For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అసలు ఈ కంపెనీలు ఎలా పుట్టుకొచ్చాయో తెలుసా?

By bharath
|

కొన్ని కంపెనీల పుట్టుక చాలా విచిత్రంగా ఉంటుంది. ఎక్కడో చిన్న గ్యారేజీలో కంపెనీ మొదలవుతుంది. ఆ తర్వాత ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎదుగుతుంటాయి. ఇప్పుడు ప్రపంచంలో దిగ్గజ కంపెనీలు ఇలా మొదలైనవే. ఎన్నో ఆటుపోట్లు, కష్టనష్టాల ప్రయాణంతో ప్రపంచం నివ్వెరపోయే విజయాలనందుకున్నాయి. అలా ఆకాశమే హద్దుగా ఎదిగిన దిగ్గజ కంపెనీల గురించి తెలుసుకుందాం.

గూగుల్:

గూగుల్:

స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో 1998లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత లారీ పేజ్, సెర్జీ బ్రిన్ కాలిఫోర్నియాలో ఓ గ్యారేజ్‌ని లీజ్‌కు తీసుకొని గూగుల్‌ కంపెనీని ప్రారంభించారు. తొలి సంవత్సరంలోనే గూగుల్ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత కొత్త ఆఫీసులోకి మారింది. సాంటా క్లారాలో 20 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఆఫీసుని ఏర్పాటు చేశారు.

మైక్రోసాఫ్ట్:

మైక్రోసాఫ్ట్:

1975లో హార్వర్డ్ డ్రాప్‌ అవుట్ బిల్‌ గేట్స్ తన బాల్య స్నేహితుడు పాల్ అల్లెన్‌తో కలిసి న్యూ మెక్సికోలోని గ్యారేజీలో మైక్రోసాఫ్ట్‌ని ప్రారంభించారు. కేవలం ఇద్దరు మాత్రమే కూర్చోగల చిన్న గ్యారేజీ అది. అక్కడ మొదలైన మైక్రోసాఫ్ట్ సంస్థ... వంద దేశాలకు విస్తరించింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌లో 1,31,300 మంది ఉద్యోగులున్నారు.

అమెజాన్:

అమెజాన్:

ప్రపంచంలోనే అతిపెద్ద ఇ-కామర్స్ కంపెనీ. ఫౌండర్ జెఫ్ బెజోస్. వాషింగ్టన్‌లోని తన ఇంటి గ్యారేజీలో అమెజాన్ కథ మొదలైంది. మొదట అమెజాన్ ఆన్‌లైన్ బుక్‌స్టోర్. మొదటి పుస్తకం అమ్మేందుకు ఏడాది సమయం పట్టింది. ఇప్పుడు అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌గా విస్తరించింది. ఇటీవలే లక్ష కోట్ల డాలర్ల క్లబ్‌లో చేరింది అమెజాన్.

వాల్ట్ డిస్నీ కంపెనీ:

వాల్ట్ డిస్నీ కంపెనీ:

ఇది కూడా 1923లో గ్యారేజీలో మొదలైన సంస్థే. వాల్ట్ డిస్నీ తన స్నేహితుడు రాయ్ డిస్నీతో కలిసి లాస్ ఏంజిల్స్‌లోని తమ అంకుల్ గ్యారేజీలో మొదట అలైస్ కామెడీస్ చిత్రీకరించారు. ఇప్పుడు వాల్ట్ డిస్నీ ప్రపంచంలోనే అతిపెద్ద మీడియా సంస్థ.

హార్లీ డేవిడ్‌సన్:

హార్లీ డేవిడ్‌సన్:

హైఎండ్ లగ్జరీ బైకులంటే గుర్తొచ్చేది హార్లీ డేవిడ్‌సన్ బ్రాండే. 1901లో 10x15 అడుగుల షెడ్డులో హార్లీ డేవిడ్‌సన్ ప్రయాణం మొదలైంది. విలియం హార్వే తన స్నేహితుడు ఆర్థర్ డేవిడ్‌సన్‌తో కలిసి మొదటి హార్లీ డేవిడ్‌సన్ బైక్‌ని తయారుచేశాడు. 1903లో అధికారికంగా బైక్‌ను లాంఛ్ చేశారు. ఇప్పుడు ఆ కంపెనీ విలువ 10 బిలియన్ డాలర్లు.

యాపిల్:

యాపిల్:

లక్ష కోట్ల డాలర్ల మార్క్‌ దాటిన తొలి కంపెనీ ఇది. 1976లో కాలిఫోర్నియాలోని చిన్న గ్యారేజీలో ముగ్గురు కుర్రాళ్లు ప్రారంభించిన కంపెనీ ఇది. వాళ్లే స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్, రోనాల్డ్ కలిసి ఫస్ట్ జెనరేషన్ యాపిల్ ఐ కంప్యూటర్స్ తయారుచేశారు. ఆ తర్వాత 50 యూనిట్ల ఆర్డర్ లభిస్తే 30 రోజుల్లో తయారుచేశారు. అలా మొదలైంది యాపిల్ ప్రయాణం. ఇప్పుడు ప్రపంచంలో యాపిల్ బ్రాండ్ గురించి తెలియనివాళ్లుండరు.

డెల్:

డెల్:

స్టీవ్ జాబ్స్, బిల్‌ గేట్స్ లాగా మైఖేల్ డెల్ పెద్దగా పేరు తెచ్చుకోలేదు కానీ... సక్సెస్‌ఫుల్‌గా కంప్యూటర్ వ్యాపారం నిర్వహించడంలో విజయం సాధించారాయన. ఆయన కూడా గ్యారేజీలోనే తన వ్యాపారాన్ని మొదలుపెట్టారు. 1984లో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో చదువుకుంటున్న సమయంలోనే కంప్యూటర్ల తయారీ ప్రారంభించారు. తన స్టార్టప్‌పై ఫోకస్ చేసేందుకు చదువును మధ్యలో ఆపేశారు. ఏడాదిలో 73 మిలియన్ డాలర్ల బిజినెస్ చేశారు. ప్రస్తుతం ఆ కంపెనీ విలువ 25 బిలియన్ డాలర్లు.

హెచ్‌పీ హెవ్లెట్-పాకర్డ్:

హెచ్‌పీ హెవ్లెట్-పాకర్డ్:

హెవ్లెట్-పాకర్డ్ అంటే ఎవరికీ పెద్దగా తెలిసిఉండకపోవచ్చు కానీ. హెచ్‌పీ అంటే చాలు కంప్యూటర్ ప్రొడక్ట్స్ గుర్తొస్తాయి. బిల్ హెవ్లెట్, డేవ్ పాకర్డ్ కలిసి 538 డాలర్లతో కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోలో గల పాకర్డ్ గ్యారేజీలో ఈ కంపెనీని ప్రారంభించారు. ప్రస్తుతం హెచ్‌పీ కంపెనీ విలువ 57 బిలియన్ డాలర్లు. పాలో ఆల్టో కేవలం హెచ్‌పీ కంపెనీ పుట్టిన ప్రాంతమే కాదు సిలికాన్ వ్యాలీకి అడుగుపడింది ఇక్కడే. ఆ తర్వాత అనేక టెక్ స్టార్టప్స్ ఇక్కడ పుట్టుకొచ్చాయి.

మ్యాటెల్:

మ్యాటెల్:

బార్బీ డాల్స్‌తో కోట్లాది మంది పిల్లల మొహాలపై చిరునవ్వులు తీసుకొచ్చిన ఓ బొమ్మల కంపెనీ ఇది. 1945లో దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ చిన్న గ్యారేజీలో ఈ కంపెనీని ప్రారంభించారు హారోల్డ్ మ్యాట్సన్, ఎల్లియాట్, రూథ్ హ్యాండ్లర్. మొదట చిన్నచిన్న బొమ్మలు, ఆ తర్వాత ఫోటో ఫ్రేమ్స్ తయారు చేసి అమ్మేవారు. ప్రస్తుతం మ్యాటెల్ బొమ్మల కంపెనీ విలువ 8.5 బిలియన్ డాలర్లు.

English summary

Top Most Companies In India.How They Born.

some companies are very strange. Somewhere in the small garage the company starts. After that, you are going to grow up.
Story first published: Saturday, February 16, 2019, 11:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X