైంది.

ఎన్‌బిఎఫ్‌సి జోరు

ఎన్‌బిఎఫ్‌సి జోరు

లిక్విడిటీ సమస్యలు కాస్త తగ్గుముఖం పట్టడంతో మళ్లీ ఎన్‌బిఎఫ్‌సి షేర్లు జోరందుకున్నాయి. ఈ రోజు ట్రేడ్‌లో బ్యాంకింగ్ సహా ఈ రంగంతో సంబంధమున్న స్టాక్స్ అన్నీ పరుగులు తీశాయి. ఎడిల్వైజ్ 6 శాతం, ముత్తూట్ ఫైనాన్స్ 4 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 2.5 శాతం పెరిగాయి. ఇదే బాటలో ఉజ్జీవన్ ఫైనాన్స్, ఈక్విటాస్, చోళా ఫైనాన్స్ 6 శాతం వరకూ లాభపడ్డాయి.

ఇదే బాటలో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో క్యాన్‌ఫిన్ హోమ్స్ 7 శాతం, గృహ్ ఫైనాన్స్ 4 శాతం పెరిగాయి.

ఇన్ఫ్రాలో దూకుడు ఆగేలా లేదు

ఇన్ఫ్రాలో దూకుడు ఆగేలా లేదు

ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ గతకొద్దికాలం నుంచి ఊపుమీదున్నాయి. మళ్లీ పటిష్టమైన ప్రభుత్వం రాబోతోందనే అంచనాల నేపధ్యంలో ఈ స్టాక్స్ దౌడుతీస్తున్నాయి. కొత్త ప్రాజెక్టుల దక్కడంతో దిలీప్ బిల్డ్ కాన్ 7 శాతం, HG infra 8 శాతం పెరిగింది. ఇదే ఫీల్డ్‌లో ఉన్న ఐటిడి సిమెంటేషన్ 11 శాతం, సద్భావ్ ఇంజనీరింగ్, ఐఆర్‌బి ఇన్ఫ్రా 5 శాతం, జెకుమార్ ఇన్ఫ్రా 3.5 శాతం లాభపడ్డాయి.

అవంతి, వెంకీస్ రయ్ రయ్..

అవంతి, వెంకీస్ రయ్ రయ్..

మళ్లీ రొయ్య సంబంధ ఆహారం, ఎరువుల కంపెనీల స్టాక్స్ లైమ్‌లైట్‌లోకి వచ్చాయి. అవంతీ సీడ్స్ 10 శాతం, అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ 6 శాతం, వాటర్ బేస్ 4 శాతం పెరిగాయి. ఇదే బాటలో వెంకీస్ ఇండియా వాల్యూమ్స్‌తో పాటు 6 శాతం పెరిగి రూ.2320 దగ్గర క్లోజైంది.

కొన్నింటిలో ప్రాఫిట్ బుకింగ్

కొన్నింటిలో ప్రాఫిట్ బుకింగ్

షుగర్ సంబంధ స్టాక్స్‌లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. పెద్దగా ఈ సెక్టార్ నుంచి పాజిటివ్ న్యూస్ ఏవీ అంతగా ప్రభావితం చేసే అవకాశం లేకపోవడంతో వీటిలో లాభాల స్వీకరణ కొనసాగుతొంది. ఇవే కాకుండా ఈ మధ్య పెరిగిన స్టాక్స్‌లో నాల్కో 4 శాతం, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 8 శాతం, దివాన్ హౌసింగ్ 5 శాతం, న్యూల్యాండ్ ల్యాబ్స్ 4 శాతం నష్టపోయాయి

English summary

2019 రికార్డ్ స్థాయికి సెన్సెక్స్!లార్జ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ సపోర్ట్‌తో భారీ లాభాల్లో ముగింపు | Stock Markets ends near six month high

Stock Markets ends near six month high, with strong support from Large and small cap stocks. Sensex closed comfortably above 37000 levels and bank nifty is nearing record high levels.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X