For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెజాన్‌తో పోటాపోటీ ! రూ.2750 కోట్లు రెడీ చేసిన బిగ్ బజార్

కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ రిటైల్ సంస్థ అదే ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. రిటైల్ మార్కెట్ కాస్త మందగించినప్పటికీ, పోటీ విపరీతంగా పెరిగినప్పటికీ వీళ్లు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గే స్థితిలో లేమని.

By bharath
|

కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ రిటైల్ సంస్థ అదే ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. రిటైల్ మార్కెట్ కాస్త మందగించినప్పటికీ, పోటీ విపరీతంగా పెరిగినప్పటికీ వీళ్లు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గే స్థితిలో లేమని స్పష్టం చేస్తున్నారు. అమెజాన్‌తో డీల్ దాదాపుగా ఆగిపోయినట్టే కనిపిస్తున్న నేపధ్యంలో ఫ్యూచర్ గ్రూప్ మళ్లీ వేగం పెంచింది. ఎన్.సి.డి (నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్) ద్వారా రూ.750 కోట్లు తక్షణం నిధులు సేకరించేందుకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంగీకరించారు. వీటికి అదనంగా మరో రూ.2000 కోట్లకు ప్రమోటర్ వారెంట్స్ ఇష్యూ చేయబోతున్నారు. దీంతో సంస్థలో ప్రమోటర్ల వాటా 46.5 నుంచి 50.4 శాతానికి పెరగనుంది.

అమెజాన్‌తో పోటాపోటీ ! రూ.2750 కోట్లు రెడీ చేసిన బిగ్ బజార్

అమెజాన్‌తో ఎక్కడ చెడింది:
అమెజాన్ సంస్థ తనకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ విభాగం ద్వారా ఫ్యూచర్ రిటైల్‌లో 10 శాతం వాటా కొనుగోలు చేయాలని భావించింది. ఆన్ లైన్‌తో పాటు ఆఫ్ లైన్‌లో కూడా పాగా వేయాలని అమెజాన్ ఆలోచన. ఇప్పటికే షాపర్స్ స్టాప్ సహా ఆదిత్య బిర్లా గ్రూపుల్లో 5 శాతానికి పైగా వాటాను కొనుగోలు చేసింది అమెజాన్. అయితే ఫ్యూచర్ అధినేత కిషోర్ బియానీతో ఎక్కడ చెడిందో కానీ డీల్ ముందడుగు వేయలేదు. వీటికి తోడు ఈకామర్స్‌లో ఎఫ్‌డిఐ అనుమతులపై కేంద్రం నిబంధనలు మార్చింది. ఇది కూడా మరో కారణంగా కనిపిస్తోంది.

Read more about: amazon big bazaar
English summary

అమెజాన్‌తో పోటాపోటీ ! రూ.2750 కోట్లు రెడీ చేసిన బిగ్ బజార్ | Kishore Biyani’s Future Retail Prepares Rs 2,750-Crore War Chest

Kishore Biyanis Future retail readies to take on amazon online. They want to raise 2750 crores to expand their business inspite of tough online competition.
Story first published: Tuesday, February 5, 2019, 14:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X