For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంతర్జాతీయ మార్కెట్లో కొండెక్కుతున్న బంగారం ధరలు. 10 నెలల గరిష్టానికి, బంగారం రేట్లు, రూ.35 వేలకు

By Chanaky
|

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మెల్లిగా కొండెక్కుతున్నాయి. అమెరికా - చైనా దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం నేపధ్యంలో పుత్తడికి ఎక్కడలేని డిమాండ్ వచ్చిపడ్తోంది. ఒక వేళ రెండు దేశాల మధ్య సయోధ్య కుదరని పక్షంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే వివిధ దేశాలు ఈ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చలను ఆసక్తిగా గమనిస్తున్నాయి.

ఈ నేపధ్యంలో బంగారం ధరలు 10 నెలల గరిష్ట స్థాయికి చేరా యి. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ ఔన్స్ గోల్డ్ 1325 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. గత నెల రోజుల్లో బంగారం ధరలు 45 డాలర్ల వరకూ పెరిగాయి.
నవంబర్ నెల నుంచి రేట్లలో జోరు మొదలైంది. 1180 డాలర్ల దగ్గర ఉన్న ఔన్స్ గోల్డ్ సుమారు150 డాలర్లకు పైగానే పెరిగింది. మరికొద్ది కాలం పాటు ఈ వృద్ధి ఇలానే కొనసాగవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Gold prices are on the hike in the international consequences

మన దేశంలో.. మన కరెన్సీలో మన దేశంలో ఆగస్ట్‌ నెలలో పది గ్రాముల బంగారం ధర రూ.30400 పలికింది. అదే మెల్లిమెల్లిగా ఎగబాకుతూ ప్రస్తుతం రూ.34600 దగ్గర ఆగింది. రిటైల్ మార్కెట్లో ఇది మరింత అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్‌తో పోలిస్తే మన దగ్గర రేట్లు మరింత ఎక్కువగా ఉండడానికి కారణం రూపాయి ధర ఎక్కువగా పడిపోవడం. డాలర్‌తో పోలిస్తే మన కరెన్సీ మారక విలువ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఆసియా మార్కెట్లలో వరస్ట్‌ పర్ఫార్మింగ్ కరెన్సీగా రూపాయి చరిత్ర సృష్టిస్తోంది. రూ.71.50 - 72 మధ్య ట్రేడవుతోంది. దీని వల్ల బంగారం ధర కూడా మన దగ్గర కొండెక్కుతోంది.

ఇంకెంత వరకూ గోల్డ్ రేట్ మరికొంత కాలం ఇలానే ఉండే అవకాశాలు ఉన్నాయి. దీనికి అంతర్జాతీయ కారణాలు చూస్తే.. చైనా - అమెరికా మధ్య అనిశ్చితి కనిపిస్తోంది. అదే దేశీయ పరంగా చూస్తేనేమో జియో
పొలిటికల్ టెన్షన్స్ (భారత్ - పాక్ మధ్య ముదురుతున్న వాతావారణం) ఉన్నాయి. దీని వల్ల కూడా రూపాయి బలహీనపడ్తోంది. ఒక వేళ యుద్ధ వాతావరణం వంటిది వస్తే.. రూపాయి మరింత తీసికట్టుగా మారుతుంది.అప్పుడు గోల్డ్ రేట్ మన దేశంలో రూ.35500 నుంచి 36000 వరకూ వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి రెండు వైపుల నుంచి నెగిటివ్ న్యూస్ రావడం వల్ల గోల్డ్ రేట్లకు పట్టపగ్గాలు లేవు.ఇవి కుదుటపడేంత వరకూ కాస్త జోష్ గోల్డ్ రేట్లలో కొనసాగవచ్చు.

పల్లాడియం కూడా..
మరో ప్రీషియస్ మెటల్ అయిన పల్లాడియం కూడా ఇదే స్థాయిలో దూసుకుపోతోంది. డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా లేకపోవడంతో ఇది ఏకంగా 1459 డాలర్లకు ఎగబాకింది.

Read more about: gold price hike బంగారం
English summary

అంతర్జాతీయ మార్కెట్లో కొండెక్కుతున్న బంగారం ధరలు. 10 నెలల గరిష్టానికి, బంగారం రేట్లు, రూ.35 వేలకు | Gold prices are on the hike in the international consequences

Gold prices are on the hike in the international market.the ongoing trade war between the US and China countries has comeThe demand for the gold,In the August, gold price was up by Rs 30400 per ten grams. At the same time, it hit the 34600 mark .
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X