For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించాలంటే ఏం నేర్చుకోవాలి

|

స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలి అని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. అయితే ఇది గ్యాంబ్లింగ్ అని కొందరు, జూదం అని మరికొందరు అనకుంటారు కానీ.. ఇదో సైన్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మన పెట్టుబడి పెట్టేందుకు ఓ అద్భుతమైన పెట్టుబడి సాధనంగా మనం స్టాక్ మార్కెట్లను చూడొచ్చు. ఎందుకంటే బ్యాంకుల్లో ఫిక్సెడ్ డిపాజిట్లు వంటి వాటి వల్ల ఏడెనిమిది శాతానికి మించి వడ్డీలు రావు. ఇక గోల్డ్, రియల్ ఎస్టేట్ వంటివి.. మనకు అవసరమైనప్పుడు అక్కరకు వస్తాయి కానీ చాలాసార్లు మెరుగైన రాబడిని. అందించడంలో విఫలమవుతాయి.

ఏం తెలుసుకోవాలి..ఇంట్రాడే, పొజిషనల్, షార్ట్ టర్మ్ అంటే ఏంటి ?

ఏం తెలుసుకోవాలి..ఇంట్రాడే, పొజిషనల్, షార్ట్ టర్మ్ అంటే ఏంటి ?

అందుకే స్టాక్ మార్కెట్ ఓ మెరుగైన ఇన్వెస్ట్ మెంట్ ఛాయిస్. అయితే ఇందులో డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి.. అనేది ప్రాధమిక ప్రశ్న. చదవాలి, నేర్చుకోవాలి, జ్ఞానం పెంచుకోవాలి... అప్పుడే మార్కెట్లో డబ్బులొస్తాయి.

ముందుగా మన ఇన్వెస్ట్‌మెంట్ టైం.. ఎన్ని ఏళ్లు అని ఓ నిర్ధారణకు రావాలి. ఎందుకంటే షార్ట్ టర్మ్.. లాంగ్ టర్మ్ అనేవి ఇందులో రెండురకాలు. ఇంకా డీటైల్డ్‌గా చెప్పుకోవాలంటే.. షార్ట్ టర్మ్‌లో మళ్లీ ఇంట్రాడే, పొజిషనల్ అనేవి కూడా ఉన్నాయి. ఇంట్రాడే అంటే ఈ రోజు పొద్దున స్టాక్ కొని మళ్లీ.. అదే రోజు మార్కెట్ ముగిసేలోపు లాభంతోనో, నష్టంతోనే అమ్మేయడమే ఇంట్రాడే ట్రేడింగ్. ఇది చాలా నైపుణ్యం ఉన్నవాళ్ల చేయాల్సినది. మంచి నాలెడ్డ్ ఉంటే ఇందులో కూడా బాగా డబ్బులు సంపాదించవచ్చు. ఇక పొజిషనల్ అంటే.. వారం రోజుల నుంచి నెల రోజుల వరకూ స్టాక్ ను అట్టిపెట్టుకుని అమ్ముకోవడం. ఇక లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ అంటే.. ఆరు నెలల నుంచి రెండు మూడేళ్ల పాటు స్టాక్‌ను మన దగ్గర హోల్డ్ చేయడం. సాధారణంగా లాంగ్ టర్మ్ వల్లే మనకు సంపద ఎక్కువగా సృష్టి జరిగేందుకు ఆస్కారం ఉంటుంది.

టెక్నికల్ ఎనాలసిస్ అంటే ?

టెక్నికల్ ఎనాలసిస్ అంటే ?

అయితే ఇందుకోసం ఏం చేయాలి అని చూద్దాం. ఇంట్రాడే చేయాలని అనుకుంటున్న వాళ్లు టెక్నికల్స్ నేర్చుకోవాలి. టెక్నికల్స్‌లో క్యాండిల్ స్టిక్స్, మూవింగ్ యావరేజెస్, ట్రెండ్ లైన్స్, సపోర్ట్, వాల్యూమ్.. ఇలా అనేక అంశాలు ఉంటాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌తో పాటు అనేక ఇతర ప్రైవేట్ సంస్థలు కూడా వీటికి క్లాసులు చెప్తాయి. వారం రోజుల నుంచి మూడు నెలల వరకూ మన ఎక్స్ పర్జైజ్‌ను బట్టి టైం ఫ్రేం ఉంటుంది.

 ఫండమెంటల్ ఎనాలిసిస్ అంటే ?

ఫండమెంటల్ ఎనాలిసిస్ అంటే ?

ఇక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం స్టాక్స్‌ను పిక్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్లు కొద్దిగా ఎకానమీ గురించి తెలుసుకోవడం, సదరు కంపెనీ బ్యాలెన్స్ షీట్స్ చెక్ చేయడం, వాళ్ల క్వార్టర్టీ రిజల్ట్స్‌ను ఎనలైజ్ చేయడం వంటివి తెలుసుకోవాలి. అప్పుడే మంచి స్టాక్స్‌ను మనం ఏరి పట్టుకోవచ్చు. లేకపోతే ఎక్స్‌పర్ట్స్ ఇచ్చే సలహాలపైనే మనం ఎప్పటికీ ఆధారపడాల్సి వస్తుంది. ఫండమెంటల్స్ నేర్పించేందుకు అనేక సంస్థలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఏది నేర్చుకున్నా.. క్రమశిక్షణ ఇందులో చాలా ముఖ్యం.

నేర్చుకోవడం ఒక్కటే ముఖ్యంకాదు

నేర్చుకోవడం ఒక్కటే ముఖ్యంకాదు

సెకన్ సెకన్‌కు మారే మార్కెట్‌ మన మెదడను విపరీతమైన ఒత్తిడికి లోను చేస్తుంది. ఈ టైంలో సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఓర్పు, సహనంతో పాటు నిత్యం నేర్చుకోవాలనే తపన ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకునే సత్తా ఉంటే.. స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం పెద్ద కష్టమేమీకాదు. అందుకే మొదట్లో చెప్పినట్టు ఇది సైన్స్. అంటే నేర్చుకున్న ప్రతీ ఒక్కరికీ ఇది అబ్బుతగా ఉంది. అదే ఆర్ట్ అయితే కొంత మందికి మాత్రమే పరిమితమవుతుంది. అందుకే ఈ సైన్స్‌ను మీరు అర్థం చేసుకున్నట్టైతే.. భారీగా డబ్బులు సంపాదించడం ఏ మాత్రం కష్టంకాదు. మీకు ఇంకా మార్కెట్ పై ఏవైనా సందేహాలు ఉంటే.. కింద కామెంట్ బాక్స్‌లో రాయండి. నిపుణులు మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు.

English summary

స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించాలంటే ఏం నేర్చుకోవాలి | Techniques to earn money in Stock markets

To become a successful investor or trader in stock market learn these techniques Basics of stock market and trade tips.
Story first published: Saturday, February 9, 2019, 14:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X