కష్టాల్లో రుపాయి మారకం విలువ...
భారత ఆర్ధిక వ్యవస్థకు కష్టకాలం రానుంది...సమీప భవిష్యత్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి రూ.75కు పడిపోయే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒక పక్క చమురు ధరలు పెరగడం, మరో పక్క కశ్మీర్ ఉద్రిక్తతలు, రాబోయే సాధారణ ఎన్నికలు వంటి పరిణామాలు రూపాయి క్షీణతకు ఆజ్యం పోస్తున్నాయి. గత సంవత్సరం తో పోలిస్తే కోత్త ఏడాది రుపాయి మారకం విలువ తగ్గుతూ వస్తుంది.జనవరి ప్రారంభంలో రుపాయి మారకం విలువ 69.23 దగ్గర ఉండగా ఉంది. కాగా సోమవారం ట్రేడింగ్‌లో 71.51 వద్ద కనిష్ఠానికి చేరి, డిసెంబరు త్రైమాసికంలో ఆసియాలోనే మెరుగ్గా రాణించిన కరెన్సీగా రూపాయి నిలిచింది. అయితే ఇంతలోనే పరిస్థితులు తలకిందులయ్యాయి. పెరిగిన ముడిచమురు ధరలతో రూపాయికి మళ్లీ కష్టకాలం మొదలైంది.కశ్మీర్‌లో పరిస్థితులు మరింత దిగజారితే రూపాయి త్వరలోనే 73 తాకొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు రానున్న ఎన్నికల్లో ప్రస్థుత ప్రభుత్వం యొక్క గెలుపు ఓటములు సైతం ప్రభావం చూపనున్నట్టు ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు..

రూపాయి×రూపియా
ఈ ఏడాది భారత్ రుపాయి కంటే ఇండోనేషియా రుపియా రూపియా ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. జనవరి 1 నుంచి ఇప్పటి వరకు విదేశీ ఫండ్ సంస్థల నుంచి ఇండోనేషియా షేర్లు, బాండ్లు దాదాపు 3 బిలియన్ డాలర్లు సమీకరించాయి. ఇదే సమయంలో భారత్ నుంచి దాదాపు 100 మిలియన్ డాలర్లు వెనక్కి వెళ్లాయి. ....ఇక డాలర్‌తో రూపియాను చూస్తే.. ఈ ఏడాది దాదాపు 14,000 దరిదాపుల్లో కదలాడొచ్చని, ఎన్నికలకు ముందు 14,300- 14,400 వరకు బలహీనపడొచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..

మోది ప్రభావం...
ఇక భారత్, ఇండోనేషియాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రభావం ఈ రెండు దేశాల కరెన్సీలపైనా గణనీయంగా ఉండనున్నట్టు ఆర్ధిక విశ్లేషకులు భావిస్తున్నారు... భారత్ రూపాయితో పోలిస్తే ఇండోనేషియా కరెన్సీ రూపియా మెరుగ్గా రాణించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒపీనియన్ పోల్స్ ప్రకారం.. ఏప్రిల్ 17న జరగనున్న ఎన్నికల్లో ఇండోనేషియా అధ్యక్షుడు జోకోవి డోడో జయకేతనం ఎగరవేస్తారని స్పష్టం చేశాయి. భారత్‌లో నరేంద్ర మోదీ కోంత ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోంటారనే అభిప్రాయాం రుపాయి పై ప్రభావం పడనుంది... ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భాజపా వరుస ఓటములు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో మదుపర్లు రూపాయితో పోలిస్తే రూపియాతో నష్టభయం తక్కువగా ఉందని భావిస్తున్నారు. ఒకవేళ భారత్‌లో నరేంద్ర మోదీ మళ్లీ గెలవకుంటే రూపాయి మరింత బలహీనపడొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది రూపాయి ఒడుదొడుకులు పెరగడానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి...
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications